News


వారెన్‌ బఫెట్‌ ఐడియాలజీ స్టాక్స్‌ ఇవి!

Wednesday 26th February 2020
Markets_main1582706122.png-32109

జజాబితాలో హనీవెల్‌ ఆటోమేషన్‌, అబాట్‌ ఇండియా
బాటా ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్‌, జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌
భారత్‌ రసాయన్‌, రత్నమణి మెటల్స్‌, ట్యూబ్స్‌

ప్రపంచంలోనే సుప్రసిద్ధుడు, అత్యంత విజయవంత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ అనుసరించే సూత్రాలతో దేశీయంగా మార్కెట్‌ విశ్లేషకులు కొన్ని కౌంటర్లను ఎంపిక చేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం బెర్క్‌షైర్‌ హాథవే నిర్వహణ నుంచి వయసురీత్యా ఇటీవల బఫెట్‌ తప్పుకున్నారు. నిర్వహణ భాగస్వామి, మిత్రుడు చార్లీ ముంగర్‌ సైతం​బఫెట్‌ దారిలోనే నడిచారు. ఈ సందర్భంగా వాటాదారులకు రాసిన లేఖలో బఫెట్‌ 89 ఏళ్ల వయసులోనూ పూర్తిస్థాయిలో ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలియజేశారు. 99 శాతం నెట్‌వర్త్‌ బెర్క్‌షైర్‌ స్టాక్‌లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకూ ఎన్నడూ బెర్క్‌షైర్‌ షేర్లను విక్రయించలేదని, ఆ ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. అయితే 1980లో చారిటబుల్‌ డొనేషన్లు, వ్యక్తిగత బహుమానాలకుగాను స్వల్పంగా బెర్క్‌షైర్‌ షేర్లను వినియోగించినట్లు తెలియజేశారు. వాటాదారులకు బఫెట్‌ రాసే లేఖలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తుంటుంది. ఈ లేఖలలో బఫెట్‌ పెట్టుబడి సూత్రాలు, ఎదుర్కొన్న సమస్యలు తదితర పలు అంశాలను వివరిస్తూ ఉంటారు. గత నాలుగైదు దశాబ్దాలుగా వీటిని వేల్యూ ఇన్వెస్టింగ్‌ పాఠాలుగా పలువురు భావిస్తూ వస్తున్నారు. 

సంపద సృష్టి
నాలుగు దశాబ్దాలుగా బఫెట్‌ పాఠాలు దీర్ఘకాలిక సంపద సృష్టిలో పలువురుకి ఆదర్శంగా నిలుస్తున్నట్లు నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వయిజర్స్‌ సీఈవో శైలేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. బఫెట్‌ లేఖలలో పేర్కొనే అంశాలు పెట్టుబడికి అత్యుత్తమ సూత్రాలుగా ప్రసంశించారు. వీటిని అనేక సందర్భాలలో అనుసరించినట్లు తెలియజేశారు. బఫెట్‌ పెట్టుబడి సూత్రాల ప్రకారం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయాలంటే అధిక రిటర్న్‌ ఆన్‌ కేపిటల్‌ కలిగి ఉండాలి. సమర్ధవంత, నిజాయితీగల నిర్వహణలో నడుస్తుండాలి. రీజనబుల్‌ ధరలో లభిస్తుండాలని శైలేంద్ర వివరించారు. బఫెట్‌ దీర్ఘకాలిక ప్రణాళికలతో పెట్టుబడి వ్యూహాలను అనుసరిస్తుంటారని కేపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్‌ గౌరవ్‌ గార్గ్‌ పేర్కొన్నారు. రుణ భారం తక్కువగా ఉండి అధిక వృద్ధికి అవకాశాలున్న కంపెనీలకు బఫెట్‌ ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. కంపెనీలు నిర్వహించే బిజినెస్‌లను అర్థం చేసుకోగలిగే రంగాలను ఎంచుకుంటారని తెలియజేశారు. నిర్వహణ లాభాలను గమనించడం ఎల్లప్పుడూ ప్రయోజనకరమని, ఇది కంపెనీకి కీలకమైన బిజినెస్‌ నాణ్యతను వెల్లడిస్తుం‍దని వివరించారు. బఫెట్‌ మెథడాలజీలో కంపెనీ అంతర్గత విలువను సైతం పరిగణిస్తారని తెలియజేశారు. తద్వారా స్టాక్స్‌ కొనుగోలు లేదా విక్రయాలకు స్పష్టమైన సంకేతాలు లభిస్తాయని చెప్పారు.

