News


ఇన్‌ఫ్రా ప్లాన్‌తో లాభపడే 5 షేర్లివే!

Wednesday 1st January 2020
Markets_main1577869670.png-30589

నిపుణుల అంచనా
తాజాగా కేంద్రం ప్రకటించిన ఎన్‌ఐపీ(నేషనల్‌ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌)తో రూ. 102 కోట్ల పెట్టుబడుల వరద ప్రవహించనుంది. మరో రెండు మూడు రోజుల్లో ఇంకో రూ.3 లక్షల కోట్ల ప్లాన్స్‌ను సైతం ప్రభుత్వం ప్రకటించనుంది. దీంతో మొత్తం ఇన్‌ఫ్రా పెట్టుబడులు రూ. 105 లక్షల కోట్లకు చేరనున్నాయి. దాదాపు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు చేపడతారు. ఈ వ్యయంలో ప్రైవేట్‌ రంగం వాటా 22 శాతం కాగా, కేంద్రం, రాష్ట్రాలు చెరో 39 శాతం వాటా పంచుకుంటాయి. ప్రైవేట్‌ వాటాను 2025కు 30 శాతానికి పెంచుతామని కేంద్రం తెలిపింది. ఈ ప్రకటన ఇన్‌ఫ్రాతో పాటు సిమెంట్‌, నిర్మాణ రంగాలకు మేలు చేసే అంశంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ప్రణాళిక పూర్తి వివరాలు వచ్చాక మరింత స్పష్టత వస్తుందని, పీపీపీ మోడల్‌లో నెలకొన్న సందిగ్ధతలు తొలగిపోతాయని జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ సీఐఎస్‌ విజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. వివాద పరిష్కార యంత్రాంగ వివరాలు కూడా తెలియాల్సిఉందన్నారు. ఈ ప్రణాళిక వృద్ధి పునరుజ్జీవానికి తోడ్పడుతుందని చెప్పారు. క్యాపిటల్‌ గూడ్స్‌, ఇన్‌ఫ్రా రంగాల షేర్లపై పాజిటివ్‌ ప్రభావం ఉంటుందన్నారు. మిడ్‌ టు లాంగ్‌ టర్మ్‌కు ఈ ప్రణాళిక మంచి ఫలితాలు ఇస్తుందని ఐఐఎఫ్‌ఎల్‌ ఈక్విటీస్‌ ప్రతినిధి రేనుబైడ్‌ చెప్పారు. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రణాళిక చాలా అవసరమని ఆమె అన్నారు. నిర్మాణ, ఇన్‌ఫ్రా సంబంధిత రంగాలు ఎన్‌ఐపీతో లబ్ది పొందుతాయని చెప్పారు. ప్రైవేట్‌ రంగ భాగాస్వామ్యంపై మరింత స్పష్టత రావాల్సిఉందని ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ చైర్మన్‌ సుదీప్‌ చెప్పారు.

ఎల్‌అండ్‌టీ, దిలీప్‌ బుల్డ్‌కాన్‌, సద్భావ్‌ ఇన్‌ఫ్రా షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు తెలిపారు. ఇన్‌ఫ్రా సహా సిమెంట్‌రంగంపై కూడా ఈ పాజిటివ్‌ ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ రంగంలో జేకే సిమెంట్‌, హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ప్రభుత్వ ప్రకటనతో మంగళవారం ట్రేడింగ్‌లో పలు ఇన్‌ఫ్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. You may be interested

ఏపీఎల్‌, స్టెర్లింగ్‌ జూమ్‌- డిష్‌మన్‌ బోర్లా

Wednesday 1st January 2020

కొత్త ఏడాది తొలి రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా కొంతమేర మందగించాయి. 2.30 ప్రాంతంలో స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ కౌంటర్లలో కొనుగోళ్లు పెరగడంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. అయితే మరోవైపు ఐటీ సోదాలలో ఖాతాలలో చూపని సొమ్ము లభించినట్లు వెలువడిన వార్తలు డిష్‌మన్‌ కార్బోజెన్‌

షుగర్‌ షేర్ల సూపర్‌ ర్యాలీ

Wednesday 1st January 2020

దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాల్లో తగ్గిన చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఎఫెక్ట్‌ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న చక్కెర రంగ కౌంటర్లు మరోసారి వెలుగులో నిలుస్తు‍న్నాయి. చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి తగ్గిన వార్తలు కొద్ది రోజులుగా షుగర్‌ షేర్లకు డిమాండును పెంచుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా చక్కెర ఉత్పత్తి 2019 డిసెంబర్‌ 15కల్లా 35 శాతం క్షీణించి 4.58 మిలియన్‌ టన్నులను తాకినట్లు దేశీ షుగర్‌ మిల్లుల

Most from this category