News


ఇక ఫర్టిలైజర్స్‌ కంపెనీలకు అగ్ర తాంబూలం!?

Monday 3rd June 2019
Markets_main1559501332.png-26047

సాగు రంగం, రైతుల ఆదాయం పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో రైతుకు ఏటా రూ.6,000 సాయాన్ని గతంలో​ఐదు ఎకరాల రైతులకే పరిమితం చేయగా,  మోదీ సర్కారు రెండో విడతలో దీన్ని రైతులు అందరికీ అమలు చేయాలని నిర్ణయించిన విషయం గమనార్హం. ఇప్పటి వరకు ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీలను ఇస్తుంటే, అవి రైతులకు పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ ద్వారా ఎరువులను విక్రయిస్తున్నాయి. అయితే, ఈ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే ప్రణాళికతో ఉంది. ఇవన్నీ ఎరువుల కంపెనీలకు రీరేటింగ్‌ చేసే పరిణామంగా రుద్ర షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ మనాలి భాటియా పేర్కొన్నారు. పలు ఎరువుల కంపెనీలను ఆయన పెట్టుబడుల కోసం సూచించారు. 

 

చంబల్‌ ఫర్టిలైజర్స్‌
దీనికి టార్గెట్‌గా రూ.225ను ఇచ్చారు. ఎరువుల రంగంలో అతిపెద్ద ప్రైవేటు సంస్థ ఇది. మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకు కంపెనీ చరిత్రలోనే అత్యధిక నికర లాభం, ఎబిట్డాను నమోదు చేసింది. ఎబిట్డా మార్జిన్‌ 18.61 శాతంగా ఉంది. కోటలోని గండేపన్‌-3 యూరియా ప్లాంట్‌లో ఉత్పత్తిని ఆరంరభించింది. ఇక్కడి సామర్థ్యాన్ని కంపెనీ గణనీయంగా వినియోగించుకోవడం కూడా మొదలైంది. అదనపు సామర్థ్యం తోడవడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుతమున్న రూ.8,500 కోట్ల రుణ భారాన్ని ఒకటి రెండేళ్లలో పూర్తిగా తీర్చివేయాలనే ప్రణాళికతో ఉంది. 

 

నేషనల్‌ ఫర్టిలైజర్స్‌
టార్గెట్‌ రూ.57. 2020 ఆర్థిక సంవత్సరంలో బలమైన నాన్‌ యూరియా వ్యాపార పనితీరు దన్నుగా రూ.13,500 కోట్ల టర్నోవర్‌ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ముందు ఏడాది కంటే పది శాతం అధికం. 2019 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రూ.12,245 కోట్లుగా ఉంది. నాంగల్‌, భటిండ, పానిపట్‌ యూనిట్లలో విద్యుత్‌ ఆదా కోసం రూ.675 కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది. ఇవి ఈ ఏడాది నవంబర్‌ నాటికి పూర్తవుతాయి. అలాగే, తెలంగాణలోని రామగుండంలో జాయింట్‌ వెంచర్‌ కింద యూరియా ప్లాంట్‌ను తిరిగి పునరుద్ధరించింది. ఈ ప్లాంట్‌ 3,850 ఎంటీపీడీ యూరియా, 2,200 ఎంటీపీడీ అమ్మోనియాను రోజువారీగా ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తవుతుంది. ఇది పూర్తయితే ఎన్‌ఎఫ్‌ఎల్‌ దేశంలోనే అతిపెద్ద యూరియా కంపెనీగా అవతరిస్తుంది. 

 

దీపక్‌ ఫర్టిలైజర్స్‌
టార్గెట్‌ రూ.168. దీపక్‌ ఫర్టిలైజర్స్‌ పెట్రోకెమికల్స్‌ కార్పొరేషన్‌కు గత ఆర్థిక సంవత్సరం ఓ తుఫాను వంటిది. ఊహించని పలు అంశాలు కంపెనీ పనితీరును దెబ్బతీశాయి. టాన్‌ వ్యాపార పనితీరు చక్కగా ఉంది. క్రాప్‌ న్యూట్రిషన్‌, ఐపీఏ వ్యాపారం ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులు, పెరిగిన మూడి సరుకుల ధరల కారణంగా సవాళ్లను ఎదుర్కొన్నది. ప్రధాన ముడి సరుకుల ధరలు తగ్గినందున రానున్న త్రైమాసికాల్లో సత్ఫలితాలు కనిపించనున్నాయి. నూతన గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌ దేహేజ్‌లో ఉత్పత్తి ఆరంభించింది. అమ్మోనియా, ఐపీఏ, టాన్‌, ఎన్‌పీఏకే ఫర్టిలైజర్స్‌ విస్తరణ ‍ప్రాజెక్టుల ప్రణాళికలు కూడా అమల్లో ఉన్నాయి.You may be interested

పోర్ట్‌ఫోలియో పెద్దదైతే చిక్కులే..!

Monday 3rd June 2019

స్టాక్‌ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసే రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది నష్టాల గురించి చెబుతుండడం చాలా మందికి అనుభవమే. దీని వెనుక ఎన్నో కారణాలు ఉంటుంటాయి. అందరిలోనూ ఇవే ప్రధానంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఒక్కో ఇన్వెస్టర్‌ పదుల సంఖ్యలో షేర్లను తమ పోర్ట్‌ఫోలియోలో భాగంగా నిర్వహిస్తుంటారు. ఒక్కో కంపెనీలో కొంత చొప్పున, ఆకర్షణీయంగా కనిపించే ప్రతీ షేరు వెనుక పరుగులు పెడుతుంటారు. దీనివల్ల సంపద సృష్టి కష్టమవుతుందంటున్నారు వ్యాల్యూ

మేలో స్పీడు తగ్గిన మారుతి అమ్మకాలు

Saturday 1st June 2019

మేలో మారుతి అమ్మకాల స్పీడు తగ్గింది. ఈ నెలలో మొత్తం 1.31లక్షల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే మే లో కంపెనీ విక్రయించిన 1.72లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 22శాతం తక్కువ. ఈ మేలో దేశీయంగా అ‍మ్మకాలు 23.1శాతం తగ్గి 1.25లక్షలుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 1.63లక్షల వాహనాలను విక్రయించింది. చిన్న తరహా విభాగంలోని అల్టో, వేగనార్‌ అమ్మకాలు 16,394 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే

Most from this category