News


ఎఫ్‌అండ్‌వో ఎఫెక్ట్‌- మూడో రోజూ డౌన్‌

Thursday 26th December 2019
Markets_main1577355456.png-30458

ఎఫ్‌అండ్‌వో చివరి రోజూ మార్కెట్లు డీలా
డిసెంబర్‌ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ ఎఫెక్ట్‌
నష్టాలకు ఎదురీదిన మెటల్‌ ఇండెక్స్‌

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. తొలి నుంచీ బలహీనంగా కదిలిన మార్కెట్లు సమయం​ గడిచేకొద్దీ మరింత నీరసించాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 297 పాయింట్లు పతనమై 41,164 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 88 పాయింట్లు క్షీణించి 12,127 వద్ద స్థిరపడింది. డిసెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో గత మూడు రోజులుగా బుల్‌ ఆఫ్‌లోడింగ్‌ పెరిగినట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారు. ఈ సిరీస్‌లో అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ సరికొత్త గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. కాగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 41544-41133 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడగా.. నిఫ్టీ 12222-12119 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

బ్యాంక్స్‌, ఫార్మా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.5 శాతం క్షీణించగా.. ఫార్మా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 1-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే మెటల్‌ ఇండెక్స్‌ 0.85 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 4.4 శాతం పతనంకాగా.. ఎయిర్‌టెల్‌, ఆర్‌ఐఎల్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, గెయిల్‌, మారుతీ, ఐవోసీ 2-1.25 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఓఎన్‌జీసీ, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఐషర్‌, బజాజ్‌ ఫిన్‌, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స​ 2.5-0.4 శాతం మధ్య బలపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడయ్యే యూనియన్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, టాటా ఎలక్సీ, ఐడియా, ఎన్‌బీసీసీ, హెక్సావేర్‌, కెనరా బ్యాంక్‌, భెల్‌, యూబీఎల్‌ 7-2.25 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా మరోపక్క సెయిల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, జిందాల్‌ స్టీల్‌, మైండ్‌ట్రీ, మారికో, జూబిలెంట్‌ ఫుడ్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, నాల్కో 3.2-1.3 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స​ 0.1 శాతం నీరసించగా.. స్మాల్‌ క్యాప్‌ 0.4 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1326 లాభపడగా.. 1194 నష్టాలతో నిలిచాయి.

అమ్మకాలవైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 114 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 345 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం మార్కెట్లు పనిచేయలేదు. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1463 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1947 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.



You may be interested

ఐదేళ్లలో లాభాలు పదింతలు

Friday 27th December 2019

వేగవంతమైన వృద్ధిని నమోదు చేసే కంపెనీల షేర్లకు మంచి రీరేటింగ్‌.. కాస్త ముందుగా లేదంటే కాస్త వెనుకనో ఎ‍ప్పటికైనా జరగాల్సిందే. అప్పటి వరకు ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు ఓపిక వహించాలి. అప్పుడే లాభాలకు అవకాశం ఉంటుంది. మనీ కంట్రోల్‌ సంస్థ గత ఐదేళ్లలో లాభాలను పదిరెట్లు పెంచుకున్న కంపెనీలతో ఓ జాబితాను రూపొందించింది. వీటిల్లో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఒకటి. ఇది ఐరన్‌ అండ్‌ స్టీల్‌ రంగ

32,000 దిగువన బ్యాంక్‌ నిఫ్టీ ముగింపు

Thursday 26th December 2019

డిసెంబ‌ర్ డెరివేటివ్ కాంట్రాక్టు గ‌డువు ముగింపు నేప‌థ్యంలో గురువారం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు నెలకొన్నాయి. ఫలితంగా నేడు మార్కెట్‌ ముగిసే సరికి 32వేల స్థాయిని కోల్పోయి 31,997.70 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 32,276.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు డిసెంబ‌ర్ డెరివేటివ్ కాంట్రాక్టు గ‌డువు ముగింపు నేప‌థ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు

Most from this category