ఎంపిక ఇలా
బెంజమన్‌ గ్రాహమ్‌కు ప్రథమ శిష్యుడైన బఫెట్‌..వేల్యూ ఇన్వెస్టింగ్‌ గురుగా ప్రసిద్ధులయ్యారు. ఇన్వెస్టర్లకు స్టాక్‌ ఎంపికను సులభతరం చేస్తూ లేఖల ద్వారా పలు విలువైన సూత్రాలను తెలియజేస్తూ వచ్చారు. ఈ బాటలో మార్కెట్‌స్మిత్‌ రూపొందించిన డేటాతోపాటు..  రెలిటివ్‌ స్ట్రెంగ్త్‌(ఆర్‌ఎస్‌)ను వినియోగించడం ద్వారా కొన్ని స్టాక్స్‌ను ఎంపిక చేసినట్లు మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు. మార్కెట్‌స్మిత్‌ రూపొందించిన సూత్రాలలో అధిక వృద్ధికి అవకాశాలు, స్టాక్‌ పటిష్ట ర్యాలీకి చాన్స్‌ వంటి అంశాలను మాస్టర్‌ స్కోర్‌లో ప్రధానంగా తీసుకున్నట్లు తెలియజేశారు. తద్వారా స్టాక్స్‌ను ఫిల్టర్‌ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా గత ఏడాది కాలంలో స్టాక్‌ ధరల్లో ఏర్పడిన మార్పులను గమనించేందుకు టెక్నికల్‌ టూల్‌ అయిన ఆర్‌ఎస్‌ను వినియోగించినట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా ఇటీవలి మూడు నెలల కాలంలో స్టాక్‌ తీరుకు 40 శాతం, అంతక్రితం మిగిలిన మూడు క్వార్టర్లకుగాను 20 శాతం చొప్పున వెయిటేజీ ఇచ్చినట్లు వివరించారు. రూ. 500 కోట్లకుపైగా మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీలను పరిగణించినట్లు తెలియజేశారు. 

జాబితా ఇదీ..
మార్కెట్‌ నిపుణులు వివిధ ఫిల్టర్లను వినియోగించి ఎంపిక చేసిన కౌంటర్లలో మాస్టర్‌ స్కోర్‌ 78తో.. హనీవెల్‌ ఆటోమేషన్‌ ఇండియా, నెస్కో లిమిటెడ్‌, రిలాక్సో ఫుట్‌వేర్‌ చోటుచేసుకున్నాయి. ఈ బాటలో అబాట్‌ ఇండియా(77), అతుల్‌ లిమిటెడ్‌(75), జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌(75), భారత్‌ రసాయన్‌(75), బాటా ఇండియా(74), రత్నమణి మెటల్స్‌, ట్యూబ్స్‌(74) జాబితాను ఆక్రమించాయి.

(కొంతమంది మార్కెట్‌ నిపుణులు ఎంపిక చేసిన ఈ స్టాక్స్‌ వివరాలు కేవలం ఇన్వెస్టర్ల అవగాహన కోసమే. పెట్టుబడులు చేపట్టాలనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణులను సం‍ప్రదించవలసిందిగా మనవి)You may be interested

52 వారాల కనిష్టానికి 166 షేర్లు

Wednesday 26th February 2020

బుధవారం 166 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, A2Z ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ABB ఇండియా, అగ్రి టెక్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా పేపర్‌, అపర్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కిస్‌, ఆరో గ్రీన్‌టెక్‌, అర్షియా, అటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లిస్‌, అసోసియేటెడ్‌ అల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, అట్లాంటా, బజాజ్‌ కన్జూమర్‌కేర్‌, బాల్మర్ లారీ అండ్‌ కంపెనీ, బంధన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌

టారీఫ్‌ల పెంపు ఎఫెక్ట్‌: డిసెంబర్లో తగ్గిన సబ్‌స్క్రైబర్లు..!

Wednesday 26th February 2020

టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ జియోకు తాజాగా షాక్‌ తగిలింది. నవంబర్లో 5లక్షల 60 వేల కొత్త సబ్‌స్క్రైబర్లును కూడకట్టుకున్న జియో... డిసెంబర్‌లో కేవలం 82,308 మంది సబ్‌స్క్రైబర్లను మాత్రమే జతచేసుకున్నట్లు గణాంకాలు తెలిపాయి. తద్వారా మొత్తం సబ్‌స్క్రైబర్‌ బేస్‌ 370 మిలియన్లుగా నమోదైంది. అయినప్పటికీ  జియో ఇప్పటికీ మార్కెట్‌ వాటాలో 32.14 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది.  ఏజీఆర్‌ బకాయిలతో సంక్షోభంలో పడ్డ వొడాఫోన్‌ ఐడియా చందాదారుల విషయంలో

Most from this category