News


ఎఫ్‌ఐఐల నికర కొనుగోళ్లు రూ.36 కోట్లే..!

Saturday 21st September 2019
Markets_main1569063778.png-28475

కేంద్రం ప్రకటించిన కార్పోరేట్‌ పన్ను కోతకు మురిసిన మార్కెట్‌ శుక్రవారం భారీగా లాభపడింది. ట్రేడింగ్‌ ఆద్యంతం ఇటు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లలతో పాటు, అటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) కోనుగోళ్లతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.6.82 లక్షల కోట్ల మేర పెరిగింది. సాదారణంగా మార్కెట్‌లో ఈ స్థాయిలో కొనుగోళ్లు జరిగినపుడు ఎఫ్‌పీఐ కొనుగోళ్లదే పైచేయి ఉంటుంది. అయితే నిన్నటి ట్రేడింగ్‌లో ఎఫ్‌పీఐలు నికర కొనుగోళ్లు కేవలం రూ.36 కోట్లుగా నమోదైనట్లు ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు చెబుతున్నాయి. నిన్న ఎఫ్‌పీఐల మొత్తం కొనుగోళ్లు రూ.17032.28 కోట్లు ఉండగా, మొత్తం అమ్మకాల విలువ రూ.16996.5 కోట్లుగా ఉన్నాయి. ఎఫ్‌పీఐలు స్పాట్‌ మార్కెట్లో ఎక్కువగా కొనకపోయినా, డెరివేటివ్స్‌ విభాగంలో భారీ షార్ట్‌ కవరింగ్‌ జరపడం ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సెప్టెంబర్‌ 12 తరువాత స్పాట్‌ మార్కెట్లో 5 రోజుల వరుస అమ్మకాల అనంతరం నిన్నటి ట్రేడింగ్‌లో ఎఫ్‌పీఐలు కొద్దిగానైనా కొనుగోళ్లు జరపడం విశేషం. మరోవైపు ఇదేరోజు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ)భారీ ఎత్తున కొనుగోళ్లు చేశారు. డీఐఐల నికర కొనుగోళ్లు రూ.3001.32 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం కొనుగోళ్ల విలువ రూ.11174.91 కోట్లు ఉండగా, మొత్తం అమ్మకాల విలువ రూ.8173.59 కోట్లుగా ఉన్నాయి. 



You may be interested

ర్యాలీ కొనసాగేనా..!

Monday 23rd September 2019

   సెప్టెంబర్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఈవారంలోనే.. అమెరికా–చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి గురువారం అమెరికా క్యూ2 జీడీపీ గణాకాంలు వెల్లడి ముంబై: దేశీ కార్పొరేట్‌ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే స్థాయి నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారాంతాన ప్రకటించిన నేపథ్యంలో సెన్సెక్స్‌ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్లు లాభపడ్డాయి. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,285 పాయింట్లు,

పన్ను తగ్గింపుతో తక్షణ వృద్ధిని ఆశించలేం : మూడీస్‌

Saturday 21st September 2019

కేంద్ర ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గిం‍చడం, దేశ ద్రవ్యలోటు ఒత్తిళ్లు పెరగడానికి కారణమవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ శనివారం తెలిపింది.  ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. తగ్గిన ట్యాక్స్‌ వలన దేశంలో పెట్టుబడులు పెరిగి, పన్నుల సేకరణ వృద్ధి చెందుతుందని, ఫలితంగా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం భర్తీ అవుతుందని తాము

Most from this category