News


బ్యాంకుల మొండిబకాయిలు మరింత పెరుగుతాయా?

Wednesday 28th August 2019
Markets_main1566975544.png-28072

తక్కువ రేటింగ్‌ ఉన్న కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ కంపెనీ)ల్లో ఎగవేతల వలన బ్యాంకింగ్‌ సెక్టార్‌లో మొండి బకాయిల భయాలు తిరిగి ఊపందుకున్నాయని అంతర్జాతీయ బ్రోకరేజి క్రెడిట్‌సూసీ పేర్కొంది. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పరిష్కారం కోసం ఆర్‌బీఐ జూన్‌ 7 ప్రకటిచిన నిబంధనల కిందకు దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు వస్తాయని తెలిపింది. ‘అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రుణాలలో 70 శాతం రుణాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఇవి మొండిబకాయిలుగా మారేందుకు ఎక్కువ అవకాశం ఉంది’ అని క్రెడిట్‌ సూసీ తెలిపింది. 
గత ఏడాది మార్చిలో బ్యాంక్‌ ఎన్‌పీఏ(నిరార్థక ఆస్తులు) 11.7 శాతం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి అది 9.6 శాతానికి తగ్గింది. కానీ తాజా బ్యాంకు రుణాల్లో  2.8 శాతం ఇంటర్‌ క్రెడిటర్‌ ఎగ్రిమెంట్‌(ఐసీఏ) కిందకు వచ్చేవి కావడంతో ఒత్తిడిలో ఉన్న ఆస్తులు 12 శాతం దాటతాయని క్రెడిట్‌ సూసీ విశ్లేషకులు తెలిపారు. ‘ఐసీఏ, బ్యాంకులకు ఉన్న ఏకైక ఫ్రేమ్‌ వర్క్‌. ప్రస్తుతానికి 16 కార్పోరేట్‌లకు చెందిన రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు ఐసీఏలో ఉన్నాయి. దీంతో పాటు  దివాలా చట్టం(ఐబీసీ) కింద పరిష్కారాలు నెమ్మదించడంతో ఈ ఐసీఏ మొండిబకాయిల భయాలు పెరుగుతున్నాయి’ అని క్రెడిట్‌సూసీ విశ్లేషకుడు ఆశిష్‌ గుప్తా అన్నారు. ‘ప్రస్తుత ఐసీఏలలో, 50 శాతం ఫైనాన్షియల్‌కు చెందినవి ఉన్నాయి. కాగా నాన్‌ ఎన్‌బీఎఫ్‌సీలకు చెందిన ఐసీఏలో 70 శాతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఇవి ముందు సీడీఆర్‌(కార్పోరేట్‌ డెట్‌ రీస్ర్టక్చరింగ్‌), ఎస్‌డీఆర్‌(స్పెషల్‌ డ్రావింగ్‌ రైట్స్‌), ఎస్‌4ఏ వంటి వివిధ రకాల ఫ్రేమ్‌వర్క్స్‌ కింద ఉండడం గమనార్హం’ అని వివరించారు. 


   ఇంట్రస్ట్‌ కవరేజ్‌ రేసియో(ఐసీఆర్‌: కంపెనీలు రుణాలపై వడ్డీలను తమ ఆదాయాల ద్వారా చెల్లించగలిగే సామర్ధ్యం) 1 కన్నా తక్కువగా ఉన్న కంపెనీల వాటా ఈ రుణాలలో 42 శాతంగా(జూన్‌ క్యార్టర్‌ నాటికి) ఉందని క్రెడిట్‌సూసీ ఓ నివేదికలో తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2019 చివరి క్యార్టర్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ గత ఐదేళ్ల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ఈ సమయంలో అనేక వ్యాపారాలు రుణాల ఒత్తిడితో దెబ్బతిన్నాయి. ‘ఎన్‌బీఎఫ్‌సీల రుణ వృద్ధి ప్రతికూలంగా మారడంతో వ్యవస్థలో వినియోగం దెబ్బతింది. కంపెనీల క్రెడిట్‌ ప్రొఫైల్స్‌ ఈ జులైలో 19 నెలల దిగువకు పడిపోయాయి’  అని కేర్‌ రేటింగ్స్‌ తెలిపింది. కాగా ఈ సంస్థ 1,601 లోకల్‌ కంపెనీలను ట్రాక్‌ చేసి కేర్‌ రేటింగ్స్‌ ఇండెక్స్‌ను తయారు చేయడం గమనార్హం. ‘ ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీ(హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు) లలో లిక్విడిటీ సమస్య తలెత్తడంతో ఈ రుణ నాణ్యత సూచీ జూన్‌ 2019 లో భారీగా పడిపోయింది. ఇది జులై నెలలో మరింత పడిపోయింది’ అని ఈ రేటింగ్‌ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది.You may be interested

ఆటో, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో 1000 పాయింట్ల రికవరి!

Wednesday 28th August 2019

-అనిశ్చితిలో బ్యాంకింగ్‌ సెక్టార్‌ -జేఎం ఫైనాన్సియల్‌, గౌతమ్‌ షా   ‘గత కొన్ని వారాలలో మార్కెట్‌ భారీగా నష్టపోయింది. కానీ ఆల్‌టైం గరిష్ఠం నుంచి మార్కెట్‌ 12 శాతం పడిపోవడం పెద్ద క్షీణతగా అనుకోవడం లేదు’ అని జేఎం ఫైనాన్సియల్‌, గౌతమ్‌ షా ఓ ఇంటర్యూలో తెలిపారు. కాగా ఈ ఏడాది జూన్‌ 3 న నిఫ్టీ 50 ఆల్‌ టైం గరిష్ఠమయిన 12,103 ను తాకింది. అక్కడి నుంచి ప్రస్తుత 11,100

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Wednesday 28th August 2019

నష్టాల మార్కెట్లోనూ రియల్టీ షేర్ల ర్యాలీ కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 2.50శాతం ర్యాలీ చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఒబేరాయ్‌ రియల్టీ ఇండెక్స్‌ 6శాతం ర్యాలీ చేసింది. కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సోదాలను పూర్తి చేసింది. గత కొద్దిరోజులుగా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోందని, అధికారులు లేవనెత్తిన అంశాలన్నింటికి పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు సంపూర్ణ

Most from this category