News


అమెరికా వడ్డీ రేట్లు@ జీరో

Monday 16th March 2020
Markets_main1584331528.png-32495

పాలసీ సమీక్షకంటే ముందుగానే వడ్డీ రేట్ల కోత
రెండు వారాల్లోనే  రెండోసారి రేట్ల తగ్గింపు

ఇంతక్రితం 0.5 శాతం- తాజాగా 1 శాతం
సున్నా స్థాయికి చేరిన ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు
700 బిలియన్‌ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీ

చైనాలో పుట్టి యూరోపియన్ దేశాలను దాటి అమెరికా వరకూ పాకిన కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచం నిలువెల్లా వణుకుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌-19 వైరస్‌ ప్రభావానికి లోనైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితులు తలెత్తాయి. వెరసి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు వారాల్లోనే రెండోసారి వడ్డీ రేట్లలో కోత  పెట్టింది. అదికూడా 1 శాతం రేట్లను తగ్గించింది. వెరసి ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు సున్నా(0-0.25 శాతం)  స్థాయికి చేరాయి. రెండు వారాల్లోనే ఏకంగా 1.5 శాతం రేట్లను ఫెడ్‌ కట్‌ చేయడం గమనార్హం! నిజానికి ఈ నెల 17-18న ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాన్ని నిర్వహించవలసి ఉంది. అయితే కరోనా సృష్టిస్తున్న విలయం కారణంగా రెండు వారాల క్రితం తొలిసారి ఎమర్జెన్సీ ప్రాతిపదికన 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. తదుపరి ఆదివారం ఆర్థరాత్రి(భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు ఝామున) వడ్డీ రేట్లను సున్నా స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా 700 బిలియన్‌ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ఫలితంగా మరోసారి సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనుకావడంతో అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఈ ప్రభావంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టారు. ఇది ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ ఇండెక్సులను 4.5 శాతంమేర పడగొట్టింది.  

2008 తదుపరి
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు 2008లో చెలరేగిన సబ్‌ప్రైమ్‌ సంక్షోభం తదుపరి తిరిగి సున్నా స్థాయికి చేరాయి. తాజాగా ఫెడ్‌ వడ్డీ రేట్లలో భారీ కోతలను చేపట్టడంతోపాటు.. బ్యాంకులు నగదు నిల్వలను వినియోగించుకునేందుకు వీలుగా రిజర్వ్‌ రిక్వైర్‌మెంట్స్‌ నిబంధనలు సడలించింది. కాగా.. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఫెడ్‌ నిర్ణయాలను ప్రశంసించారు. ఫెడ్‌ చర్యలను ఊహించలేదని.. ఇదెంతో సంతోషకర విషయమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎదురవుతున్న సంక్షోభాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కినట్లు విశ్వసించేవరకూ కనీస వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనే బాటలో ఇటీవల ఫెడ్‌ 0.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు.. 500 బిలియన్‌ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేసే చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే.You may be interested

సెన్సెక్స్‌ 2000 పాయింట్లు క్రాష్‌..!

Monday 16th March 2020

9400 దిగువకు నిఫ్టీ కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను మరోసారి కాటేశాయి. ఫలితంగా సోమవారం బెంచ్‌మార్క్‌ సూచీలు 4.50శాతం నష్టంతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌  1,520.53 పాయింట్లను కోల్పోయి 32582.95 వద్ద, నిఫ్టీ 440.60 పాయింట్లు నష్టపోయి 9514.60 వద్ద ప్రారంభమయ్యాయి.  ఇక కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి తీవ్రత రోజురోజూకు మరింత పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య

రిటైర్మెంట్‌కు వీపీఎఫ్‌ ఆయుధం!

Monday 16th March 2020

రిటైర్మెంట్‌కు వీపీఎఫ్‌ ఆయుధం! ఈపీఎఫ్‌కు అదనంగా జమ చేసుకోవచ్చు తద్వారా రిటైర్మెంట్‌ నాటికి అధిక మొత్తం రాబడి రేటు ఈపీఎఫ్‌లో మాదిరే ఈపీఎఫ్‌ నిబంధనలే అమలవుతాయి పీపీఎఫ్‌, ఇతర స్థిరాదాయ సాధనాల కంటే అధిక రాబడి అత్యవసరాల్లో ఉపసంహరణకు వీలు రిటైర్మెంట్‌ తర్వాత జీవితానికి సంబంధించి చాలా మందిలో ప్రణాళిక కనిపించదు. ఎన్నో ఏళ్ల తర్వాత అవసరాల కంటే ప్రస్తుత జీవన అవసరాలే వారికి ప్రాధాన్యంగా ఉంటుంటాయి. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ ఆదాయ వర్గాల్లో ఇది చూడొచ్చు. కానీ, 60

Most from this category