News


మార్కెట్లు సైడ్‌వేస్‌లో కొనసాగొచ్చు: మోతీలాల్‌ఓస్వాల్‌

Sunday 7th July 2019
Markets_main1562523856.png-26871

మరో ట్రిగ్గర్‌ కనిపించేంత వరకు ఈక్విటీ మార్కెట్లు సైడ్‌వేస్‌లో కొనసాగొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్‌ అండ్‌ డెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా అన్నారు. మార్కెట్లపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది...

 

నిఫ్టీ సైకలాజికల్‌గా కీలకమైన 12,000ను పరీక్షించడంలో విఫలమైంది. పైగా 11,800 దిశగా పడిపోయింది. యూనియన్‌ బడ్జెట్‌కు ముందు స్తబ్దుగా ఉండగా, ఆ తర్వాత అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నది, దీంతో అంతకుముందు నాలుగు సెషన్లలో మార్కెట్‌ లాభాలన్నీ కరిగిపోయాయి. బేరిష్‌ ఎన్‌గల్ఫింగ్‌ క్యాండిల్‌ను డైలీ స్కేల్‌పై, వీక్కీ స్కేలుపై షూటింగ్‌ స్టార్‌ ఫామ్‌ అయింది. అధిక స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడిని ఇది తెలియజేస్తోంది. గత ఏడు వారాల ట్రేడింగ్‌ శ్రేణిని బ్రేక్‌ చేయడంలో సూచీలు విఫలమయ్యాయి. అంతేకాదు 11,600-12,000 శ్రేణిలో చిక్కుకుపోయాయి. అధిక స్థాయిల్లో కనిష్టాలను డైలీ చార్ట్‌లో పట్టించుకోలేదు. కానీ, కీలక మద్దతు స్థాయి 11,761 సమీపంలో నిఫ్టీ నిలిచి ఉంది. ఇప్పుడిక సూచీ 11,850-11,888 జోన్లను దాటుకుని పై స్థాయిలోనే కొనసాగాల్సి ఉంది. అప్పుడే 11,980-12,000 వరకు వెళ్లగలదు. దిగువ స్థాయిల్లో 11,720-11,650 కీలక మద్దతు స్థాయిలు. 

 

ఇండియా వీఐఎక్స్‌ 12.64 శాతం తగ్గి 14.95 నుంచి 13.06కు పడిపోయింది. బడ్జెట్‌ కార్యక్రమం తర్వాత కూడా వొలటాలిటీ తక్కువగానే ఉండడం గమనార్హం. అంటే మరో ట్రిగ్గర్‌ వచ్చే వరకు పెద్దగా కదలిక ఉండకపోవచ్చని లేదా సైడ్‌వేస్‌లో స్థిరీకరణ చెందొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 11,400, 11,700 స్ట్రయిక్‌ వద్ద పుట్‌ ఆప్షన్ల రైటింగ్‌ జరిగింది. అలాగే, 12,000, 12,200 వద్ద ఎక్కువగా కాల్‌ ఆప్షన్ల రైటింగ్‌ జరిగింది. దీనిబట్టి నిఫ్టీ 11,600-12,000 మధ్య చలించొచ్చని తెలుస్తోంది. ప్రైవేటు, పీఎస్‌యూ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, ఎఫ్‌ఎంసీజీల్లో కొనుగోళ్లు చోటు చేసుకోగా, మెటల్స్‌, ఐటీ, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌లో గతవారం లాభాల స్వీకరణ జరిగింది. కోటక్‌ మహింద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్‌ బరోడా, మారికో, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్గేట్‌ పామోలివ్‌, డాబర్‌ ఇండియాలో సానుకూలత నెలకొనగా, వేదాంత, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, సన్‌టీవీ, బీఈఎల్‌లో బలహీనత నెలకొంది.You may be interested

సెన్సెక్స్‌ స్టాక్స్‌లో అనుకూలం - ప్రతికూలం

Sunday 7th July 2019

కన్జ్యూమర్‌, కన్‌స్ట్రక్షన్‌ స్టాక్స్‌ మధ్య కాలానికి మంచి లాభాలను ఇస్తాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు కేంద్రం పెద్ద పీట వేయడం, గ్రామీణుల ఆదాయం పెంపు చర్యలు ఇందుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌ సూచీలోని స్టాక్స్‌కు సంబంధించి బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం ఏ మేరకు అన్నది ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలియజేసింది.    డెకరేటివ్‌ పెయింట్స్‌ విభాగంలో మార్కెట్‌ లీడర్‌. 50 శాతం వాటా ఈ కంపెనీదే.

మనపై బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం!

Sunday 7th July 2019

బడ్జెట్‌ నిర్ణయాలు కొందరికి తీపిని, కొందరికి చేదును పంచాయి. తక్కువ ఆదాయ వర్గాలకు సంతోషపరిచే నిర్ణయాలు ఉండగా, సంపన్నులకు చేదునిచ్చాయి. వ్యక్తుల బడ్జెట్‌పై ప్రభావం చూపే నిర్ణయాలను గమనిస్తే...   అధిక ఆదాయం కలిగిన వారిపై ఆర్థిక మంత్రి పెద్ద భారాన్నే మోపారు. రూ.2-5 కోట్ల మధ్య​ఆదాయం కలిగిన వారికి ఆదాయపన్ను సర్‌చార్జ్‌ను 3 శాతానికి రూ.5 కోట్లకు పైగా ఉన్న వారికి 7 శాతానికి పెంచేశారు. దీంతో రూ.2-5 కోట్ల ఆదాయ

Most from this category