కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి..!
By Sakshi

బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల తగ్గింపు వలన కార్పోరేట్ ఫిక్సిడ్ డిపాజిట్ల వైపు స్థిర ఆదాయం కలిగిన ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండేళ్ల నుంచి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ప్రతికూల రాబడులే వస్తున్నాయని, అందుకే చాలా మంది పెట్టుబడిదారులు స్థిర-రాబడి ఉత్పత్తులకు ఆకర్షితులవుతున్నారని మనీ హనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిఈఓ అనుప్ భయ్యా అన్నారు. ‘మొదటిసారి పెట్టుబడులు చేసే వారిలో చాలా మంది స్థిర డిపాజిట్లలో ఇన్వెస్ట్‌చేయడానికి ఇష్టపడుతున్నారు. వీటిలో రాబడులకు భరోసా ఉంటుంది. అంతేకాకుండా వీటిని సులభంగా అర్థం చేసుకోడానికి వీలుంటుంది’ అని ఆయన వివరించారు. మిడ్, స్మాల్ క్యాప్ సెక్టార్లలో అనేక స్టాక్స్ గత ఏడాది కాలంలో 20-25 శాతం పతనమయ్యాయి. ఇదే కాలంలో ఎస్ అండ్ పి బిఎస్ఇ ఇండెక్స్ 0.83 శాతం లాభపడింది. పెట్టుబడిదారులు కార్పొరేట్ ఎఫ్‌డిల వైపు మొగ్గు చూపుతారు
తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని మెచ్యూరిటీలలోడిపాజిట్ రేట్లను తగ్గించడంతో కార్పోరేట్ డెట్ పేపర్లో డిపాజిట్ల రద్దీ పెరిగింది. కార్పోరేట్ల డిపాజిట్లపై రేట్లు తగ్గించక ముందే ఈ బ్యాంక్‌లలోని స్థిర డిపాజిట్లను అధిక రేట్ కలిగిన వాటిలో పెట్టడానికి ఇన్వెస్టర్లు సమాయత్తమవుతున్నారు. రేట్ల తగ్గింపు తర్వాత ఎస్బీఐ గరిష్టంగా 7 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.5 శాతం వడ్డీని ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్నున్నాయి. అదే ప్రైవేటు రంగ బ్యాంకులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి బ్యాంకుల 7 శాతం నుంచి 7.3 శాతం మధ్య రాబడిని అందిస్తున్నాయి. కానీ కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఈ రాబడులు ఈ బ్యాంకులతో పోల్చుకుంటే అధికంగా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ స్థిర డిపాజిట్‌పై 8.6 శాతం, మహీంద్రా ఫైనాన్స్ 8.8 శాతం, ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ 8.4 శాతం వరకు రాబడులను ఇస్తున్నాయి. సీనియర్ సిటిజన్లు 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల అదనపు రాబడిని కూడా పొందే అవకాశం ఉంది.
బ్యాంకులతో పోల్చుకుంటే 100-200 బేసిస్ పాయింట్ల అదనపు రాబడి వస్తుండడంతో కార్పోరేట్ స్థిర డిపాజిట్ల వైపు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. కానీ ప్రస్తుత వాతావరణాన్ని బట్టి, బలమైన నిర్వహణ, అధిక నాణ్యత, ఏఏఏ- రేటెడ్, బలమైన కంపెనీ దన్నుగా ఉన్న కంపెనీల వైపు మాత్రమే అడుగులు వేస్తున్నారు. నెలవారీ లేదా త్రైమాసిక వడ్డీ చెల్లింపుల ఆప్షన్ ఉండడంతో సీనియర్ పౌరులు తమ ఖర్చులను తీర్చుకోడానికి స్థిర-ఆదాయం నుంచి వచ్చే వడ్డీని ఉపయోగించుకుంటున్నారు. ‘ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత అనేక రకాల డెట్ ఫండ్లు తక్కువ రాబడిని ఇచ్చాయి. ఫలితంగా రాబడులకు భరోసా ఉన్న ఎఫ్‌డిలను ఎంచుకోవడానికి పెట్టుబడులు ఆసక్తి చూపిస్తున్నారు’ అని జిఈపిఎల్ క్యాపిటల్‌కు చెందిన రూపేష్ భన్సాలీ అన్నారు.
You may be interested
టెక్ మహీంద్రా లాభం రూ.959 కోట్లు
Wednesday 31st July 20197 శాతం వృద్ధి 4 శాతం తగ్గిన మార్జిన్ రూ.8,653 కోట్లకు ఆదాయం న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.959 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం, రూ. 898 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,388 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ.8,653 కోట్లకు చేరిందని కంపెనీ
3 శాతం లాభపడిన హీరో..పాజిటివ్‌గా ‘ఆటో’
Wednesday 31st July 2019హీరోమోటర్ కార్ప్ క్యూ1 పలితాలలో మార్కెట్ అంచనాలను సునాయాసంగా అధిగమించింది. ఈ కంపెనీ క్యూ1లో రూ. 785 కోట్ల నికర లాభాలను ప్రకటిస్తుందని మార్కెట్లు అంచనా వేయగా గత ఏడాది ఇదే త్రైమాసిక నికర లాభం కన్నా 38 శాతం పెరిగి రూ. 1,257 కోట్లను నమోదుచేసింది. ఫలితంగా బుధవారం ఆటో షేర్లు పాజిటివ్‌లో ఉన్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 0.78 శాతం లాభపడి 6,816.65 వద్ద ట్రేడవుతోంది. ఈ