News


ఈ స్టాక్స్‌లో రాబడులకు చాన్స్‌..!

Thursday 5th December 2019
Markets_main1575485303.png-30057

ప్రభుత్వం ప్రకటించిన పలు ప్రోత్సాహక చర్యలు, ఇతర సానుకూల అంశాల ఆధారంగా ఈక్విటీ మార్కెట్లు అధిక బేస్‌ దిశగా అడుగులు వేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు గత రెండు నెలల్లో కొనుగోళ్లు చేస్తుండడం కూడా కలిసొస్తోంది. అటు ఎఫ్‌ఐఐలు, ఇటు డీఐఐల పెట్టుబడులతో నూతన గరిష్టాలకు మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. కొన్ని అధిక వెయిటేజీ స్టాక్స్‌తో ప్రస్తుత ర్యాలీ నడుస్తోందని, ఇది తదుపరి ఆర్థిక సంవత్సరానికి కూడా విస్తరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌పై దృష్టి సారించడం మంచిదని సూచిస్తున్నారు. యస్‌ బ్యాంకు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, సీడీఎస్‌ఎల్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, ఫెడరల్‌ బ్యాంకు, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, సుదర్శన్‌ కెమికల్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ స్టాక్స్‌ను ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు ఏడాది కాల వ్యవధి కోసం సూచించాయి.  

 

యస్‌ బ్యాంకు
ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ ఈ స్టాక్‌కు రూ.101 టార్గెట్‌ ఇచ్చింది. ‘‘అధిక రిస్క్‌తో, అధిక రాబడులకు అవకాశం ఉంది. మార్కెట్‌ విలువ, డిపాజిట్‌ రేషియోతో పోలిస్తే 10 శాతానికి పైగా తక్కువలో ఉంది. పోటీ బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఒక్కసారి ఈ సవాళ్లను అధిగమించితే బ్యాంకు వ్యాపారం మరింత బలంగా, తక్కువ అస్థిరతలతో ఉంటుంది. దీంతో హోల్డ్‌ నుంచి ‘బై’కి రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం’’ అని ఎడెల్‌వీజ్‌ పేర్కొంది.

 

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
సీఎల్‌ఎస్‌ఏ ఈ స్టాక్‌కు రూ.450 టార్గెట్‌గా ఇచ్చింది. అంటే ప్రస్తుత స్థాయి నుంచి 55 శాతం రాబడులకు అవకాశం ఉ‍న్నట్టు. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రుణాలు మంజూరు చేసిన ఐదు కంపెనీల్లో మూడు తిరిగి చెల్లింపులు చేయగా, రెండు స్టాండర్డ్‌ ఖాతాలుగా ఉన్నట్టు కార్పొరేట్‌ శాఖ ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడం తెలిసిందే. ‘‘కోర్టు నిర్ణయం పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఇది కొంత ఆందోళనలను తొలగిస్తుంది. ఈ స్పష్టత కారణంగా కంపెనీ డెట్‌ మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణకు అవకాశాలను మెరుగు పడతాయి. 2020-21 వరకు వృద్ధి స్వల్పంగానే ఉంటుంది. వ్యాల్యూషన్‌ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది’’ అని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.

 

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌
ఈ స్టాక్‌కి ఆనంద్‌రాతి బ్రోకరేజీ సంస్థ రూ.1,860 టార్గెట్‌ ఇచ్చింది. రెండో త్రైమాసికం ఆదాయాలు అంచనాలకు మించి ఉన్నాయని పేర్కొంది. ‘‘లింబిక్‌ కొనుగోలు తర్వాత, మరో క్లౌడ్‌ కన్సల్టింగ్‌ కంపెనీ అయిన పవరప్‌ క్లౌడ్‌ టెక్నాలజీస్‌ను కూడా కొనుగోలు చేయడం వల్ల కంపెనీ సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. మంచి డీల్స్‌ను సంపాదించడం, భారీ డీల్స్‌ను సొంతం చేసుకుంటుండడంతో క్యూ3లో పనితీరు మెరుగ్గా ఉంటుంది’’అని ఆనంద్‌రాతి పేర్కొంది.You may be interested

గత ఐదేళ్లలో లాభాలు తినిపించిన ఫండ్స్‌

Thursday 5th December 2019

అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల (మ్యూచువల్‌ ఫండ్స్‌/ఏఎంసీలు) నిర్వహణలో ప్రస్తుతం మొత్తం రూ.25.60 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు ఇచ్చేందుకు ప్రతీ ఏఎంసీ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. కానీ, అందరూ రాణించలేరు. కొన్ని ఫండ్స్‌ మాత్రమే మార్కెట్‌కు ఎదురీది లాభాలు తినిపిస్తాయి. చార్ట్‌ల్లో కానీ, ఆయా విభాగాల్లో కానీ టాప్‌ పథకాలుగా నిలస్తుంటాయి. కనుక మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ

చివరి గంటలో కొనుగోళ్లు

Wednesday 4th December 2019

 ట్రేడ్‌డీల్‌ కుదరొచ్చన్న వార్తలు 175 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 12,000 పైన ముగిసిన నిఫ్టీ  మార్కెట్‌ చివరి గంటలో అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే వార్తలు అనూహ్యంగా తెరపైకి రావడంతో మార్కెట్‌ బుధవారం లాభంతో ముగిసింది. బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్ల దన్నుతో సెన్సెక్స్‌ 175 పాయింట్లు పెరిగి 40850 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 12వేల పైన 12,037.30 వద్ద స్థిరపడింది. , రేపు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల

Most from this category