News


2020లో నిఫ్టీ@ 14, 400!

Thursday 2nd January 2020
Markets_main1577948473.png-30615

బ్రోకరేజ్‌ల అంచనా
దేశీయ సూచీలు 2019ని 12- 14 శాతం లాభాలతో ముగించాయి. ఇదే జోరు కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతుందని, నిఫ్టీ 2020లో 14400 పాయింట్లను చేరుతుందని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. నిఫ్టీ 2019 ముగింపుతో పోలిస్తే దాదాపు 18 శాతం మేర కొత్త ఏడాది లాభపడవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. నిఫ్టీ ప్రస్తుతం కీలకమైన టార్గెట్‌ 12300ను తాకిందని, ఈ దశలో కొంత వెనకంజ వేసి 11900- 12000 పాయింట్ల వరకు రావచ్చని, ఈ పతనాన్ని కొత్త కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలని సూచించింది. నిఫ్టీ కొత్త ఏడాదిలో కనిష్ఠంగా 13000 పాయింట్ల వరకు, గరిష్ఠంగా 14400 పాయింట్ల వరకు చేరవచ్చని తెలిపింది. నిప్టీకి 10000 పాయింట్ల వద్ద బలమైన బేస్‌ ఏర్పడిందని వివరించింది. రాబోయే బడ్జెట్‌, అంతర్జాతీయ పరిణామాలు, కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌లో వృద్ధి, ట్రేడ్‌ డీల్‌ లాంటివి మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. 
కొత్త ఏడాదిలో మార్కెట్‌పై బ్రోకరేజ్‌ల అంచనాలు...


ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లో 12- 15 శాతం ర్యాలీ కొత్త ఏడాది ఉంటుందని క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రిసెర్చ్‌ అంచనా వేసింది. బ్యాంకుల ఎన్‌పీఏలు దిగిరావడం, ట్రేడ్‌ డీల్‌ కుదురుతుండడం లాంటివి నిఫ్టీ 14వేలను చేరేందుకు సాయం చేస్తాయని తెలిపింది. ఎల్‌టీసీజీ తగ్గింపు సహా పలు పాజిటివ్‌ మార్పులను బడ్జెట్‌ తీసుకురావచ్చని కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. ఇప్పటికే టెక్నికల్‌గా పాజిటివ్‌ పరుగు ఆరంభమైందని, కొత్త ఏడాదిలో నిఫ్టీ 13200 పాయింట్ల వరకు పరుగు తీయవచ్చని తెలిపింది. భారత మార్కెట్లలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని, అంతర్జాతీయ రికవరీ నేపథ్యంలో దేశీయ సూచీలు మంచి పనితీరు కనబరుస్తాయని రెలిగేర్‌ బ్రోకింగ్‌ తెలిపింది. ఈ ఏడాది సెన్సెక్స్‌ 43000 పాయింట్ల పైకి, నిఫ్టీ 13000 పాయింట్ల పైకి పరుగు తీయవచ్చని అంచనా వేసింది. 



You may be interested

8నెలల గరిష్టానికి టాటా మోటర్స్‌

Thursday 2nd January 2020

టాటా మోటర్స్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 9నెలల గరిష్టాన్ని అందుకుంది. అమెరికా చైనాల మధ్య వాణజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాలు షేరు లాభపడేందుకు కారణమని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. అర్థికంగా అతిపెద్ద దేశాల మధ్య కుదరనున్న ఈ వాణిజ్య ఒప్పందంతో టాటామోటర్స్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా పెరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా మోటర్స్‌కు చైనా అతిపెద్ద మార్కెట్‌ కాగా తరువాత స్థానాల్లో అమెరికా,

సెన్సెక్స్‌ డబుల్‌- ఈ 4 మిడ్‌క్యాప్స్‌.. కేక

Thursday 2nd January 2020

నిఫ్టీ హాఫ్‌ సెంచరీ కొత్త ఏడాదిలో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా ఈ నెల 15కల్లా ప్రాథమిక దశ ఒప్పందం కుదరనున్న వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పైనా అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో ఉదయం 11.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ

Most from this category