News


ఈ స్టాక్స్‌కు మంచి డిమాండ్‌..!

Wednesday 18th March 2020
Markets_main1584471484.png-32538

ఫిబ్రవరి రెండో వారం నుంచి మన ఈక్విటీ మార్కెట్లు నష్టాల ప్రయాణం మొదలుపెట్టాయి. కరోనా వైరస్‌ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తుండడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో అమ్మకాలకు దిగారు. ఫిబ్రవరి మొదటి సగ భాగం కూడా మార్కెట్లు పెరిగిందేమీ లేదు. స్థిరీకరణ దశలో ఉండి, రెండో భాగంలో అమ్మకాల కారణంగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ.50వేల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. అయితే, దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఫండ్స్‌, బీమా కంపెనీలు) మార్కెట్‌ పతనాన్ని కొనుగోళ్ల అవకాశంగా భావించి ఇన్వెస్ట్‌ చేస్తుండడం గమనించాలి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు డీఐఐలు రూ.50వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. 

 

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఫిబ్రవరిలో నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.10,800 కోట్లు. సిప్‌ రూపంలో వచ్చినవే రూ.8,513 కోట్లున్నాయి. అంటే వీరంతా దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్న వారని తెలుస్తోంది. ఫలితంగా విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తుంటే.. మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులు రావడం మన మార్కెట్లకు కొంత వరకైనా రక్షణగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసిన స్టాక్స్‌ను గమనించినట్టయితే.. లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఎన్‌ఎండీసీ, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, ఓఎన్‌జీసీ, డీఎల్‌ఎఫ్‌, కోల్‌ ఇండియాలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఆయిల్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, మణప్పురం ఫైనాన్స్‌.. స్మాల్‌ క్యాప్‌ విభాగంలో సుదర్శన్‌ కెమికల్‌, టాటా ఎలెక్సి, ఎన్‌బీసీసీ, రైట్స్‌, ఇండియన్‌ ఎనర్జీ ఎక్సేంజ్‌ తదితర స్టాక్స్‌ను మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు చేశాయి.

 

ఫండ్స్‌ ఎక్కువగా విక్రయాలు చేసిన స్టాక్స్‌లో.. లార్జ్‌క్యాప్‌ విభాగం నుంచి బజాజ్‌ హోల్డింగ్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బంధన్‌ బ్యాంకు, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఐఆర్‌సీటీసీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా కెమికల్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఉన్నాయి. స్మాల్‌క్యాప్‌ విభాగంలో ఇండియా సిమెంట్స్‌, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, గుజరాత్‌ ఆల్కలైన్స్‌, వెల్‌స్పన్‌ ఇండియా, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్టు ఐసీఐసీఐ డైరెక్ట్‌ డేటా ఆధారంగా తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో నాణ్యమైన స్టాక్స్‌లో క్రమంగా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళితే దీర్ఘకాలంలో మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.You may be interested

నిధుల సమస్య లేదు!!

Wednesday 18th March 2020

- ఏటీఎంలు, శాఖల్లో పుష్కలంగా నగదు ఉంది - బుధవారం సాయంత్రం నుంచి అన్ని సేవల పునరుద్ధరణ - బ్యాంక్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్ అక్కర్లేదు - యస్‌ బ్యాంక్ 'సీఈవో' ప్రశాంత్ కుమార్ వెల్లడి ముంబై: ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్ నేటి సాయంత్రం నుంచి అన్ని బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించనుంది. నిధులపరమైన సమస్యలేమీ లేవని, బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి సర్వీసులన్నీ అందుబాటులోకి వస్తాయని సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న ప్రశాంత్ కుమార్

ఈ స్థాయి నుంచి రికవరీ..: గౌరవ్‌గార్గ్‌

Wednesday 18th March 2020

స్టాక్‌ మార్కెట్లు ఇంత తీవ్ర స్థాయిలో పడిపోవడానికి మన దేశంలో వ్యాపారాలు ఏమీ దెబ్బతినలేదని.. లేదా ఆర్థిక వ్యవస్థకు వచ్చిన తీవ్రమైన సమస్య ఏమీ లేదన్నారు క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌కు చెందిన గౌరగ్‌గార్గ్‌. నిఫ్టీ-50 ఈ స్థాయి నుంచి కోలుకునేందుకు చక్కని అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. సమీప కాలానికి మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉందన్నారు. 10,500 నిరోధం ఎదురుకావచ్చని అంచనా వ్యక్తం చేశారు. నిఫ్టీ, సెన్సెక్స్‌ ఇప్పటికే 25 శాతం వరకు

Most from this category