News


ఎఫ్‌ఐఐల పెట్టుబడులే కీలకం..

Monday 18th March 2019
Markets_main1552892187.png-24661

-ఎఫ్‌ఐఐల పెట్టుబడులే కీలకం..
- మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడ్‌ సమావేశం
- వడ్డీ రేట్లపై ప్రకటన, ఆర్థిక అంచనాల వెల్లడి
- బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ) వడ్డీ రేట్ల నిర్ణయం కూడా ఈవారంలోనే..
- మంగళవారం దేశీ క్యూ3 కరెంట్‌ ఖాతా లోటు ప్రకటన
- ఈ అంశాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌ఐఐలు
- హోలీ సందర్భంగా 21న (గురువారం) మార్కెట్లకు సెలవు

ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) భారత స్టాక్‌ మార్కెట్లలో తమ పెట్టుబడులను జోరుగా కొనసాగించిన నేపథ్యంలో గతవారం ప్రధాన సూచీలు మూడున్నర శాతం మేర లాభాలను నమోదుచేశాయి. రెట్టించిన ఉత్సాహంతో వీరు పెట్టుబడులను కొనసాగించడంతో నిఫ్టీ వారాంత ట్రేడింగ్‌ రోజున 11,427 వద్దకు చేరుకుంది. అయితే, ఇక్కడ నుంచి జీవితకాల గరిష్టస్థాయిలకు చేరుకుంటుందా..? లేదంటే, స్వల్పకాలిక దిద్దుబాటుకు లోనవుతుందా? అనే ప్రధాన అంశానికి ఎఫ్‌ఐఐల నిర్ణయమే అత్యంత కీలకం కానుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈనెల్లో ఇప్పటివరకు దేశీ స్టాక్‌ మార్కెట్లో రూ.17,055 కోట్లను పెట్టుబడి పెట్టిన వీరు ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే సూచీలు ఊర్థ్వముఖంగా ప్రయాణం కొనసాగిస్తాయని భావిస్తున్నారు. ‘ఎమర్జింగ్‌ మార్కెట్లతో పోల్చితే ఫిబ్రవరి మధ్యవరకు దేశీ ప్రధాన సూచీలు అండర్‌పెర్ఫార్మ్‌ చేశాయి. ఇప్పుడైతే ఈ ట్రెండ్‌లో మార్పు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలపై అంచనాలు, ఇక్కడి మార్కెట్లో స్వల్పకాలిక రాబడికి ఉన్న అవకాశాల ఆధారంగా ఎఫ్‌ఐఐల పెట్టుబడుల కొనసాగింపు ఉండనుంది. ఒకవేళ వీరి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం షార్ప్‌ కరెక్షన్‌ ఉంటుంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని విశ్లేషించారు. నిఫ్టీలో 38 శాతం వాటా కలిగిన ఫైనాన్షియల్‌ రంగంలో ప్రస్తుతం పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. వీటిలో ప్రైవేటు బ్యాంకులు బలమైన రిటైల్‌ వృద్ధిని నమోదుచేస్తుండగా.. పీఎస్‌యూ బ్యాంకులు మెండిబకాయిల భారం నుంచి బయటపడడం సానుకూలంగా ఉంది. ఎన్నికల తరువాత ఈ రెండు రంగాల బ్యాంకులు మంచి వృద్ధిని నమోదుచేయనున్నాయనే అంచనాల నేపథ్యంలో ప్రస్తుత జోరు కొనసాగేందుకే అవకాశం ఉందని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్‌ జోషి అన్నారు. ఇక హోలీ సందర్భంగా 21న (గురువారం) మార్కెట్లకు సెలవుకావడంతో ఈవారం ట్రేడింగ్‌ నాలుగురోజులకే పరిమితమయ్యింది.

అంతర్జాతీయ అంశాలపై దృష్టి..
అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ).. కీలక వడ్డీ రేట్లపై ఈవారంలో తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అత్యధిక శాతం నిపుణుల అంచనాల ప్రకారం ఫెడరల్‌ ఫండ్‌ రేట్లు 2.25 శాతం నుంచి 2.5 శాతం మధ్యలో ఉండేందుకు అవకాశం ఉంది. పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితిపై ఫెడ్‌ చేయనున్న ప్రకటన ఈవారంలో మార్కెట్లకు కీలకంకానుంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ) వడ్డీ రేట్ల నిర్ణయం గురువారం వెల్లడికానుంది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని తెలుస్తోంది. ఈవారంలో ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాలు వెల్లడికానున్నాయి. యూకే ద్రవ్యోల్బణం బుధవారం వెల్లడికానుండగా.. జపాన్‌ దేశ బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ సోమవారం, ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. 

ఎఫ్‌ఐఐల నికర కొనుగోళ్లు
మార్చి 1–15 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.20,400 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. రూ.17,919 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.2,499 కోట్లను డెట్‌ మార్కెట్లో పెట్టుబడిపెట్టారు. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుందనే అంచనాలు సన్నగిల్లడం, అమెరికా–చైనాల మధ్య చర్చలు సానుకూలంగా ఉండడం, ముడిచమురు ధరలు దిగిరావడం వంటి పాజిటివ్‌ అంశాలు ఇందుకు కారణమని ఫండ్స్‌ఇండియా మ్యూచువల్‌ ఫండ్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ విద్యా బాల అన్నారు.You may be interested

ఇంటర్వెల్‌ ఫండ్‌ అంటే?

Monday 18th March 2019

ప్ర: నేను కొంత మొత్తాన్ని గత రెండేళ్ల నుంచి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. కానీ ఈ ఫండ్‌ పనితీరు గత ఏడాది కాలంలో ఏమంత సంతృప్తికరంగా లేదు. ఈ ఫండ్‌ యూనిట్లన్నింటినీ విక్రయించి ఈ ఫండ్‌ నుంచి బైటపడాలా లేక కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆపేయాలా ? లేకుంటే సిప్‌లు కొనసాగించమంటారా?  -ధీర, హైదరాబాద్‌  జ: ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పనితీరును అంచనా వేసేటప్పుడు ఒక ముఖ్యమైన

పసిడి భవితపై ‘ఫెడ్‌’ రేటు ప్రభావం

Monday 18th March 2019

అమెరికా ఆర్థిక పరిస్థితి, కీలక వడ్డీ రేట్లపై (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) బుధవారం (20వ తేదీ) ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షా కమిటీ తీసుకునే నిర్ణయంపై పసిడి సమీప భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌- నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) 1,200 డాలర్ల  నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి

Most from this category