News


ఇండెక్స్‌ షార్ట్‌ పొజిషన్లు తగ్గించుకున్న ఎఫ్‌ఐఐలు

Thursday 28th November 2019
Markets_main1574915413.png-29918

సూచీల్లో మరింత ర్యాలీకి అవకాశం
విదేశీ ఫండ్స్‌ అక్టోబర్‌ నుంచి దేశీయ సూచీల్లో కొనుగోళ్ల జోరు పెంచాయి. దీంతో సూచీలు రికార్డు హైలకు చేరాయి. గతంలో తీసుకున్న బేరిష్‌ బెట్స్‌ను ఫండ్స్‌ వదిలించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల తాజా బుల్‌ రన్‌ మరికొంత కాలం కొనసాగుతుందని డెరివేటివ్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారానికి నవంబర్‌నెల్లో ఎఫ్‌ఐఐలు రూ.22710 కోట్ల కొనుగోళ్లు జరిపాయి. ఇదే సమయంలో నికర ఇండెక్స్‌షార్ట్స్‌ను 43327 కాంట్రాక్టుల నుంచి 4859కాంట్రాక్టులకు తగ్గించుకున్నాయి. ఈ షార్ట్‌కవరింగ్‌ కారణంగా బుధవారం సూచీలు ముందుకు కదిలాయి. ఈ షార్ట్‌ కవరింగ్‌, కొత్త కొనుగోళ్లు కలిసి మరింత షార్ట్‌ స్వీజింగ్‌కు దారితీస్తాయని, దీంతో నిఫ్టీ ఆల్‌టైమ్‌హై నుంచి మరో 150 పాయింట్లైన ముందుకు వెళుతుందని దోలత్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. నవంబర్‌ సీరిస్‌లో 12100 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. కానీ బుధవారం ఇదే ప్రైస్‌ వద్ద పుట్‌ రైటింగ్‌ భారీగా జరిగింది. అందువల్ల మార్కెట్‌ ఇక ఈ సీరిస్‌లో 12100 పాయింట్ల దిగువకు రాకపోవచ్చని అంచనా.

ఇటీవల కాలంలో ఎంఎస్‌సీఐ కొన్ని హెవీ వెయిట్ల వెయిటేజ్‌ పెంచిన నేపథ్యంలో ఆయా షేర్ల కొనుగోళ్లకు ముందు హెడ్జింగ్‌ కోసం ఇండెక్స్‌ షార్ట్స్‌ను ఎఫ్‌ఐఐలు తీసుకొని ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ షేర్ల కొనుగోళ్లు పూర్తయినందున ఎఫ్‌ఐఐలు షార్ట్‌కవరింగ్‌కు దిగిఉంటారని భావిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ ఫండ్స్‌ కొన్న షేర్లు మరింత ముందుకు దూసుకుపోతాయని అంచనా. నిఫ్టీ స్వల్పకాలానికి 12200 పాయింట్లను దాటవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. శుక్రవారం జీడీపీ గణాంకాల ఆధారంగా తదుపరి కదలికలుంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


FII

You may be interested

32,000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 28th November 2019

సూచీల రికార్డు ర్యాలీలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ సైతం కొత్త రికార్డు అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు తొలిసారి 32000 స్థాయిని అధిగమించింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,981.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో పాటు, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లో యస్‌బ్యాంక్‌(3.50శాతం), ఆర్‌బీఎల్‌(3శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(ఆల్‌టైం) ర్యాలీతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 150

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 28th November 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎప్‌ అండ్‌ ఓ డెరివేటివ్స్‌ ముగింపు:- నేడు నవంబర్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టు ముగింపు తేది కావడంతో ట్రేడర్లు తన పొజిషన్లను డిసెంబర్‌ కాంట్రాక్టుకు రోలోవర్‌ చేసుకోనున్నారు. దీంతో నేడు మార్కెట్‌ కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  విదేశీ పెట్టుబడులు:- ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం బుధవారం ఎఫ్‌పీఐలు రూ.42.93 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను, డీఎఫ్‌ఐఐలు రూ.439.93 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు

Most from this category