మంచి షేర్లు మల్టీబ్యాగర్లవుతాయి..
By Sakshi

ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పడిపోయిన ప్రతి స్టాకు తిరిగి కోలుకోలేకపోవచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రిసెర్చ్ హెడ్ జగన్నాథం తునుగుంట్ల ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్థిక ఉద్దీపనల కోసం వేచి ఉన్నాం.. వాణిజ్య యుద్ధానికి ముగింపుండాలి.. ఆర్బీఐ రేట్ల కోత వినియోగదారులకు అందాలి.. కార్పోరేట్ ఫలితాలలో బ్యాంక్‌లు మినహా..
మార్కెట్ 11,000 దిగువకు పడిపోయాయి. విదేశి సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)లపై అధిక పన్నులు విధించడం, మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, బలహీన రుతుపవనాలు, అంచనాలకు అందుకోని కార్పోరేట్ ఫలితాలు, యుఎస్-చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం వంటి అంశాలు మార్కెట్లపై తీవ్రంగా ప్రభావం చూపాయి. ఎఫ్ఐఐలను సర్‌చార్జీ నుంచి మినహాయింపు నివ్వడం, ఎల్టీసీజీ(లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్)ని తిరిగి పరిశీలించడం వంటి ఆర్థిక ఉద్దీపనలను ఆర్థిక మంత్రి ప్రకటించనుందనే అంచనాల నేపథ్యంలో గత కొన్ని సెషన్లో మార్కెట్లు తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లు ఈ ఉద్దీపన ప్రకటనల కోసంఎదురుచూస్తున్నాయి.
మార్కెట్లకు బ్యాడ్ టైం అనుకున్నది, ఇన్వెస్ట్మెంట్లకు గుడ్ టైంగా చెప్పవచ్చు. ఇప్పటికే మార్కెట్ల పతనం కారణంగా చాలా వరకు స్టాకులు 40-90 శాతం దిద్దుబాటుకు గురయ్యాయి. ఇప్పుడు పతనమైన స్టాకులు, మళ్లీ మూడునాలుగేళ్లలో తిరిగి మల్టీబ్యాగర్స్‌గా మారుతాయి. కానీ అన్ని స్టాకులు అలానే పుంజుకుంటాయని చెప్పడం కష్టం. అందుకే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
యుఎస్-చైనా వాణిజ్య యుద్ధం ప్రతి ఒక్కరి అంచనాలకు మించి కొనసాగుతోంది. ఇప్పటికే ఈ వాణిజ్య ఘర్షణలు ఒక కొలిక్కి రావాలి. కానీ వాణిజ్య యుద్ధం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, చైనా వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోడానికి తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించుకుంటుంది. ఇది యుఎస్, చైనా మధ్య టిట్-ఫర్-టాట్ వంటి పరిస్థితి. వాణిజ్య యుద్ధానికి పరిష్కారం దొరకడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకం. ఒకవేళ ఈ ఘర్షణ వాతవరణం కొనసాగితే ప్రపంచ మాంద్యం ఏర్పడడానికి అధికంగా అవకాశాలున్నాయి. ట్రేడ్వాల్యుమ్ల డేటా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని సూచీస్తోంది. ప్రస్తుతానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో లేకపోయినప్పటికి వాణిజ్య యుద్ధానికి త్వరలో పరిష్కారం దొరకకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా మాంద్యం వైపు వెళుతుంది. 2020 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నందున, (డోనాల్డ్) ట్రంప్ తన ట్వీట్ల ద్వారా దూకుడుగా ఉండే అవకాశం ఉంది.
