News


వేలం వెర్రిగా కొన్నారు.. వేగంగా విక్రయిస్తున్నారు!

Wednesday 31st July 2019
Markets_main1564564353.png-27447

ఎఫ్‌పీఐ వాటాలు ఎక్కువున్న స్టాకుల్లో డౌన్‌ట్రెండ్‌
లబోదిబోమంటున్న చిన్న ఇన్వెస్టర్లు
ఎకానమీపై ఆశలతో దేశీయ మార్కెట్లోని కొన్ని స్టాకుల్లో ఎఫ్‌పీఐలు(విదేశీ సంస్థాగత మదుపరులు) భారీగా వాటాలు కొనుగోలు చేశారు. దాదాపు 38 బీఎస్‌ఈ స్టాకుల్లో ఎఫ్‌పీఐలకు దాదాపు మూడింట ఒకవంతు వాటా ఉంది. అయితే బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. ఒకదశలో వేలంవెర్రిగా కొన్న స్టాకులను సైతం ఎఫ్‌పీఐలు మొహమాటం లేకుండా భారీగా విక్రయిస్తున్నాయి. దీంతో ఎఫ్‌పీఐలకు వాటాలున్న స్టాకుల్లో కేవలం రెండు స్టాకులు మాత్రమే బడ్జెట్‌ అనంతరం ఇప్పటివరకు పాజిటివ్‌ రాబడినిచ్చాయి. బడ్జెట్లో ప్రవేశపెట్టిన సూపర్‌ రిచ్‌ టాక్స్‌తో చాలామంది ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో విక్రయాలకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐల వాటాలు ఎక్కువగా ఉండి, ఫండమెంటల్స్‌ బలహీనపడుతున్న కంపెనీల స్టాకులు మరింత పతనానికి అనువుగా ఉన్నాయని, వీటిలో ఎఫ్‌పీఐల విక్రయాలు మరింత జోరందుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల్లో విదేశీ మదుపరులు దేశీయ మార్కెట్లో దాదాపు 11800 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపాయి. గత అక్టోబర్‌ తర్వాత ఎఫ్‌ఐఐలు ఈ రేంజ్‌లో నిధులు ఉపసంహరించుకోవడం ఇదే ప్రథమం.
60 శాతం పతనం
ఎఫ్‌పీఐలకు దాదాపు 33- 74 శాతం వరకు వాటాలున్న స్టాకులను పరిశీలిస్తే ఇవన్నీ దాదాపు 60 శాతం వరకు బడ్జెట్‌ అనంతరం పతనమైనట్లు ఏస్‌ ఈక్విటీ గణాంకాలు చూపుతున్నాయి. మార్కెట్లో బ్లూచిప్స్‌ అన్నింటిలోకి ఆకర్షణీయంగా భావించే హెచ్‌డీఎఫ్‌సీ కవలలే దాదాపు 7 శాతం పతనమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 38.6 శాతం, హెచ్‌డీఎఫ్‌సీలో 74.7 శాతం ఎఫ్‌పీఐలకు వాటాలున్నాయి. సర్‌చార్జి నచ్చని పలు ఎఫ్‌పీఐలు బ్లూచిప్‌ కంపెనీలని కూడా చూడకుండా వీటిని విక్రయిస్తున్నారని ఆర్‌సెక్యూరిటీస్‌ వ్యాఖ్యానించింది. వాల్యూషన్ల పరంగా కొన్ని స్టాకులు ఆకర్షణీయంగా ఉన్నా, ఎఫ్‌పీఐలు పట్టించుకోవడం లేదని, పన్ను విధింపునే గమనిస్తున్నాయని తెలిపింది. దీనికితోడు వ్యవస్థలో మందగమనం కూడా ఎఫ్‌పీఐలను విక్రయాలకు ప్రేరేపిస్తోందని తెలిపింది. బడ్జెట్‌ తర్వాత కాక్స్‌అండ్‌ కింగ్స్‌ షేరు 60 శాతం, ఐబీహౌసింగ్‌ 25 శాతం క్షీణించాయి. 
దిగ్గజాలే కానీ..
ఎఫ్‌పీఐలకు ఫేవరేట్లుగా పరిగణించే పలు స్టాకులు బడ్జెట్‌ తర్వాత భారీ పతనాలు చూశాయి. వీటిలో మైండ్‌ట్రీ 20 శాతం క్షీణత నమోదు చేసింది. ఇందులో విదేశీ మదుపరులకు దాదాపు 33 శాతం వాటా ఉంది. మణుప్పురం ఫైనాన్స్‌, బిర్లాసాఫ్ట్‌, ఎంఅండ్‌ఎం, యూపీఎల్‌, సైయంట్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు దాదాపు 17- 20 శాతం, పీటీసీ, పేజ్‌, హీరోమోటో, యాక్సిస్‌బ్యాంక్‌, టీమ్‌లీజ్‌, జస్ట్‌డయిల్‌, మాక్స్‌ ఇండియా, ఐడీఎఫ్‌సీ, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఎన్‌ఐఐటీ టెక్‌ షేర్లు సుమారు 10- 14 శాతం పతనమయ్యాయి. చాలా స్టాకుల్లో ఎఫ్‌పీఐలు దాదాపు 20- 30 శాతం వాటాలను విక్రయించే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధంగా హాట్‌మనీ వెనక్కువెళితే మార్కెట్లో రికవరీ ఇప్పట్లో కనిపించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


FPI

You may be interested

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 5 శాతం డౌన్‌...ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్‌ చేతికే వాటా?

Wednesday 31st July 2019

జీ ఎంటర్‌టైన్‌మెట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాన్యం కంపెనీలో కొంతశాతం వాటా విక్రయానికి మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. కంపెనీలో ప్రతిపాదిత వాటా విక్రయానికి రెండు ఆఫర్లు వచ్చాయి. వాటిలో నిర్వహణా వాటా కొనుగోలుకు యూఎస్ కేబుల్‌ దిగ్గజం నుంచి కామ్‌కాస్ట్‌తో పాటు ఫైనాన్షియల్‌ ఫండ్‌ అటైరోస్‌, బ్లాక్‌స్టోన్‌, జేమ్స్‌ మర్దోక్‌కు చెందిన లూపా సిస్టమ్స్‌ కన్సార్షియం నుంచి నాన్‌-బైండింగ్‌ ఆఫర్‌ వచ్చింది. ఈ ఆఫర్‌లో 26 శాతం వాటాను ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలుచేసే

స్వల్ఫ లాభాల్లో ఫార్మా షేర్లు

Wednesday 31st July 2019

మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో నష్టాల నుంచి కొలుకుంటున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ మధ్యాహ్నాం 2.30 సమయానికి 1.08 శాతం లాభపడి 7,963.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సన్‌ ఫార్మా 3.56 శాతం, అరబిందో ఫార్మా 3.38 శాతం, కాడియల్‌ హెల్త్‌ కేర్‌ 2.07 శాతం, లుపిన్‌ 2.03 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 0.79 శాతం, గ్లెన్‌మార్క్‌ 0.53 శాతం, డా. రెడ్డీస్‌ 0.40 శాతం, సిప్లా

Most from this category