News


ఆరు ఎంఎన్‌సీ షేర్ల రికమండేషన్లు

Tuesday 11th February 2020
Markets_main1581400093.png-31686

బడ్జెట్లో డిడిటీ(డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌) ఎత్తివేయడం మల్టీనేషనల్‌ కంపెనీలకు మేలు చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు, ఈ ఏడాది డీడీటీ తొలగింపుతో ఎంఎన్‌సీ కంపెనీలకు అత్యంత ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో బడ్జెట్‌ అనంతరం ఎంఎన్‌సీ కంపెనీల షేర్లు మంచి ర్యాలీ జరిపాయి. బడ్జెట్‌ అనంతర వారంలో నిఫ్టీ ఎంఎన్‌సీ సూచీ దాదాపు 4 శాతం లాభపడింది. ఇకపై కూడా వీటి జోరు కొనసాగుతుందని, అందువల్ల ఎంఎన్‌సీ షేర్లను పోర్టుఫోలియోలో తప్పక చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఆటుపోట్ల తరుణంలో ఇవి మంచి డిఫెన్సివ్‌ బెట్స్‌గా పనిచేస్తాయని, అధిక నగదు నిల్వల కారణంగా భారీ డివిడెండ్స్‌ ఇస్తాయని వివరించారు. 

బడ్జెట్‌ అనంతరం సూపర్‌ అప్‌మూవ్‌ చూపుతున్న ఎంఎన్‌సీ షేర్లు, వివరాలు...


అనలిస్టులు- సిఫార్సులు
1. ఆతిశ్‌ మత్లావాలా, ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌: కోల్‌గేట్‌, 3ఎంఇండియా, మారుతీ సుజుకీ.
2. జషాన్‌ అరోరా, మాస్టర్‌ క్యాపిటల్‌: అబాట్‌ ఇండియా, నెస్లె ఇండియా.
3. కుల్‌దీప్‌ తోమార్‌, అడ్వైజరీ మండీ: నిప్పన్‌ అసెట్‌మేనేజ్‌మెంట్‌ ఇండియా.
ఈ షేర్లన్నీ సమీప భవిష్యత్‌లో తోటి కంపెనీల కన్నా మంచి ప్రదర్శన జరుపుతాయని, మంచి ఫలితాలు చూపుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 



You may be interested

1.50శాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 11th February 2020

మార్కెట్‌లో నెలకొన్న కొనుగోళ్లలో భాగంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,230.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 447 పాయింట్లు పెరిగి 31,505.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు

టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్ గా టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ పేరు మార్పు

Tuesday 11th February 2020

113 బిలియన్‌ డాలర్ల టాటా గ్రూపు కంపెనీ అయిన టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌(టీజీబీఎల్‌) పేరును ఇక టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌గా మార్చారు. ఇదే గ్రూప్‌నకు చెందిన టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌(టీసీఎల్‌) కన్జూమర్‌ ఉత్పత్తులను టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ లిమిటెడ్‌(టీజీబీఎల్‌)కు బదిలీ చేసిన నేపథ్యంలో టీజీబీఎల్‌ పేరును టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌(టీసీపీఎల్‌) గా మార్చినట్లు అధికారికంగా టాటా గ్రూప్‌ వెల్లడించింది. టీసీపీఎల్‌ ద్వారా భారత ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Most from this category