STOCKS

News


ఫెడ్‌ పాలసీ నిర్ణయం, కార్పొరేట్‌ ఫలితాలే కీలకం..!

Monday 28th October 2019
Markets_main1572239520.png-29177

ఇన్ఫోసిస్‌ వివాదం, బ్రెగ్జిట్‌ ఆందోళనలు, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, టెలికాం ఏజీఆర్‌పై సుప్రీం కోర్టు తీర్పు, కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడంతో గతవారం స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. అయితే, క్యూ2లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత పెరగడంతో ఆయా బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం, అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు దిగిరావడం లాంటి సానుకూలాంశాలు మార్కెట్‌కు కొంత మద్దతుగా నిలిచాయి. దీపావళి సందర్భంగా ఆదివారం జరిగిన ముహూరత్‌ ట్రేడింగ్‌లో సూచీలు లాభాలను ఆర్జించినప్పటికీ.., వారంపరంగా చూస్తే సెన్సెక్స్‌  0.12 శాతం, నిఫ్టీ 0.3శాతం నష్టపోయాయి.

ఇక ఈ వారంలోనూ మార్కెట్‌లో ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగవచ్చవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండటం, అటో కంపెనీలు అక్టోబర్‌ వాహన విక్రయ గణాంకాల వెల్లడి, ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల ముగింపు, ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమీక్ష సమావేశం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై స్పష్టత తదితర అంశాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయి. నేడు(అక్టోబర్‌ 28) బలిదివస్‌ సందర్భంగా మార్కెట్‌ సెలవు. కాబట్టి ఈ వారంలో మార్కెట్‌ ట్రేడింగ్‌ 4రోజులు మాత్రమే జరగనుంది. 

కంపెనీల క్యూ2 ఫలితాలు:- 
నిఫ్టీ, సెన్సెక్స్‌ సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన కంపెనీలు ఇప్పటికే తమ రెండో క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించాయి. ఇక ఈ వారంలో 180 కంపెనీలకు పైగా క్యూ2 ఫలితాను వెల్లడించనున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, యస్‌బ్యాంక్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఐఓసీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, హిందూస్థాన్‌ జింక్‌, టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌, జీఐటీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎస్కార్ట్‌ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ క్యూ2లో ఆస్తుల నాణ్యత మెరుగవడం, స్లిపేజ్‌లు తగ్గడంతో పలు బ్యాంకింగ్‌ కంపెనీలు అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించాయి. కార్పోరేట్‌ పన్ను తగ్గింపుతో అటో, టెక్నాలజీ కంపెనీలు మెరుగైన ఫలితాలను వెల్లడించాయి. బ్యాంకింగ్ రంగం కంపెనీలు మెరుగైన ఫలితాలన ప్రకటించడంతో ఎన్‌పీఏ సమస్య కొంత తగ్గిందనే విషయం అవగతమవుతోంది. 
ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం:-
అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పరపతి సమీక్ష సమావేశాలు ఈవారంలో బుధ, గురువారాల్లో జరగునున్నాయి. రెండు రోజుల సమావేశం అనంతరం గురువారం 30న పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. ఇప్పటికే గత రెండు సమావేశాల్లో వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ వాణిజ్య వివాదాల కారణంగా ఆర్థిక మందగమన సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఫెడ్‌ మూడోసారి వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(బీవోజే) సైతం ఈ నెల 31న పాలసీ సమీక్షను చేపట్టనుంది. 
ఎఫ్‌ అండ్‌ ఓ ఎక్స్‌పైరీ:- 
ఈ వారంలో గురువారం అక్టోబర్‌ సీరీస్‌ ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్‌(ఎఫ్‌అండ్‌ఓ) డెరివేటివ్‌ల ముగింపు జరగనుంది. నవంబర్‌ సిరీస్‌కు ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్‌ చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో మార్కెట్‌ కొంత ఒడిదుడకులకు లోనయ్యే అవకాశం ఉంది.
అక్టోబర్‌ అటోరంగ కంపెనీల అమ్మకాలు:- 
 పలు అటోరంగ కంపెనీలు వారంతంలో శుక్రవారం(నవంబర్‌ 1న) అక్టోబర్‌ విక్రయ గణాంకాలు వెల్లడించనున్నాయి. క్రితం నెలలో అమ్మకాలు రెండంకెల క్షీణిత చూసాయి. అయితే ఈ అక్టోబర్‌లో పండుగ సీజన్‌ సందర్భంగా విక్రయాలు పెరిగిఉండవచ్చనే అశాభావాన్ని మార్కెట్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఇటీవల కేంద్ర ప్రకటించిన కార్పోరేట్‌ పన్ను అటో రంగానికి ఎంతమేర ఉపయోగపడిందని అనేది  నవంబర్‌1న వెలువడే విక్రయ గణాంకాల ద్వారా వెల్లడవుతుంది. కార్పొరేట్ పన్ను రేటును తగ్గించిన తరువాత బాగా కోలుకున్న మారుతి సుజుకి, టాటా మోటార్స్, టివిఎస్ మోటార్, ఐషర్ మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ మొదలైనవాటిపై ఈ వారం చివరిలో ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నాయి. 

