News


అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌..!

Monday 18th November 2019
Markets_main1574047979.png-29651

  • అమెరికా–చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం 
  • గురువారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ వెల్లడి-
  • ఈవారంలో రేంజ్‌ బౌండ్‌కు చాన్స్‌: సామ్కో సెక్యూరిటీస్‌

ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల సీజన్‌ దాదాపుగా పూర్తైన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలే ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా–చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఇది అధ్యక్షుల స్థాయిలోనే ఉండగా.. కేవలం మంత్రులు మాత్రమే దీనిపై సంతకాలు చేస్తారని తెలియజేశారు. ఈ సానుకూల వార్తల నేపథ్యంలో అమెరికా స్టాక్‌ సూచీలు శుక్రవారం 0.80 శాతం లాభపడి జీవితకాల గరిష్టస్థాయిలకు చేరుకున్నాయి. అయితే, ఒప్పందం అంశంపై శని, ఆదివారాల్లో పూర్తి స్పష్టత లేనందున దేశీయంగా మార్కెట్‌ వర్గాలు ఆ రెండు దేశాల ప్రకటలనపై దృష్టిసారించారని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు చెబుతున్నారు. ‘దేశీయంగా మార్కెట్‌ను నడిపించే ప్రధానాంశాలేవీ లేకపోవడం వల్ల అమెరికా–చైనాల మధ్య వాణిజ్య చర్చల వంటి అంతర్జాతీయ అంశాలే ఈవారం కీలకం కానున్నాయి. ట్రేడింగ్‌ రేంజ్‌ బౌండ్‌కే పరిమితం కానుందని అంచనావేస్తున్నాం’ అని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ విశ్లేషించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం పూర్తయితే మాత్రం దేశీ సూచీలు సైతం ఆల్‌ టైం హైని నమోదుచేయవచ్చని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు.  

అమెరికా ఆర్థిక గణాంకాల ప్రభావం..
ఫెడ్‌ అక్టోబర్‌ పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ఈనెల 21న (గురువారం) ప్రకటించనుంది. గతనెలకు చెందిన యూఎస్‌ రిటైల్ విక్రయాల డేటా 15న వెల్లడికానుండగా.. మార్కిట్ తయారీ పీఎంఐ, సర్వీసెస్‌ పీఎంఐ 22న వెల్లడికానున్నాయి.

ఉద్దీపనలకు అవకాశం...
దేశీయంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 18 (సోమవారం) ప్రారంభం కానుండగా.. తాజా ఉద్దీపనలు ఏవైనా ఉంటే మాత్రం మార్కెట్‌కు సానుకూలం అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

క్రూడ్‌ ధర పెరిగింది
ముడి చమురు ధరలు వారాంతాన ఒక్కసారిగా లాభపడ్డాయి. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్ఛేంజ్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ (జనవరి డెలివరీ) శుక్రవారం 1.70 శాతం లాభపడి 63.34 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావంతో డాలరుతో రూపాయి మారకం విలువ 18 పైసలు నష్టపోయి 71.78 వద్దకు బలహీనపడింది. ప్రస్తుతం రూపాయి ట్రెండ్‌ బలహీనంగానే ఉందని, 71.50 వద్ద రెసిస్టెన్స్‌ ఎదుర్కొనుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌  విశ్లేషకులు స్ట్రాటజీ వీకే శర్మ అన్నారు. 

నవంబర్‌లో ఎఫ్‌పీఐ నిధులు రూ. 19,203 కోట్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ. 19,203 కోట్లను కుమ్మరించారు. నవంబర్‌ 1–15 కాలంలో వీరు స్టాక్‌ మార్కెట్లో రూ. 14,436 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ. 4,767 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా పేర్కొంది.You may be interested

40,030 పాయింట్ల మద్దతు సెన్సెక్స్‌కు కీలకం

Monday 18th November 2019

కొద్ది నెలలుగా అమెరికా మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్న యాపిల్, ఫేస్‌బుక్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్‌ వంటి షేర్ల సాయంతోనే ఆ దేశపు మార్కెట్లు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. మరోవైపు ట్రేడ్‌ డీల్‌ పట్ల అనుమానాలు, వృద్ధి మందగించడం, స్వదేశీ కరెన్సీలు పతనంకావడం వంటి అంశాలతో భారత్‌తో సహా పలు వర్థమాన మార్కెట్లు, యూరప్‌ సూచీల అప్‌ట్రెండ్‌ గతవారం హఠాత్తుగా ఆగిపోయింది. మరో ఒకటి, రెండు వారాలు ర్యాలీ నిలిచిపోతే,,,ఈ సంవత్సరాంతంలో కరెక్షన్‌

ఇండెక్స్‌ ఫండ్స్‌ కూడా పోర్ట్‌ఫోలియోలో ఉండాలి

Sunday 17th November 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు కొంత మొత్తం పెట్టుబడులను ఇండెక్స్‌ ఫండ్స్‌కు కూడా కేటాయించుకోవాలని ఆర్థిక సలహాదారుల సూచన. ముఖ్యంగా ఇటీవలి కాలంలో మార్కెట్లను పరిశీలిస్తే.. ప్రధాన సూచీలు లాభాలను ఇచ్చాయి. కానీ, సూచీల్లోనే సగం స్టాక్స్‌ ఏ మాత్రం రాబడులను ఇవ్వలేదు. అయినా నిఫ్టీ నికరంగా లాభాలను ఇవ్వడం చూశాం. దీంతో ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు సూచీల ర్యాలీతో కచ్చితంగా లాభపడ్డారు. నిజానికి ఇన్వెస్టర్లలోనూ

Most from this category