STOCKS

News


ఐటీ తగ్గిస్తే ఈ షేర్లకు పండుగే!

Thursday 30th January 2020
Markets_main1580368042.png-31336

వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి తగ్గిస్తే ఎకానమీలో వినిమయం పెరుగుతుందని ఎకనమిస్టులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఈ దఫా బడ్జెట్లో ఐటీ తగ్గింపు యోచనలో ఉన్నట్లు ఊహాగానాలున్నాయి. ఇదే నిజమైతే పలు రంగాలకు ముఖ్యంగా ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు మంచి ఉషారు వస్తుందని మార్కెట్‌నిపుణులు అంచనా వేస్తున్నారు. టాక్స్‌ స్లాబుల మార్పుతో బ్రాండెడ్‌ దుస్తులు, ఫుట్‌వేర్‌, హోటల్స్‌, రెస్టారెంట్లకు గిరాకీలు పెరుగుతాయని షేర్‌ఖాన్‌ అభిప్రాయపడింది. దీంతో పాటు దీర్ఘకాలంలో హౌసింగ్‌, నిర్మాణ రంగాలకు మేలని తెలిపింది.

ఐటీ తగ్గింపుతో లాభపడతాయని వివిధ బ్రోకరేజ్‌లు భావిస్తున్న షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి...
= షేర్‌ఖాన్‌ ప్రకారం డీఎల్‌ఎఫ్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఓబెరాయ్‌ రియల్టీ, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అసహైనా హౌసింగ్‌, కజారియా సిరామిక్స్‌, సెంచరీ ప్లేబోర్డ్స్‌, ఆస్ట్రల్‌పాలీ, సుప్రీం ఇండస్ట్రీస్‌ షేర్లు పాజిటివ్‌గా ఉంటాయి.
= రిలయన్స్‌ సెక్యూరిటీస్‌: అశోక్‌లేలాండ్‌(టార్గెట్‌ రూ. 111), హీరోమోటోకార్‌‍్ప(రూ. 3000 టార్గెట్‌), మారికో(టార్గెట్‌ రూ. 400), ఇమామీ(టార్గెట్‌ రూ. 400), ఇండియన్‌హోటల్స్‌(రూ. 165 టార్గెట్‌).
= ట్రేడింగ్‌ బెల్స్‌: పీవీఆర్‌(రూ. 2500), ఆదిత్యబిర్లాఫ్యాషన్‌(రూ. 300), వీఐపీ ఇండస్ట్రీస్‌(టార్గెట్‌ రూ. 570), ఇండియన్‌హోటల్స్‌(రూ. 180 టార్గెట్‌).
= కోటక్‌ సెక్యూరిటీస్‌: బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌(టార్గెట్‌ రూ. 350), కోల్‌గేట్‌ పామోలివ్‌(టార్గెట్‌ రూ. 1700), మారికో(టార్గెట్‌ రూ. 385), యునైటెడ్‌ బ్రూవరీస్‌(టార్గెట్‌ రూ. 1400). 



You may be interested

బజాజ్‌ అటో ఫలితాలు అంచనాలను మించాయ్‌...!

Thursday 30th January 2020

బజాజ్‌ అటో మూడో త్రైమాసికపు ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు మించి నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఈ క్యూ3లో రూ.1,262 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సాధించిన రూ.1,102 కోట్లతో ఇదే ఇది 15శాతం అధికం. విశ్లేషకులు రూ.1,190 కోట్ల నికరలాభాన్ని సాధించవచ్చని అంచనా వేశారు. నిర్వహణ ఆదాయం 3శాతం పెరిగి రూ.7,640 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఇదే క్వార్టర్‌లో ఇది రూ.7,436

గోద్రేజ్‌ కన్జూమర్‌ 6 శాతం డౌన్‌

Thursday 30th January 2020

దేశీయ ప్రముఖ గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌ కంపెనీ  డిసెంబర్‌తో ముగిసిన క్యూ3 ఫలితాల్లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5.11 శాతం పెరిగి రూ.445.20  చేరినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ క్రెడిట్‌ సూసీ న్యూట్రల్‌ రేటింగ్‌ను ఇవ్వడంతో గురువారం మధ్యహ్నం 12.30 గంటల ప్రాంతంలో గ్రోద్రేజ్‌ షేర్లు 6 శాతం పడిపోయి 696.30 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 

Most from this category