తాజాగా ఆర్బీఐ ఎంపీసీ (మానెటరీ పాలసీ కమిటీ) రెపో రేటును(ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణరేటు) 35 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) కట్ చేసి, రెపో రేటును తొమ్మిదేళ్ల కనిష్టానికి తగ్గించింది. దీనితో గత ఏడాది కాలం నుంచి మొత్తంగా 110 బీపీఎస్ రేట్ల కోత చేసినట్టయ్యింది. వడ్డీ రేటు తగ్గింపు ఉన్నప్పటికీ, బ్యాంకులు రేటు కోత ఫలితాలను రుణగ్రహీతలకు అందించడం లేదనే వాదనలున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత క్రమంగా జరుగుతున్నప్పటికి ఆర్థిక పునరుజ్జీవనం ఆశించనమేర జరగడం లేదనేది వాస్తవం. తాజా రేట్ కట్ కన్నా ముందుక, ఆర్బీఐ తగ్గించిన 75 బేసిస్ పాయింట్ల రేట్ల కోతలో బ్యాంకులు కేవలం 29 బీపీఎస్‌ను మాత్రమే రుణగ్రహితలకు ప్రసారం చేశాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ అన్నారు. రేట్ల కోత ప్రసారం జరగక పోవడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం లేదు.
గత ఐదేళ్ల నుంచి కార్పొరేట్ ఆదాయాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్) స్టాక్స్ బాగా రాణించడం చూస్తున్నాం. గత రెండు-మూడేళ్ల నుంచి బ్యాంకులు బ్యాలెన్స్-షీట్లు బాగున్నాయి. వీటి ఫలితంగా ఈ జూన్ త్రైమాసికంలో తక్కువ-బేస్ ప్రభావం వలన బ్యాంకుల లాభాల్లో బలమైన వృద్ధి కనిపిస్తోంది. బ్యాంకింగ్ రంగం షేర్లు మినహా ఇతర రంగాలలోని షేర్ల ప్రదర్శన అధ్వాన్నంగా ఉంది.
ఆగష్టు 2018 లో ఏర్పడిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ డిఫాల్ట్ వలన ఇతర కార్పొరేట్లు డిఫాల్ట్‌లకు దారితీశాయి. ఫలితంగా, బ్యాంకుల ఆస్తి నాణ్యతా భయాలు పెరిగాయి. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ కొత్త ఎన్పీఏ (నిరర్ధక ఆస్తులు)లను ఎదుర్కోవలసి వచ్చింది. మునుపటి ఎన్పీఏ సమస్యలను పరిష్కరించకోడానికి, గత రెండుమూడేళ్ల నుంచి బ్యాంక్‌లు తమ బ్యాలెన్స్ షీట్లను క్లీన్‌గా ఉంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఈ చర్యే మంచి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది.
You may be interested
ఈ స్టాక్స్‌పై ఓ సారి లుక్కేయండి..!
Thursday 15th August 2019గత నెలలో కేంద్ర బడ్జెట్ సమర్పణ నాటి నుంచి స్టాక్ మార్కెట్లు కరెక్షన్ బాట పట్టాయి. గరిష్టాల నుంచి నిఫ్టీ 10 శాతం నష్టపోయింది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితుల్లోకి వెళ్లినట్టు ఆర్బీఐ సైతం పేర్కొనగా, అటు అంతర్జాతీయ ఆర్థిక రంగం పరిస్థితులు మరింత భయపెట్టేలా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయంటూ అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. రెండు
పసిడిలో పెట్టుబడులు పెట్టవచ్చా?
Wednesday 14th August 2019ర్యాలీ కొనసాగవచ్చని నిపుణుల అంచనా ఎంసీఎక్స్‌లో బంగారం పదిగ్రాముల ధర రూ. 37270ని తాకింది. దీంతో ఈ ఏడాది ఇంతవరకు పసిడి దాదాపు 18 శాతం ర్యాలీ జరిపినట్లయింది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కొనసాగుతున్న బుల్ ర్యాలీకి అనుగుణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు 1500 డాలర్లకు అటుఇటుగా కదలాడుతోంది. పసిడిలో ఇంతటి ర్యాలీకి ప్రధాన కారణం ట్రేడ్‌వార్