News


భలే మంచి రోజు...కార్పొరేట్‌ పన్ను తగ్గింపుపై వ్యాఖ్యలు

Friday 20th September 2019
Markets_main1568974429.png-28460

 కేంద్రప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి (అన్ని రకాల సర్‌చార్జీ, సెస్‌ కలిపి) 25.17 శాతానికి తగ్గించి మార్కెట్‌ వర్గాలను శుక్రవారం ఆశ్చర్యపరిచింది. ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు పొందే దేశీయ కంపెనీలు 25.17 శాతం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను, ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు పొందని దేశీయ కంపెనీలు 22 శాతం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను చెల్లించే విధంగా తాజాగా చర్యలను ప్రకటించింది. 22 శాతం స్లాబ్‌ను ఎంచుకున్న దేశీయ కంపెనీలు ఎంఏటీ(మినిమమ్‌ ఆల్టర్‌నేట్‌ ట్యాక్స్‌)ను చెల్లించవలసిన అవసరం లేకుండా చర్యలను తీసుకుంది.  ప్రోత్సాహాకాలను, ప్రయోజనాలను పోందే దేశీయ కంపెనీలు చెల్లించే ఎంఏటీని 18 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయాలపై నిపుణులు, విశ్లేషకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ సంస్థలకు చెందిన నిపుణులు, విశ్లేషకుల వ్యాఖ్యానాలు..

ఇదొక ధైర్యమైన చర్య. దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం సానుకూలంగా ఉంటుంది.
- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌

ఇది అసాధారణమైన ప్రకటన, మేము ఎప్పటి నుంచో కోరుతున్న బిగ్ బ్యాంగ్ సంస్కరణ ఇది. అంతేకాకుండా ఆర్ధిక వ్యవస్థలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలుసనే సానుకూల సంకేతాన్నిస్తుంది. ఈ చర్యను ప్రభుత్వం ప్రకటించడంతో.. దేశీయ మార్కెట్‌లోకి ఎఫ్‌ఐఐ(విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు)ల ఇన్‌ఫ్లో అధికమవుతుంది. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం వలన ఉత్పాదక సంస్థలకు మిగిలే నగదు తిరిగి పెట్టుబడులుగా వ్యవస్థలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అధికంగా ఉద్యోగాలను సృష్ఠించానికి సహాయ పడుతుంది. ఈ చర్య వలన ఫైనాన్సియల్‌ సెక్టార్‌లో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులలో విదేశీ పెట్టుబడిదారులకు ఇండియా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతుంది.
-అజయ్ పిరమల్, పిరమల్ గ్రూప్

ఇండియాలో ఈ రోజు వంటి రోజు ఇంకొకటి ఉండకపోవచ్చు. ఆర్థికమంత్రి, మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇది. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు ప్రపంచంలో ఇంకెక్కడ జరగలేదు. కానీ నేను ఇప్పటికి చెబుతున్నదేంటంటే..ప్రభుత్వ రంగం, ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వం వాటాను 50 శాతానికి తగ్గించుకుంటే అప్పుడు ఇండియా స్థాయి వేరేగా ఉంటుంది.
-అనిల్ అగర్వాల్, చైర్మన్, వేదాంత

ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా ముఖ్యమైనవి. తయారి రంగంపై ప్రభుత్వం దృష్ఠి సారించడంతో ప్రస్తుతం ఈ రంగం, పెట్టుబడులకు ఆకర్షిణియంగా మారింది. కొత్తగా ఏర్పటయ్యే తయారి రంగ కంపెనీలపై విధించిన ట్యాక్స్‌ వినూత్నమైనది, చాలా ముఖ్యమైనది.
-ఆర్ సి భార్గవ, చైర్మన్, మారుతి సుజుకి

పరిశ్రమలో యానిమల్‌ స్పిరిట్‌ను తీసుకురాడానికి ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మార్కెట్‌ 4.5 శాతం పెరగడంతో గత ఐదేళ్లలో అతిపెద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని దేశీయ సూచీలు నమోదుచేశాయి. ఇది అతిపెద్ద షార్ట్‌కవరింగ్‌కి ప్రతీక.
- హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌, హెడ్ - పీసీజీ అండ్‌ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ, వీకే శర్మ

కార్పొరేట్ ఇండియాకు సంబంధించి ఈ ప్రకటన చాలా సానుకూలమైనది. లార్సెన్ అండ్‌ టౌబ్రో, మారుతి సుజుకి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్‌, డాబర్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్, కోల్‌గేట్ పామోలివ్, అల్ట్రాటెక్, బెల్ వంటి కంపెనీలు అధికంగా ట్యాక్స్‌లను చెల్లిస్తున్నాయి. అందుకే వీటిలో అధికంగా షార్ట్‌కవరింగ్‌ జరుగుతోంది.
-ఐడీబీఐ క్యాపిటల్, మార్కెట్ రీసెర్చ్ హెడ్, ఏకే ప్రభాకర్  



You may be interested

మార్కెట్‌కు ముందే దీపావళి..!

Friday 20th September 2019

ఉద్దీపన చర్యల ప్రకటనతో ఉవ్వెత్తున ఎగిసిన సూచీలు 10 ఏళ్లలో సూచీలకిదే అతిపెద్ద లాభం ఒక్క రోజులోనే రూ.7లక్షల కోట్ల సంపద జోడింపు సెన్సెక్స్‌ లాభం 1,921 పాయింట్లు  569.40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రకటించిన ఉద్దీపన చర్యలతో మార్కెట్‌కు ముందే దీపావళి పండుగొచ్చింది. దేశీయ కంపెనీలకు కార్పోరేట్‌ పన్నును  25 శాతానికి ( సెస్సులు, సర్‌ఛార్జీలు కలిపి) తగ్గించడం, అలాగే అక్టోబర్‌ 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త తయారీ రంగ సంస్థల

పదేళ్లలో అతిపెద్ద ర్యాలీ ఇదే..!

Friday 20th September 2019

2279 లాభపడ్డ సెన్సెక్స్‌ 578 పాయింట్లు పెరిగి నిఫ్టీ మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో గురువారం సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు దశాబ్దంలోనే అతిపెద్ద ర్యాలీని చేశాయి. దేశీయ కంపెనీల కార్పోరేట్‌ పన్ను 33శాతం నుంచి 22శాతం తగ్గించడం, కొత్త కంపెనీల కార్పోరేట్‌ పన్ను 25శాతం నుంచి 15శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. ఆర్థిక మంత్రి ప్రకటన అనంతరం మార్కెట్లో వెల్లువెత్తిన కొనుగోళ్లతో

Most from this category