News


నేటి వార్తల్లోని షేర్లు

Thursday 30th January 2020
Markets_main1580364250.png-31332


వివిధ వార్తలకు అనుగుణంగా స్టాక్‌మార్కెట్‌లో గురువారం ప్రభావితమయ్యే షేర్లు

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ బ్యాంక్‌ ఇటీవల విలీనం అయ్యి ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ డిసెంబర్‌ 31తో ముగిసిన  క్యూ3 నికర నష్టం రూ.1,639 కోట్లుగా ప్రకటించింది. కాగా గతేడాది నికర నష్టం రూ.2,504 కోట్లుగా ఉంది.

కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌:  గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2లో ఆడిట్‌ చేయని కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.190.02 కోట్లుగా కాఫీడే ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రకటించింది. గతేడాది కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.24 కోట్లుగా ఉంది. 

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రూ.12,773 కోట్లను దారి మళ్లీంచినట్లు మనీలాండరింగ్‌ కేసులో ఈడీ కోర్టుకు వెల్లడించింది. 80 డమ్మీ కంపెనీల సృష్టించి వాటి ద్వారా గడిచిన దశాబ్దంలో ఒక లక్షమంది నకిలీ రుణ గ్రహీతలకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ఈడీ పేర్కొంది.

వేదాంత: నాన్‌కన్వర్టబుల్‌ డిబెంచర్ల ద్వారా రూ.2,500 కోట్లను సమీకరించాలని వేదాంత డైరెక్టర్లతో కూడిన కమిటీ నిర్ణయించింది.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:  జీయో స్టీల్‌ ఎల్‌ఎల్‌సీలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 39 శాతం వాటాను జార్జియన్‌ స్టీల్‌ గ్రూప్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు విక్రయించినట్లు  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్రకటించింది. 

టాటా పవర్‌: గతేడాది ఖర్చులు తగ్గించడంతో  ప్రస్తుత క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాతం పెరిగి రూ.246 కోట్లకు చేరింది టాటా పవర్‌ వెల్లడించింది.

జీసీపీఎల్‌:  దేశీయ వ్యాపారంలో అమ్మకాల పరిమాణం పెరగడంతో డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో  కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5.11 శాతం పెరిగి రూ.445.20 కోట్లకు చేరిందని జీసీపీఎల్‌ ప్రకటించింది.

క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కనూ​‍్జమర్‌ ఎలక్ట్రికల్స్‌: ఈ కంపెనీ క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.161 కోట్లకు చేరింది.

జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌: డోమినోస్‌ పిజా, డన్‌కిన్‌ డోనట్స్‌ వంటి ఆహార సంస్థలను నడుపుతున్న జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3 లో నికర లాభం 7.4 శాతం పెరగడంతో రూ.104 కోట్లకు చేరింది.

ఎస్కార్ట్స్‌: ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీ ఎస్కార్ట్స్‌ క్యూ3లో  నికర లాభం 9.27 శాతం పెరుగుదలతో రూ.153.1 కోట్లకు చేరింది. 
 



You may be interested

స్పెషాలిటీ కెమికల్‌ షేర్ల జోరు

Thursday 30th January 2020

కరోనా వైరస్‌ కారణంగా దేశీ కంపెనీలకు లబ్ది  ఏడాది గరిష్టాలకు స్పెషాలిటీ కెమికల్‌ షేర్లు తాజాగా ప్రపంచ అత్యవసర పరిస్థితికి తెరతీస్తున్న చైనీస్‌ కరోనా వైరస్‌ దేశీ కంపెనీలకు లబ్ది చేకూర్చనున్న అంచనాలు పెరుగుతున్నాయి. చైనీస్ హుబే ప్రొవిన్స్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ఇటీవల పలు దేశాలకు విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతోంది. దీంతో దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలకు ఆర్డర్లు పెరిగే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా బ్రోకింగ్‌

యస్‌బ్యాంక్‌ 6 శాతం క్రాష్‌

Thursday 30th January 2020

‘‘ నెగిటివ్‌ వాచ్‌’’ కొనసాగింపుతో అమ్మకాలు యస్‌బ్యాంక్‌ బ్యాంక్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో 5శాతం నష్టాన్ని చవిచూసింది. ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్రోకరేజ్‌ సంస్థ గతంలో ఇచ్చిన నెగిటివ్‌ వాచ్‌తో కూడిన ధీర్ఘకాలిక రేటింగ్‌ ‘‘ఎ’’ను కొనసాగించడంతో పాటు స్వల్పకాలికి కేటియించిన A1 రేటింగ్‌ను ఉపసంహరించుకునట్లు బుధవారం యస్‌బ్యాంక్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఫలితంగా నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు మునుపటి ముగింపు(రూ.41.20)తో పోలిస్తే 1శాతం నష్టంతో

Most from this category