News


టీవీఎస్‌ మోటార్‌ 3% శాతం డౌన్‌

Tuesday 25th February 2020
Markets_main1582610605.png-32071

మంగళవారం టీవీఎస్‌ మోటార్‌ షేరు 3 శాతం పడిపోయింది.రూ.16.10 తగ్గి  రూ.422.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది.కోవిడ్‌-19 ప్రభావంతో టూ వీలర్‌, త్రీవీలర్‌ విడిభాగాల దిగుమతులు ఆగిపోవడంతో టీవీఎస్‌ కంపెనీ వాహన ఉత్పత్తి 10 శాతం ఆగిపోయిందని చెన్నై కేంద్రంగా పనిచేస్తోన్న టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది. దీంతో టీవీఎస్‌ మోటార్‌ షేరు విలువ పడిపోయింది.కాగా BS-VI  వాహనాల తయారీ కావాల్సి విడిభాగాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా టీవీఎస్‌ మోటార్స్‌ చైనా నుంచి దిగుమతయ్యే విడిభాగాల మీద అధికంగా ఆధారపడడం ఇందుకు కారణమని టీవీఎస్‌ కంపెనీ డైరెక్టర్‌, సీఈఓ కేఎన్‌ రాధాకృష్ణన్‌ వెల్లడించారు. చైనా నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి విడిభాగాలను తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

ఏప్రిల్‌ నుంచి నో డీజిల్‌ ..ఓన్లీ సీఎన్జీ: మారుతీ సుజుకీ
భారతీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ 2020 ఏప్రిల్‌ నుంచి డీజిల్‌ కార్ల విక్రయాలను పూర్తిగా విరమించనున్నట్లు ప్రకటించింది. మరికొన్నేళ్లలో కర్భన ఉద్గారాలను అధిక మొత్తంలో తగ్గించేందుకు సీఎన్జీ, హైబ్రిడ్‌ టెక్నాలజీ కలిగిన గ్రీన్‌ కార్లను అందుబాటు ధరలలో విక్రయించనుంది. కాగా సోమవారం తన పాపులర్‌ ఎస్‌యూవీ మోడల్‌ విటారా బ్రెజాలో పెట్రోల్‌ వేరియంట్‌ను రూ.7.34 లక్షల నుంచి రూ.11.4 లక్షల రేంజ్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈఓ కెనిచి మాట్లాడుతూ..BS-VI పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచ అమల్లోకి రానుండటంతో డీజిల్‌ ఇంజిన్‌ కర్లా ఉత్పత్తి నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. విటారా బ్రెజాలో బీజిల్‌ వేరియంట్‌ను దశలవారీగా ఉపసంహరిస్తామని వివరించారు. దీంతో మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మారుతీ సుజుకీ షేరు 0.01 శాతం పెరిగి 6,471 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

 You may be interested

25 షేర్లు బుల్లిష్‌గా మారాయ్‌!

Tuesday 25th February 2020

ఎంఏసీడీ సంకేతాలు దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 25 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో అంబుజా సిమెంట్స్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఎస్‌బీఐ లైఫ్‌, హికాల్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌; సీఎస్‌బీ బ్యాంక్‌, వెంకీస్‌ ఇండియా, కొచిన్‌ షిప్‌యార్డ్‌, జీఎస్‌కే ఫార్మా తదితరాలున్నాయి.

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ ధర శ్రేణి రూ.750-755

Tuesday 25th February 2020

మార్చి 2న ఐపీఓ ప్రారంభం న్యూఢిల్లీ: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగమైన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ తన ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ధర శ్రేణిని నిర్ణయించింది. మార్చి 2న మొదలై 5న ముగిసే ఈ ఐపీఓకు ధర శ్రేణిని రూ.750-755గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. అలాగే అర్హత కలిగిన ప్రతి ఎంప్లాయిలకు డిస్కౌంట్‌ కింద ప్రతి షేరును రూ.75లకే విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఐపీఓ కోసం బిడ్ లాట్‌ను

Most from this category