News


ఈ ర్యాలీ ఆశ్చర్యకరం!

Tuesday 26th November 2019
Markets_main1574764793.png-29875

ఎఫ్‌ఐఐల నిధులే కారణం
మహేశ్‌ పటేల్‌
మంగళవారం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలు నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలు ఆల్‌టైమ్‌ హైని తాకాయి. యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై సానుకూల అంచనాలు, క్యు2లో ఎర్నింగ్స్‌ బాగుండడం తదితర కారణాలు సూచీలను నడిపించాయి. సెప్టెంబర్‌ 19 కనిష్ఠాల నుంచి సూచీలు దాదాపు 13 శాతం ర్యాలీ జరిపాయి. ఈ అప్‌మూవ్‌ అనూహ్యమని, గణాంకాల ఆధారితంగా రాలేదని, కేవలం అంతర్జాతీయ లిక్విడిటీ పెరగడం, అంతర్జాతీయ సానుకూల పవనాల కారణంగా వచ్చిందని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ కోసీఐఓ మహేశ్‌ పాటిల్‌ చెప్పారు. ఎఫ్‌ఐఐల నుంచి దేశీయ మార్కెట్లోకి నిధుల ప్రవాహం పెరగడం సూచీలను ముందుకు నడిపించిందన్నారు. మార్కెట్లు సాధారణంగా రిస్కులు తగ్గినట్లు కనిపించగానే మొదలైతాయన్నారు. కానీ తమకు ఇంకా ఇండియా ఈక్విటీలపై పూర్తి నమ్మకం లేదని చెప్పారు. ఈ రిస్కీ మనీ(ఎఫ్‌ఐఐ నిధులు) ఆగిపోగానే సూచీల్లో వేగం కూడా చల్లబడుతుందన్నారు. ఎకానమీ నుంచి స్వీయవ్యక్తంగా రికవరీ రావాలని చెప్పారు. క్యు2లో అన్ని రంగాల్లో ఎర్నింగ్స్‌ మారలేదని, అందువల్ల పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు సాధారణంగానే ఉండొచ్చన్నారు.
కార్పొరేట్‌టాక్స్‌ తగ్గింపు ఈ ఏడాది ఫలితాల్లో ఏమీ పెద్ద పాజిటివ్‌ ప్రభావం చూపకపోవచ్చన్నారు. అయితే వచ్చే ఏడాది ఈ ప్రభావం బాగా కనిపిస్తుందని పాటిల్‌ చెప్పారు. ఇప్పటివరకు నీరసంగా ఉన్న ఫార్మా, మెటల్‌ రంగాల ఫలితాలు ఇకపై బాగుంటాయని అభిప్రాయపడ్డారు. చమురు గ్యాస్‌, ఐటీ సైతం మెరుగుదల చూపుతాయని అంచనా వేశారు. ప్రస్తుత ర్యాలీకి కారణం మార్కెట్లు భవిష్యత్‌ను ముందే పసిగట్టడమని చెప్పారు. రాబోయే త్రైమాసికాల్లో ఎర్నింగ్స్‌ బాగుంటాయని భావించిన మార్కెట్లు ప్రస్తుతం కదం తొక్కుతున్నాయన్నారు. రుతుపవనాలు బాగున్నందున రాబోయే రోజుల్లో రూరల్‌ వినిమయం ఊపందుకుంటుందన్నారు. వడ్డీరేట్లు తగ్గడం మొదలవగానే రియల్టీలో జోష్‌ వస్తుందన్నారు.  సూచీల్లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతుందని, కానీ ర్యాలీ కొనసాగాలంటే విస్తృత స్థాయి కొనుగోళ్లు రావాలని హీలియోస్‌ క్యాపిటల్‌ సమీర్‌ అరోరా చెప్పారు. ప్రస్తుత ర్యాలీ విస్తృతమైనది కాదన్నారు. పెట్టుబడుల ఉపసంహరణపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించడంతో విత్త సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయని భావించడమే మార్కెట్లో తాజా ర్యాలీకి కారణమని ఎక్కువమంది అనలిస్టులు భావిస్తున్నారు. You may be interested

కొత్త రికార్డు వద్ద లాభాల స్వీకరణ

Tuesday 26th November 2019

స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు ఆదుకున్న రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కొత్త గరిరిష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్‌, నిఫ్టీ జీవితకాల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు మంగళవారం స్వల్ప నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 68 పాయింట్లు నష్టంతో 40,821.30 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లను కోల్పోయి 12,037.70 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌, మెటల్‌, మీడియా, అటో రంగ షేర్ల నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌,

విదేశీ ఇన్వెస్టర్ల రాడార్‌లో మిడ్‌క్యాప్స్‌!

Tuesday 26th November 2019

-సునిల్‌ సుబ్రమణ్యం ‘పూర్తి లార్జ్‌క్యాప్‌లను మాత్రమే కాకుండా మిడ్‌క్యాప్‌ విభాగాన్ని కూడా ఎఫ్‌ఐఐ(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు)లు పరిశీలిస్తున్నారు’ అని ఎండీ, సీఈఓ, సుందరమ్‌ మ్యుచువల్‌ ఫండ్‌, సునిల్‌ సుబ్రమణ్యం ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... మార్కెట్ ర్యాలీ కొన్ని స్టాకుల వలనే.. మార్కెట్లో కొన్ని స్టాకుల మాత్రం ర్యాలీ చేస్తున్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు అధికంగా వీటిపై దృష్ఠి సారించలేరు.  మార్కెట్లు పడిపోతాయనే

Most from this category