క్యు1లో ఎఫ్ఐఐలు వాటాలు పెంచుకున్న కంపెనీలివే!
By D Sayee Pramodh

దేశీయ మార్కెట్లోని 84 కంపెనీల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు క్యు1లో వాటాలు పెంచుకున్నారు. ఇలా ఎఫ్ఐఐలు వాటాలు పెంచుకున్న కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఐఓసీ, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, ఎన్ఎండీసీ, ముతూట్ ఫైనాన్స్, కార్పొరేషన్ బ్యాంక్, ఆర్తి ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఎఫ్ఐఐలు వాటాలు పెంచుకున్న నేపథ్యంలో ఈ షేర్లలో కొత్తగా ఎంటర్కాదలిస్తే కేవలం ఈ ఒక్క పారామీటర్ ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ‘‘ఎఫ్ఐఐలు వాటాలు పెంచుకోవడం పాజిటివ్ అంశమే అయినప్పటికీ కేవలం ఈ ఒక్క అంశం ఆధారంగా పెట్టుబడుల నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. ఎఫ్ఐఐలు తమ పోర్టుఫోలియో బాలెన్సింగ్లో భాగంగా కొన్ని స్టాకులను కొనడం, అమ్మడం చేస్తుంటాయి. అందువల్ల ఎఫ్ఐఐలను గుడ్డిగా ఫాలో కాకూడదు.’’ అని సామ్కో సెక్యూరిటీస్ రిసెర్చ్ హెడ్ ఉమేశ్ మెహతా చెప్పారు. విదేశీ మదుపరులు వాటాలు పెంచుకున్న టాప్ 20 కంపెనీలు.......
ఎఫ్‌పీఐలు వాటాలు పెంచుకున్న కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్ లాంటి వృద్ది అవకాశాలున్నవాటిని పరిశీలించవచ్చన్నారు. జూన్ త్రైమాసికంలో ఓఎన్జీసీ, కోల్ఇండియాల్లో ఎఫ్ఐఐలు వాటాలు పెంచుకోవడానికి కమోడిటీ ధరలు తగ్గడం కారణమని, ప్రస్తుతం ఈ షేర్ల జోలికి పోకపోవడం మంచిదని చెప్పారు. రిటైలర్లు అన్ని టెక్నికల్ అంశాలను పరిశీలించి వీటిలో ఎంటర్కావాలన్నారు. ఎఫ్ఐఐల వాటా త్రైమాసికం నుంచి త్రైమాసికానికి పెరుగుతూ ఉంటే మాత్రం అలాంటి కంపెనీలపై పాజిటివ్ నిర్ణయం తీసుకోవచ్చని క్యాపిటల్ ఎయిమ్ రిసెర్చ్ హెడ్ రమేశ్ తివారీ చెప్పారు. మరోవైపు జూన్ త్రైమాసికంలో దాదాపు 100 కంపెనీల్లో ఎఫ్ఐఐలు వాటాలను తగ్గించుకున్నారు. వీటిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీఓబీ, అంబుజా సిమెంట్స్, బయోకాన్, ఓఎఫ్ఎస్ఎస్, కాడిలా హెల్త్‌కేర్ తదితరాలున్నాయి.
You may be interested
3.65 కోట్లకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య
Wednesday 17th July 2019జూన్ 30తో ముగిసిన ఏడాదిలో 41 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు దీనికి ముందు రెండేళ్లలో 35 లక్షలు, 25 లక్షల కొత్త ఖాతాలు చేరిక బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో ఈక్విటీ సంస్కృతి విస్తరణ దేశియంగా ఈక్విటీ మార్కెట్ల వైపు కొత్త ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారని, జూన్ 30తో ముగిసిన ఏడాదికి గాను మొత్తం 41 లక్షల ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచారని సెబీ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. సెబీ 2011
బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లు అప్
Wednesday 17th July 2019బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ బుధవారం ట్రేడింగ్‌లో దాదాపు 1శాతం లాభపడింది. ఎన్ఎస్ఈలో ఈరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్ నేడు 30,622.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్ ఇంట్రాడేలో 250 పాయింట్లు మేర లాభపడింది. 30,800ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్ గతముగింపు (30,570.80)తో పోలిస్తే 130 పాయింట్లు(దాదాపు అరశాతం)