News


కరోనా.. కల్లోలం..

Thursday 30th January 2020
Markets_main1580376037.png-31340

గ్లోబల్‌ మార్కెట్లను వణికిస్తున్న వైరస్‌
గురువారం ట్రేడింగ్‌లో భారీగా పతనమవుతున్న ప్రపంచ ఈక్విటీలు
చైనాలో ఆరంభమై క్రమంగా పలు దేశాలకు పాకుతున్న కరోనా వైరస్‌ ప్రభావానికి ప్రపంచ మార్కెట్లు, కరెన్సీలు వణుకుతున్నాయి. కరోనా దెబ్బకు పలు దేశాలు చైనాకు విమానాల రాకపోకలు రద్దు చేసుకున్నాయి. ఈ వైరస్‌ ఒక తీవ్ర అంటువ్యాధిగా మారుతుందన్న భయాల నేపథ్యంలో చైనాలో పలు ఆఫీసులు, షాపులు మూసివేస్తున్నారు. దీంతో చైనా ఎకానమీపై తీవ్ర నెగిటివ్‌ ప్రభావం పడుతుందన్న ఆందోళనలు పెరిగి ప్రపంచ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. గురువారం ఆసియా మార్కెట్లు భారీనష్టాలను చూశాయి. జపాన్‌ నికాయ్‌ 401 పాయింట్లు, హాంగ్‌కాంగ్‌ హ్యాంగ్‌సంగ్‌ 711 పాయింట్లు, తైవాన్‌ సూచీ దాదాపు 696 పాయింట్లు, సెన్సెక్స్‌ 300 పాయింట్ల మేర నష్టపోయాయి. ఎంఎస్‌సీఐ ఏసియా పసిఫిక్‌ సూచీ దాదాపు ఏడు వారాల కనిష్టానికి చేరింది. ఇప్పటికీ వైరస్‌ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య దాదాపు 170కి చేరింది. దాదాపు7700 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ మూడు నెలల కనిష్ఠాలకు పతనమయ్యాయి. బంగారంలాంటి సురక్షిత సాధనాలవైపు ఇన్వెస్టర్లు మొగ్గడంతో బంగారం ధర పదిడాలర్ల మేర పెరిగి 1586 డాలర్లను చేరింది. 
అటు యూరప్‌లో మార్కెట్లు సైతం ఆసియా మార్కెట్ల బాటలోనే భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఫ్రాన్స్‌ సీఏసీ, జర్మనీ డాక్స్‌లు దాదాపు 1.20 శాతం మేర, లండన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ దాదాపు 0.70 శాతం మేర క్షీణించాయి. అమెరికా డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ దాదాపు 200 పాయింట్లకు పైగా నష్టంలో ఉండి రాత్రికి గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. కరెన్సీల్లో చైనా యువాన్‌, ఆస్ట్రేలియా డాలర్‌, కివి డాలర్‌, తైవాన్‌ డాలర్లు, ధాయ్‌ లాండ్‌ బాత్‌ దాదాపు 0.2- 3 శాతం మేర పతనమయ్యాయి. చమురుధరలు మాత్రం ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. పలువురు అనలిస్టులు ఈ వైరస్‌ను సార్స్‌ 2.ఓగా భావిస్తున్నారు. 2002-2003లో సార్స్‌ వైరస్‌ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే! తాజా వైరస్‌తో చైనా 2020లో 5.5 శాతం వృద్దికే పరిమితం అవుతుందని సిటిగ్రూప్‌ అంచనా వేసింది. జేపీ మోర్గాన్‌ 5.6 శాతం వృద్ధిని అంచనా వేసింది. చైనాఎకానమీలో మందగమనం తమపై చూపే ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని యూఎస్‌ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చెప్పారు. వైరస్‌వ్యాప్తిని గ్లోబల్‌ ఎమర్జెన్సీగా ప్రకటించాలా? లేదా? అనేవిషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రోజు ప్రకటించనుంది. మరోవైపు సుదీర్ఘ సెలవల అనంతరం సోమవారం చైనా మార్కెట్లు ట్రేడింగ్‌కు ఓపెన్‌ కానున్నాయి. You may be interested

నష్టాల మార్కెట్లో ఎస్కార్ట్స్‌, వైభవ్‌ హైజంప్‌

Thursday 30th January 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌  కరోనా వైరస్‌ ఆందోళనలకుతోడు.. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా మధ్యాహ్నం మూడుకల్లా సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనంకాగా.. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనూ ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌, వైభవ్‌ గ్లోబల్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ భారీ

ఇండియాలో 9 శాతం తగ్గిన పసిడి డిమాండ్‌: డబ్ల్యూజీసీ

Thursday 30th January 2020

   9 శాతం తగ్గిన డిమాండ్‌ న్యూఢిల్లీ: భారత దేశంలో ఆపదసమయాల్లో ఆదుకుంటుందని బంగారంమీదే ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతుంటారు. కానీ 2019లో బంగారానికి డిమాడ్‌ 9 శాతం తగ్గి 690.4 టన్నులుగా నమోదైందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌(డబ్ల్యూజీసీ) గురువారం తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక మందగమనంతో పాటు రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగడంతో  డిమాండ్‌ తగ్గిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. కాగా 2018 సంవత్సరం ముగింపు ధరతో పోలిస్తే 24 శాతం

Most from this category