News


చిన్నస్టాకులు కొనేందుకు ఇదే సమయమా?

Monday 15th July 2019
Markets_main1563185458.png-27076

కొన్నాళ్లు ఆగమంటున్న నిపుణులు
మార్కెట్ల ఆల్‌టైమ్‌ హైవద్ద కొనసాగేందుకు కష్టపడుతున్నాయి. మరోపక్క కొన్ని మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు ర్యాలీకి రెడీగా ఉన్న సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌లో ఎంటర్‌కావడం అంతమంచిది కాదని, మరికొంతకాలం వేచిచూసి వీటిలో పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకపక్క ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు, మరోపక్క బడ్జెట్‌ ప్రతిపాదన భయాలు.. మార్కెట్‌పై భారం మోపుతున్నాయి. ఆర్థిక వృద్ధిసైతం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దీంతో బడా ఇన్వెస్టర్లు ఇంకా లార్జ్‌క్యాప్స్‌నే అట్టిపెట్టుకొని కూర్చున్నారు.

ఈ నేపథ్యంలోఎకానమీలో రికవరీ స్పష్టంగా కనిపించేవరకు చిన్నస్టాకుల్లో ఎంటర్‌కావడం మంచిది కాదని అవెండస్‌ క్యాపిటల్‌ సీఈఓ వైభవ్‌ సంఘవి చెప్పారు.

చిన్నస్టాకులు ఇప్పటికే చాలా పతనమయ్యాయని, కానీ వీటిలో ఇంకా కొంత పతనం మిగిలే ఉందని, ఇండియా ఈక్విటీ ప్రతినిధి నీలకాంత్‌ మిశ్రా చెప్పారు. ఎకానమీ రికవరీ చూపనంతవరకు వీటిలో కూడా రికవరీ రాదన్నారు. ఏవో కొన్ని చిన్నస్టాకుల్లో మాత్రం అడపాదడపా అవకాశాలు వస్తుంటాయని వివరించారు. 
మార్కెట్లో పరిస్థితికి తగ్గట్లే ప్రధాన సూచీలతో పోలిస్తే తాజా పతనంలో చిన్న సూచీలు ఎక్కువ పతనమయ్యాయన్నారు. రిస్కులు తగ్గినతర్వాతే చిన్నస్టాకులు ర్యాలీ చూపుతుంటాయని, ఇప్పుడున్న రిస్కీ వాతావరణంలో అన్ని రంగాల్లో సెంటిమెంట్‌ దెబ్బతిన్నదని ప్రభుదాస్‌ లీలాధర్‌ ప్రతినిధి అజయ్‌ బోడ్కే చెప్పారు.
చిన్నస్టాకుల వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నా, ఎకానమీలో విశ్వాసం సన్నగిల్లడం వల్ల వీటిపై ఇంకా మదుపరులు కన్నేయడం లేదన్నారు. దీనికితోడు బలమైన ఎర్నింగ్స్‌ కూడా లేకపోవడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందన్నారు.

కానీ అన్ని చిన్న స్టాకులను ఒకేగాటన కట్టేయలేమని, కొన్ని మంచి కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా ఉండి, అవకాశాలు కల్పిస్తున్నాయని షేర్‌ఖాన్‌ రిసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌ దేవ్‌ చెప్పారు. స్వల్పకాలానికైతే లార్జ్‌క్యాప్స్‌ను నమ్ముకోవాలని, లాంగ్‌టర్మ్‌కు మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ను ఎంచుకోవచ్చని సలహా ఇచ్చారు. 



You may be interested

ఐటీ సూచీ ముందుకు

Monday 15th July 2019

ఇన్ఫోసిస్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాక దీని షేరు విలువ గత రెండు సెషన్‌లో నుంచి పాజిటివ్‌గా ముగుస్తోంది. సోమవారం ట్రే డింగ్‌లో ఏకంగా 7.24 శాతం లాభపడి 779.40 వద్ద క్లోజయ్యింది. ఇన్ఫోసిస్‌ ప్రభావంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2.85 శాతం లాభపడి 15,662.05 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో   ఇన్ఫోసిస్‌ 7.24 శాతం, ఒఫెస్స్‌ 2.66శాతం,  టెక్‌ మహింద్రా 2.07 శాతం,

సీఎఫ్‌ఓ అరెస్ట్‌: ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 13శాతం పతనం

Monday 15th July 2019

కంపెనీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసుర్‌ అరెస్ట్‌ కావడంతో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 13శాతం పతనమయ్యాయి. రూ.14.58 కోట్ల కస్టమ్స్‌ పన్ను ఎగవేత కేసులో ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు సేవలందిస్తున్న దినేశ్ మహేశ్వరీని శనివారం డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) అరెస్టు చేసింది. బంగ్లాదేశ్ నుంచి రెడిమేడ్ దుస్తులను దిగుమతి చేసుకున్న ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్.. కనీస కస్టమ్స్ పన్ను చెల్లించకుండా పెట్రోపోల్ లాండ్ కస్టమ్స్ స్టేషన్

Most from this category