News


ఎయిర్‌టెల్‌లో ఎఫ్‌అండ్‌ఓ వ్యూహం!

Monday 17th February 2020
Markets_main1581912562.png-31843

రిస్కు తీసుకునే ట్రేడర్లు ఎయిర్‌టెల్‌ షేరులో బుల్‌ కాల్‌ ల్యాడర్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శుక్రవారం ఏజీఆర్‌ తీర్పుఅనంతరం ఎయిర్‌టెల్‌ షేరు ఆల్‌టైమ్‌ హైకి చేరింది. కోర్టు తీర్పు ప్రకారం బకాయిల చెల్లింపునకు ఎయిర్‌టెల్‌ నిధులు సమీకరించిందన్న వార్తలు షేరులో జోరు పెంచాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ కౌంటర్లో బుల్‌ కాల్‌ ల్యాడర్‌ వ్యూహం బెటరని నిపుణుల సూచన. 
ఈ వ్యూహంలో..
ఎయిర్‌టెల్‌ 560స్ట్రైక్‌ప్రైస్‌ వద్ద ఒక లాట్‌ కాల్‌ కొనుగోలు చేస్తారు. 590, 600 స్ట్రైక్‌ప్రైస్‌ వద్ద ఒక్కోలాట్‌ కాల్‌ను విక్రయిస్తారు. శుక్రవారం ధరల ప్రకారం చూస్తే 560 కాల్‌ లాట్‌లో ఒక షేరుకు రూ. 16.7 పడుతుంది.(ఒకలాట్‌లో 1851 షేర్లుంటాయి). 590 కాల్‌ షేరుకకు రూ.6, 600 కాల్‌ ఒక షేరుకు రూ.4 పడుతుంది. అంటే రెండు ఓటీఎం కాల్స్‌కు ఒక్కో షేరుకు రూ.10 పడుతుంది. దీంతో రూ.560 కాల్‌ కొనుగోలు ఖరీదు ఒక్కో షేరుకు రూ. 6.7 పడుతుంది.(16.7- 10= 6.7). షేరు ఎక్స్‌పైరీ లోపు ఎల్‌బీఈపీ(లోయర్‌ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌) దిగువకు వస్తే వచ్చే గరిష్ఠ నష్టం రూ.6.7 పర్‌ షేరు అవుతుంది. షేరు ఎల్‌బీఈపీ 566.7 రూపాయల వద్ద ఉంది. ఎయిర్‌టెల్‌ షేరు ఎక్స్‌పైరీకి 600 వద్దకు వస్తే వ్యూహంలో వచ్చే గరిష్ఠలాభం రూ. 23.3 అవుతుంది. రూ. 600పైన లాభం క్రమంగా తగ్గుతూ రూ. 623.3 తర్వాత నష్టం అపరిమితమవుతుంది. ఈ స్థాయిని యూబీఈపీ(అప్పర్‌బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌) అంటారు. ఎక్స్‌పైరీ చివర్లో ఐవీలు వేగంగా పతనమవుతాయన్న అంచనాలతో ఈ వ్యూహాన్ని సూచిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌; యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపాయి. 



You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 17th February 2020

 సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో గత ముగింపు ధరతో పోలిస్తే రూ.115 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ. 40,865.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  గత ముగింపు ధరతో పోలిస్తే స్వల్పంగా ఒక డాలరు​ తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,585.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  (శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా

స్వల్ప లాభం మొదలైన మార్కెట్‌

Monday 17th February 2020

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 66 పాయింట్ల లాభంతో 41,324.04 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 12,131.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాధి మరింత ఉధృతం కావడంతో పాటు, కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావంతో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని ఐఎమ్‌ఎఫ్‌ ఎండీ అభిప్రాయపడంతో నేడు ఆసియా మార్కెట్లు మూడువారాల

Most from this category