News


ఎఫ్‌ఐఐల వాటాలు పెరిగిన స్టాక్స్‌..?

Monday 23rd December 2019
Markets_main1577040032.png-30361

విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) 2019 మొదటి మూడు త్రైమాసికాల్లో భారత ఈక్విటీ మార్కెట్లలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు కుమ్మరించి, 141 కంపెనీల్లో వాటాలు పెంచుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ 141 స్టాక్స్‌ల్లో కేవలం 18 స్టాక్స్‌ ఈ ఏడాది 50 శాతం వరకు ర్యాలీ చేశాయి. టెలికం, ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌, ఐటీ, ఇన్సూరెన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, అగ్రి స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను ముందుగా గుర్తించి వీరు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం. 

 

ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకుని ర్యాలీ చేసిన స్టాక్స్‌లో క్యాప్రిగ్లోబల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌, నారాయణ హృదయాలయ, జేకే సిమెంట్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఇన్ఫో ఎడ్జ్‌, ఆస్ట్రా జెనెకా ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, అవాస్‌ ఫైనాన్షియర్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌, ఏజీసీ నెట్‌వర్క్స్‌, హిందుస్తాన్‌ ఫుడ్స్‌, అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌ క్యాపిటల్‌ ఉన్నాయి. 

 

మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉండి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ స్టాక్స్‌ ర్యాలీ చేస్తాయన్న అంచనాలతో ఎఫ్‌ఐఐలు ఇన్వెస్ట్‌ చేసి ఉంటారని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. ‘‘ఎఫ్‌ఐఐలు ఎంపిక చేసిన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం వెనుక వాటి ఆకర్షణీయమైన విలువలే కారణం అయి ఉంటాయని భావిస్తున్నాం. ఓఎన్‌జీసీ (అధిక డివిడెండ్‌), హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌ అన్నవి ఫండమెంటల్‌గా బలమైనవి. పైగా ఆయా విభాగాల్లో ఇవి మార్కెట్‌ లీడర్లుగా ఉన్నాయి’’ అని మిశ్రా వివరించారు. 

 

ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న స్టాక్స్‌లో అధిక భాగం మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలోనివే కావడం గమనార్హం. 60 స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐల వాటా 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇవి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కజారియా సిరామిక్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్‌ఈసీ, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, మ్యాక్స్‌ ఇండియా, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌. ‘‘మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో ఆకర్షణీయమైన విలువలు ర్యాలీకి తోడ్పడుతున్నాయి. ఇవి చాలా చౌకగా లభిస్తున్నాయి. ఈ జాబితాలోని కొన్ని కంపెనీల వ్యాపారంలో రెండంకెల వృద్ధి నెలకొంది. కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌మనీ ఎందులోకి వెళుతుందో చూసేందుకు ఎఫ్‌ఐఐల వాటా ఒక అంశం’’అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ తెలిపారు. ఎఫ్‌ఐఐల వాటా పెరగడం మంచి సంకేతమేనని, అయితే, ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టే ముందు కంపెనీల ఆర్థిక మూలాలను అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ అతీష్‌ మత్లవాలా సూచించారు. వీటిల్లో టాటా గ్లోబల్‌, కజారియా సిరామిక్స్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు మధ్య నుంచి దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇస్తాయని అంచనా వేశారు.You may be interested

రికార్డుల ర్యాలీ కొనసాగేనా..?

Monday 23rd December 2019

ఈ వారంలోనే డిసెంబర్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు సోమవారం సెన్సెక్స్‌ సూచీ నుంచి టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్‌ బ్యాంక్, వేదాంత బయటకు- ఇండెక్స్‌లోకి చేరనున్న అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా- సూచీలో మార్పులు, ఏడాది చివరి రోజుల కారణంగా కన్సాలిడేషన్‌కు అవకాశం..!- ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం- క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం మార్కెట్‌కు సెలవు న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గతవారం వరుస రికార్డులతో

ప్రైవేటు బ్యాంకులు, ఫార్మా అనుకూలం: ఎమ్‌కే గ్లోబల్‌

Monday 23rd December 2019

ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుందని, 2019లో చూసిన దానితో పోలిస్తే మరింత విస్తృతంగా ఉంటుందని ఎమ్‌కే గ్లోబల్‌ ఫండ్‌ మేనేజర్‌ సచిన్‌ షా అన్నారు. ఇప్పటి వరకు ప్రధాన సూచీల్లోని స్టాక్స్‌ ఏ విధంగా అయితే ర్యాలీ చేశాయో.. అదే విధంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో మెరుగైన, సమర్థవంతమైన నిర్వహణ కలిగినవి ర్యాలీ చేస్తాయన్న అభిప్రాయాన్ని షా వ్యక్తం చేశారు. కనుక ప్రధాన సూచీలకు వెలుపల ఈ విధమైన నాణ్యమైన

Most from this category