News


మార్కెట్లు ముందుకే...: నిపుణుల అంచనాలు

Sunday 25th August 2019
Markets_main1566755624.png-27999

అంతర్జాతీయ సంకేతాలు ఎలా ఉన్నా కానీ, మన స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ ఖాయమంటున్నారు పలువురు నిపుణులు. గత శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు, ప్రోత్సాహక చర్యలు మార్కెట్ల ర్యాలీని నడిపిస్తాయంటున్నారు. విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయాలు, అంచనాలను పరిశీలిస్తే...

 

ఎఫ్‌పీఐలపై పెంచిన సర్‌చార్జీని ఉపసంహరించుకోవడం మార్కెట్లకు చాలా సానుకూలం. బడ్జెట్‌ నాటి నుంచి తరలి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులను ఇది వెనక్కి రప్పిస్తుంది. రూపాయి బలపడేందుకూ కారణమవుతుంది. మొత్తం మీద భారత ఆర్థిక రంగానికి ఇది మంచి సెంటిమెంట్‌ బూస్టర్‌. 

- రస్మిక్‌ ఓజా, కోటక్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌

 

మార్కెట్లలో అమ్మకాలు భారీగా జరుగుతున్న సమయంలో ఆర్థిక రంగ వృద్ధికి అవరోధంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. ఆప్షన్‌ డేటాను పరిశీలిస్తే భారీ షార్ట్‌లు ఉన్నాయి. అమెరికా, చైనా ట్రేడ్‌ వార్‌ కారణంగా మాంద్యం భయాలు పెరిగిపోతున్నాయి. అయితే, భారత మార్కెట్లు ఇక ముందు మంచి పనితీరు చూపించనున్నాయి.

- సందీప్‌ సభర్వాల్‌

 

షి, డోనాల్డ్‌ ట్రంప్‌నకు హానిచేసే పనిలో ఉన్నారు. అమెరికా మాంద్యంలోకి వెళ్లాలని, డౌ పడిపోయి ట్రంప్‌ తిరిగి ఎన్నిక కాకుండా ఉండాలని చైనా కోరుకుంటోంది. కానీ ట్రంప్‌ మాత్రం డౌ నూతన గరిష్టాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ మళ్లీ ఎన్నికవుతారా...? అవుననే ఆలోచించాలి. భారత్‌ చురుగ్గా స్పందించి తగిన విధానాలతో విదేశీ నిధులను ఆకట్టుకోవాల్సిన సమయం ఇది. 
మొదటి బేర్‌ మార్కెట్‌లో నీవు మొత్తం కోల్పోతావు. మార్కెట్‌ నిన్ను తిరిగి సున్నా స్థాయికి తీసుకెళుతుంది. రెండో బేర్‌ మార్కెట్‌లో చాలా వరకు నష్టపోతారు. అయినా నిలబడతారు. మూడో బేర్‌ మార్కెట్‌లో కొంత మేర నష్టపోయినా కానీ, తిరిగి చాలా త్వరగా రివకరీ అవుతారు. లాభాలు సంపాదిస్తారు. నాలుగో బేర్‌ మార్కెట్‌లో ఏది ఫలితమిస్తుందన్నది మీకే తెలుస్తుంది. పెట్టుబడులు ఓ దీర్ఘకాలిక ప్రయాణం.

- బసంత్‌ మహేశ్వరి, పీఎంఎస్‌ ఫండ్‌ మేనేజర్‌

 

నిజాయతీగా చెప్పుకోవాలంటే... భారత్‌ను చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌తో పోల్చడం చెత్త. టోటల్‌ జీడీపీ ఆధారంగా చూస్తే జీడీపీ పర్‌ క్యాపిటా విషయంలో (జీడీపీలో తలసరి వాటా/మొత్తం జీడీపీలో ఒక్కో వ్యక్తి వాటా సగటున) మనం శ్రీలంక, ఇండోనేషియా, వెనెజులా కంటే వెనుకన... కెన్యా, బంగ్లాదేశ్‌కు సమీపంలో ఉన్నాం. వ్యక్తుల జీవన ప్రమాణాలను సూచించే వాస్తవ సూచికే మనకు ముఖ్యం.

- పొరింజు వెలియాత్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ పీఎంఎస్‌ అధినేతYou may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 26th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌:- చైనా దిగ్గజ కంపెనీ కింగ్డావో జింగువాంగ్జెంగ్ కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఒప్పంద పత్రంపై సంతకం చేసింది.  లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌:- ఈక్విటీ, రుణ పద్దతిలో నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.  అదానీ పోర్ట్స్‌:- అర్హత కలిగిన ఇన్వెస్టర్ల నుంచి షేర్ల తిరిగి కొనుగోలు చేసేందుకు(బై బ్యాక్‌) బోర్డు ఆమోదం తెలిపింది. బై బ్యాక్‌ ఇష్యూ సెప్టెంబర్‌6న ప్రారంభమై అదే

స్మాల్‌, మిడ్‌క్యాప్‌లకే ప్రయోజనం ఎక్కువ..: కోటక్‌

Sunday 25th August 2019

ఆర్థిక రంగం తిరిగి కోలుకొని వృద్ధి బాట పడితే స్మాల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలే ఎక్కువ ప్రయోజనం పొందుతాయని కోటక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నీలేష్‌షా అన్నారు. సమస్యల నుంచి ఆర్థిక రంగం కోలుకుని, పరుగులు తీయాలంటే ప్రభుత్వం తాజాగా ప్రకటించిన చర్యల మాదిరి టెంపో ఇక ముందూ కొనసాగాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత శుక్రవారం పలు రంగాలకు సంబంధించి ప్రకటించిన ప్రోత్సాహక చర్యలపై

Most from this category