News


ఐదేళ్ల కోసం... ప్రస్తుతం ఇన్వెస్ట్‌ చేయోచ్చు

Tuesday 6th August 2019
Markets_main1565082487.png-27578

మార్కెట్లలో పతనం ఇన్వెస్టర్లను నిరాశావాదం వైపు నడిపించకూడదు. ఈ పరిస్థితిని మార్కెట్లలో కొనుగోలు చేయడానికి, రాబోయే ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడానికి ఒక అవకాశంగా చూడాలని ఎమ్కే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ జోసెఫ్ థామస్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

కార్పోరేట్‌ ఆదాయాలపై అంచనాలు లేవు..
సానుకూల లేదా ప్రతికూల కార్పోరేట్‌ ఆదాయాలు మార్కెట్లను ఆశ్య్చర్యపరచలేదు. కార్పోరేట్‌ ఆదాయాలలో మందగమనం స్పష్టంగా కనిపిస్తోంది. స్థూల ఆర్థిక డేటా, గత కొన్ని త్రైమాసికాల నుంచి కోలుకునే సూచనలు కనిపించడం లేదు. తగ్గిన కార్పోరేట్‌ ఆదాయాలు మార్కెట్లను మరింత నష్టపరిచాయి. తాజాగా మార్కెట్లు పడిపోవడంతో మార్కెట్ల వాల్యుషన్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. కానీ ఆదాయాల వృద్ధి తగ్గడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసే అవకాశం ఉందని గుర్తించుకోవాలి. 

ఆటో ఇంకా మందగమనంలోనే..
వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే ఆటో రంగం మరింత పడిపోనుందని అర్థమవుతుంది. వాహన తయారి, నిర్వహణ అధిక ఖర్చుతో కూడుకోవడం, ఆటో రంగం తిరిగి పుంజుకోడానికి కావలసిన ఫైనాన్స్‌ సౌకర్యాలు తక్కువగా ఉండడం, వ్యవస్థలో డిమాండ్‌ తగ్గడం ఆటో సెక్టార్‌ సంక్షోభానికి కారణమయ్యాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జులై ప్రారంభంలో 8,029 స్థాయి వద్ద ఉన్న నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ జులై నెల ముగిసే నాటికి 6,763 స్థాయికి పడిపోయింది.


ప్రపంచ మార్కెట్లు బలహీనంగానే..
అగష్టు నెలలో ఆర్బీఐ పాలసి, నో డీల్‌ బ్రెక్సిట్‌, యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ వంటి అంతర్జాతీయం విషయాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. పండుగ సీజన్‌ ప్రారంభంలో ఉండడంతో దేశియ మార్కెట్లలో కొంత​ కన్సోలిడేషన్‌ను చూడవచ్చు. దేశియ మార్కెట్లతో పాటు ఈస్ట్రన్‌ మార్కెట్లు, ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ వార్‌, ఉత్తర కొరియా వైఖరి, ఇరాన్- హార్ముజ్ జలసంధి మధ్య జరుగుతున్న పరిణామాలు, హాంకాంగ్‌లో ఆందోళన ఇవన్నీ ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దేశియంగా ఆర్థిక వృద్ధి మందగించడం, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో బలహీనత వలన దేశీయ మార్కెట్లు ప్రభావితం మవుతున్నాయి. ఆర్థికవ్యవస్థ తిరిగి పంజుకోకపోతే కార్పొరేట్ లాభదాయకత, ఆదాయాలలో మార్పురాదు. ఇది జరగాలంటే ఆర్థిక ఉద్దీపన చర్యలు అవసరం. ఆర్థిక చర్యలను ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో ప్రకటించింది. అన్నిటికన్నా ఆర్బిఐ రేట్ల కోత ముఖ్యమైన ఆర్థిక చర్యగా చెప్పుకోవచ్చు. వీటితోపాటు ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో ప్రస్తుతం రూ .1 లక్ష కోట్లకు పైగా మిగులు ఉండడంతో హెచ్‌ఎఫ్‌సీకి  (హౌసింగ్‌ ఫైనాన్స్‌ కమిషన్‌) ప్రభుత్వం ఆరునెలల పాటు లిక్విడిటి సంబంధించి హామి ఇచ్చే ప్రకటనలు చేసింది. ఇది మార్కెట్లకు సానుకూల అంశంగా పరిణమించవచ్చు. ఇటువంటి చర్యల వలన ఆర్థిక వ్యవస్థ వేగంగా బాటమ్‌ ఔట్‌ అవ్వడానికి, డిమాండ్, లాభదాయకత క్రమంగా ఏర్పడటానికి సహాయపడతాయి. 
  ఆర్థిక సంవత్సరం 2020 క్యూ 2 జిడిపి అంచనాలు 5.70-5.80 శాతం స్థాయిలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. పరిశ్రమల ఉత్పత్తి సూచీ(ఐఐపి) డేటా, కోర్ సెక్టార్ డేటా మొదలైనవి మొత్తం వృద్ధి వేగాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి.

పోర్టుపోలియోను సమీక్షించుకోండి..
ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోడానికి ఇదే అనువైన సమయం. వారు విశ్వసించదగిన మార్కెట్‌ నిపుణుల సహాయంతో పోర్ట్‌ఫోలియో సమీక్ష చేపట్టాలి. సమీక్ష వలన పోర్టుపోలియోలో ఉంచవలసిన, వదిలించుకోవాల్సిన స్టాక్‌లు తెలుస్తాయి. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులలో పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోడానికి నాణ్యమైన స్టాకులను గుర్తించడం ముఖ్యం. ఈక్విటీ ఎక్స్పోజర్‌ను ప్రత్యక్ష ఈక్విటీ ఎక్స్‌పోజర్‌తో పాటు, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ వంటి మేనేజ్డ్ ఫండ్స్‌లుగా విభజించుకోవడం కూడా మంచిదే.You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 36 శాతం జంప్‌

Tuesday 6th August 2019

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లి.(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) రుణ పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తయారుచేసిన రిజల్యూషన్‌ ప్లాన్‌ డ్రాప్ట్‌ను ఆమోదించింది. ఈ డ్రాఫ్ట్‌ ప్రణాళికను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఈ ప్రత్యేక కమిటీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఫైనాన్సియల్‌ సలహాదారు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సహకారంతో తయారు చేసింది. ఫలితంగా ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం మధ్యాహ్నం 3.06 సమయానికి  36.71 శాతం లాభపడి, రూ. 57.35 వద్ద ట్రేడవుతోంది. గత

ఫలితాల ఎఫెక్ట్‌...ఎస్‌ఆర్‌ఎఫ్‌ 14 శాతం ర్యాలీ

Tuesday 6th August 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో కంపెనీ ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయడంతో ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ క్యూ1 ఫలితాలను ప్రకటించింది. కన్షాలిడేషన్‌ ప్రాతిపదికన కంపెనీ తొలి క్వార్టర్లో నికరలాభం 41 శాతం వృద్ధి చెంది రూ.189.22 కోట్లను ఆర్జించింది. ఆదాయం 9శాతం పెరిగి రూ.1,828 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 16 శాతం పుంజుకుని

Most from this category