News


పతనంతో పని లేదు.. మూలాలు బలంగా ఉండాలి..!

Thursday 19th March 2020
Markets_main1584558437.png-32564

సూచీలు జనవరిలో రికార్డు గరిష్టాల నుంచి ఇప్పటికే 30 శాతానికి పైగా పడిపోయాయి. కనుక చౌక విలువలో లభిస్తున్న షేర్ల కొనుగోలుకు (వ్యాల్యూ బయింగ్‌) ఇది అనుకూల సమయమేనా..? లేదా మార్కెట్లు మరింత పడిపోతాయా..? మార్కెట్లు ఎంత వరకు పడిపోతాయన్నది ఎవరూ చెప్పలేని విషయం. ఇప్పటికే చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయాయి కనుక ఈ స్థాయి నుంచి పెట్టుబడులను కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్లడం మంచి విధానంగా నిపుణులు సూచిస్తున్నారు. 

 

‘‘ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల నిధిలో 20-25 శాతాన్ని రెండు మూడు విడతల్లో నాణ్యమైన స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టుకోవాలి. మా క్లయింట్లకు ఇదే సూచిస్తున్నాం’’ అని ట్రేడింగ్‌బెల్స్‌ సీఈవో అమిత్‌గుప్తా తెలిపారు. ట్రేడర్లు ఓవర్‌నైట్‌ పొజిషన్లను కొనసాగించకుండా, ఇంట్రాడేకే పరిమితం కావాలని సూచించారు. అయితే చాలా స్టాక్స్‌ భారీగా పడిపోయి, ఎంతో చౌక ధరలతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వీటిల్లో ఏవి ఎంచుకోవాలి..? అన్న ప్రశ్న రావచ్చు. అప్పుడు కంపెనీ ఫండమెంటల్స్‌ను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. చాలా స్టాక్స్‌ వాటి వ్యాపార పరిస్థితులు బాగోలేక పడిపోవడం లేదు. కరోనా వైరస్‌ వల్లే మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. కనుక ఆర్థికంగా పటిష్ట స్థానంలో ఉన్న కంపెనీలు ఈ సంక్షోభం అనంతరం వేగంగానే రికవరీ అవుతాయి. కనుక కంపెనీ బ్యాలన్స్‌ షీటు, లాభాలు, ఈపీఎస్‌, పీఈ, ఆర్‌వోసీఈ, ఆర్‌ఓఈ తదితర అంశాలను పరిశీలిస్తే కంపెనీ సామర్థ్యం ఏపాటిదో తెలుస్తుంది. 

 

‘‘స్టాక్స్‌ ఎంపికకు ఎన్నో విధానాలున్నాయి. విలువ, వృద్ధి ఆధారిత స్టాక్స్‌కు పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించాలి. ఆర్థిక అంశాల్లో వృద్ధి నికలడ ఉన్నవి, దీర్ఘకాల వ్యాపార అవకాశాలు పారదర్శకంగా ఉన్న స్టాక్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే అధిక డివిడెండ్‌ రాబడి ఉన్న షేర్లు కూడా చౌకగా లభిస్తుంటే అవి సైతం దీర్ఘకాలంలో మంచి విలువను సమకూర్చిపెట్టగలవు’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు.

 

ట్రేడింగ్‌ బెల్స్‌ అమిత్‌గుప్తా సిఫారసులు: కోటక్‌ మహీంద్రా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఐఆర్‌సీటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, 
కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ సీఎస్‌వో రితేష్‌ సిఫారసులు: ఎస్‌బీఐ, జజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ You may be interested

భారత్‌ ‘వృద్ధి’కి ఎస్‌అండ్‌పీ కోత

Thursday 19th March 2020

- 5.7 శాతం నుంచి 5.2 శాతానికి కుదింపు - మూడీస్‌ అంచనాకన్నా తక్కువ న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్‌ దిగ్గజ సంస్థ ఎస్‌అండ్‌పీ కోత పెట్టింది. క్యాలెండర్‌ ఇయర్‌లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా  నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక

మార్కెట్లలో మరింత పెయిన్‌..?

Thursday 19th March 2020

బుధవారం నాటి సెషన్‌లో మార్కెట్లు మూడేళ్ల కనిష్టాలకు చేరాయి. నిఫ్టీ ఇటీవలి కనిష్ట స్థాయి 8,555ను కోల్పోయింది. దీంతో సాంకేతికంగా చూస్తే నిఫ్టీ మరింత దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ కీలకమైన సగటు చలనాలకు దిగువనే ఉండడం ఈ అంచనాలకు మద్దతునిస్తోంది. 14 రోజుల ఆర్‌ఎస్‌ఐ 14 వద్దనుండడం సూచీ తీవ్ర అమ్మకాల జోన్‌లో ఉన్నట్టు సూచిస్తుండడంతో నిఫ్టీ 8,000 దిగువకు చేరే

Most from this category