News


యథాతథ పాలసీ అమలుకే ఫెడ్‌ ఓటు

Thursday 30th January 2020
Markets_main1580355823.png-31317

ఉపాధి గణాంకాలు పటిష్టంగానే ఉన్నాయ్‌
నిరుద్యోగిత కనిష్ట స్థాయిలవద్దే నమోదవుతోంది
ప్రస్తుతం వడ్డీ రేట్లను సవరించవలసిన అవసరంలేదు
- ఫెడరల్‌ రిజర్వ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ 

అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. బుధవారం ముగిసిన రెండు రోజుల పాలసీ సమావేశాల్లో భాగంగా ఫండ్స్‌ రేట్లను 1.5-1.75 శాతం వద్దే అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. కాగా.. ఉపాధి మార్కెట్‌ పటిష్టంగానే ఉన్నట్లు ఈ సందర్భంగా ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొన్నారు. నిరుద్యోగిత కనిష్ట స్థాయిల వద్ద కొనసాగుతున్నట్లు తెలియజేశారు. కరోనా వైరస్‌ ఆందోళనల నేపథ్యంలో 2020లో ఫెడరల్‌ రిజర్వ్‌ చేపట్టిన తొలి పరపతి సమీక్షా సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 

వడ్డీ రేట్లు ఓకే
ప్రస్తుతం అమలు చేస్తున్న వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు అనుకూలంగానే ఉన్నట్లు ఎఫ్‌వోఎంసీ తెలియజేసింది. పటిష్ట ఉపాధి గణాంకాలు, 2 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యం నేపథ్యంలో పరపతి విధానాలలో పెద్దగా మార్పులు చేపట్టవలసిన అవసరం కనిపించలేదని తెలియజేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న 60 బిలియన్‌ డాలర్ల ట్రెజరీ కొనుగోలు అంశంపై ఎలాంటి సంకేతాలూ ప్రకటించలేదు. అంతేకాకుండా చైనాలో ఇటీవల చెలరేగిన కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడవచ్చన్న అంచనాలను ఫెడ్‌ ప్రస్తావించకపోవడం గమనార్హం! 



You may be interested

ఎల్‌టీసీజీ రద్దుకు బీజేపీ మద్దతు

Thursday 30th January 2020

దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ నిధుల వరద పెంచేందుకు మార్కెట్‌వర్గాలు కోరుతున్న పన్ను సవరణలు తీసుకురావాలని భారతీయ జనతాపార్టీ తమ ప్రభుత్వాన్ని కోరింది. ఈక్విటీ మార్కెట్‌ రిటర్న్స్‌పై పన్ను నిబంధనల సవరణలు తీసుకురావాలని పార్టీ సీనియర్‌ నాయకులు కోరారు. ఈక్విటీ పెట్టుబడులు, రాబడులపై ఎల్‌టీసీజీ(దీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను)ను ఎత్తివేయాలని, డీడీటీ(డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌)ను సవరించాలని మార్కెట్‌ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో 10 శాతం

యాపిల్‌ లాభం 2,200 కోట్ల డాలర్లు

Thursday 30th January 2020

ఆదాయం 9,180 కోట్ల డాలర్లు  డిసెంబర్‌ క్వార్టర్లో రికార్డ్‌ లాభం, ఆదాయం న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ గత ఏడాది అక్టోబర్‌- డిసెంబర్‌ క్వార్టర్లో రికార్డ్‌ స్థాయి ఆదాయాన్ని, నికర లాభాన్ని ఆర్జించింది. గత  ఏడాది అక్టోబర్‌- డిసెంబర్‌ క్వార్టర్‌కు గాను 2,200 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో రూ.1,56,200 కోట్లు) నికర లాభం సాధించామని యాపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలియజేశారు. మొత్తం ఆదాయం 9 శాతం వృద్ధితో 9,180

Most from this category