వీటితో పాటు అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య చర్చలు, ముడిచమురు ధరలు, దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్‌ రూపాయి మారకం ట్రేడింగ్‌, ఎఫ్‌పీఐల పెట్టుబడుల తీరు తదితర పలు అంశాలు స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

‘‘బ్రెగ్జిట్‌, వాణిజ్య యుద్ధం చర్చలు అంశాలపై మరింత స్పష్టత కోసం ఎదురుచూపులు నేపథ్యంలో మార్కెట్లో వాల్యూమ్‌ తగ్గవచ్చు. స్వల్పకాలిక అస్థిరత నెలకొంటుంది. అయితే, వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన పథకాలు, పండుగ సీజన్ సందర్భంగా కొంత మద్దతు, చమురు ధరల పతనం లాంటి సానుకూల అంశాల దృష్ట్యా దీర్ఘకాలినికాని పరిస్థితులు మెరుగ్గా ఉండొచ్చు.’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ రీసెర్చ్‌ అధిపతి వినోద్‌ నాయన్‌ తెలిపారు. 

 You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు అప్‌

Monday 28th October 2019

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం అరశాతం మేర లాభపడింది. ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ ఆదివారంనాటి మూరత్‌ ట్రేడింగ్‌ ముగింపు(11625)తో పోలిస్తే బాగా పెరిగింది.  అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న మొదటి దశ వాణిజ్య చర్చల ఒప్పందం దాదాపు కుదిరినట్లే అనే వార్తలు శుక్రవారం వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ బలపడింది. నేడు ఆసియా మార్కెట్లు 3నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ  సంకేతాన్ని అందిపుచ్చుకున్న ఎస్‌జీఎస్‌

పెద్ద కార్పొరేట్‌ బ్యాంకులకే మా ప్రాధాన్యం!

Monday 28th October 2019

 ‘ఇప్పటి వరకు మూడు కార్పొరేట్‌ బ్యాంకులు వాటి త్రైమాసికపు ఫలితాలను ప్రకటించాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల నుంచి బయటపడుతున్నట్లు, ఇక్కడి నుంచి పరిస్థితులు సాధరణ స్థాయికి వస్తాయనే అభయాన్ని ఈ ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్విడిటీ లభ్యత పెరిగిందనే విషయం ఈ ఫలితాల ద్వారా తెలుస్తోంది. గత ఏడాదితో పొలిస్తే వచ్చే ఏడాది బాగుంటుందని ఆశిస్తున్నా’ అని అబాకస్‌ అసెట్‌ మానేజర్‌, వ్యవస్థాపకుడు, సునిల్‌ సింఘానియా ఓ

Most from this category