News


మరో నాలుగు ఆర్థిక సంస్కరణలపై మోర్గాన్‌స్టాన్లీ దృష్టి

Monday 23rd September 2019
Markets_main1569232011.png-28496

కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన ఇండియాలోకి ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతాయని మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా మేనేజింగ్‌ డైరక్టర్‌ రిధమ్‌ దేశయ్‌ అన్నారు. ‘ప్రైవేట్‌ సైకిల్‌ పుంజుకోనప్పటికి పన్ను తగ్గింపు చర్య వలన దేశంలోకి ప్రైవేట్‌ పెట్టుబడులు ఊపందుకుంటాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ట్యాక్స్‌ తగ్గింపు వలన ఆదాయాల వృద్ధి పెరిగే అవకాశం ఉందని, సెన్సెక్స్‌ ఆదాయాల వృద్ధి అంచనాలను 2020కి గాను 25 శాతానికి, 2021 కి గాను 23 శాతానికి పెంచారు. అంతేకాకుండా సెన్సెక్స్‌ టార్గెట్‌ను(జూన్‌ 2020 నాటికి) 45,000 కు పెంచారు. 
రెండు రోజుల్లో 3,000 పాయింట్లు..
   ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను (సర్‌చార్జీ, సెస్స్‌లు కలిపి) 34.9 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీనితోపాటు మ్యాట్‌(మినిమమ్‌ ఆల్టర్‌నేటివ్‌ ట్యాక్స్‌)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. అక్టోబర్‌ 1న లేదా ఈ తేదీ తర్వాత ఏర్పాటయ్యి, 2023లోపు ఉత్పత్తిని ప్రారంభించే కంపెనీలపై ట్యాక్స్‌ను 17 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని తరగతుల ఇన్వెస్టర్ల మూలధన లాభాలపై విధించే అదనపు సర్‌చార్జీని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. జులై 5 వ తేదిలోపు బై బ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలపై బై బ్యాక్‌ ట్యాక్స్‌ను తొలగించింది. వీటి ఫలితంగా కేవలం రెండు సెషన్‌లలోనే సెన్సెక్స్‌ 3,000 పాయింట్లను ఆర్జించి, 39,000 మార్కును సునాయాసంగా అధిగమించింది.
ఇంకో 4 సంస్కరణలు..
    రాబోయే కాలంలో ఇంకో నాలుగు సంస్కరణలు అమలులోకి వచ్చే అవకాశం ఉందని, ఇవి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి, ద్రవ్యలోటును తగ్గిస్తాయని, ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇండెక్స్‌)లో ఇండియా వెయిటేజిని పెంచుతాయని దేశయ్‌ అంచనావేశారు. 1)రిజర్వ్‌ బ్యాంక్‌ 2019లో ఇప్పటి వరకు 110 బేసిస్‌ పాయింట్ల(బీపీఎస్‌) వరకు రెపో రేటును తగ్గించింది. కానీ ఈ ఏడాదిలో ఇంకోసారి 25 బీపీఎస్‌ రేట్‌ కోత ఉంటుందని దేశయ్‌ అంచనావేశారు. ‘సెంట్రల్‌ బ్యాంక్‌ ఇంకోసారి రేట్ల కోతను చేస్తే అందులో ఆశ్చర్యపోవాలసిన అవసరం లేదు’ అని ఆయన అన్నారు. 2)దీనితో పాటు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు చాలా బూస్ట్‌నిస్తాయని, ప్రభుత్వ నిధులను పెంచి ద్రవ్యలోటు కట్టడికి సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. 3) ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ఎఫ్‌పీఐ(విదేశీ పోర్టుఫోలియో)ల పరిమితిని, ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల పరిమితితో కన్వర్జ్‌ చేస్తున్నట్లు ప్రతిపాదించింది. ఇది చాలా సానుకూల చర్యని, ఇది అమల్లోకి వస్తే ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్‌ ప్రభావాన్ని చూపుతుందని దేశయ్‌ అన్నారు. ‘ ప్రస్తుతం కంపెనీలలో ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్‌ చేయడానికి గరిష్ఠ పరిమితి 24 శాతంగా ఉంది. ఇది ఆ కంపెనీల అభిస్టానుసారం పెంచుకోవచ్చు. ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ, ఎఫ్‌పీఐల పెట్టుబడి మార్గాలను విలీనం చేయడం తెలిసిందే. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌లో ఇండియా వెయిట్‌ 81 బీపీఎస్‌ పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం. 11.4 బిలియన్‌ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు, 2.8 బిలయన్‌ డాలర్ల పరోక్ష పెట్టుబడుల రూపేణా మొత్తం 14.2 బిలియన్‌ డాలర్ల విదేశీ నిధుల ప్రవాహాం ఉంటుందని అంచనా వేస్తున్నాం’ అని దేశయ్‌ జులై నివేదికలో పేర్కొన్నారు. 4) ఇంక నాలుగోవది సావరిన్‌ బాండ్లను జారీ చేయడం. కార్పోరేట్‌ పన్ను తగ్గింపుతోపాటు ఈ నాలుగు సంస్కరణలు మార్కెట్‌లో బేరిష్‌నెస్‌ను పోగొట్టి, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి తోడ్పడతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
మిడ్‌ క్యాప్‌పై మోర్గాన్‌ స్టాన్లీ ఆసక్తి..
మోర్గాన్‌ స్టాన్లీ లార్జ్‌ క్యాప్‌ల కంటే మిడ్‌క్యాప్‌లపై ఆసక్తిగా ఉందని దేశయ్‌ అన్నారు. మిడ్‌క్యాప్‌లు వాల్యుషన్‌ పరంగా ఆకర్షణియంగా ఉన్నాయని, మిడ్‌క్యాప్‌తో పాటు స్మాల్‌ క్యాప్‌ సెక్టార్‌లో రీరేటింగ్‌ జరగవలసిన స్టాకులు మిగిలాయని అన్నారు. ‘రియల్‌ఎస్టేట్‌ రంగం, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు వచ్చే 12 నెలల్లో తిరిగి పుంజుకుంటాయని, ఐటీ, గ్లోబల్‌ మెటిరియల్స్‌, ఫార్మా సెక్టార్‌లపై అండర్‌వెయిట్‌ కలిగి ఉన్నామని దేశయ్‌ తెలిపారు.You may be interested

డిజిన్వెస్ట్‌మెంట్‌ అంచనాలు...బీపీసీఎల్‌ 13 శాతం అప్‌

Monday 23rd September 2019

ట్యాక్స్‌ తగ్గింపుతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు సోమవారం ట్రేడింగ్‌లో భారీ లాభాల్లో ట్రేడయ్యాయి.  ప్రభుత్వం, ఈ ట్యాక్స్‌ తగ్గింపు వలన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొనుందని, ఈ ఒత్తిళ్లను తగ్గించుకోడానికి ప్రభుత్వ రంగ సం‍స్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పక్రియను వేగతరం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో భారత్‌పెట్రోలియం సోమవారం భారీగా పెరిగింది. ఈ షేరు 13.66 శాతం లాభపడి రూ. 459.00 వద్ద ముగిసింది. కాగా సోమవారం రూ.

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల జోరు

Monday 23rd September 2019

కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటనతో ప్రభుత్వరంగ షేర్లు భారీగా లాభాల బాట పట్టాయి.  బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ దాదాపు 3శాతానికి పైగా లాభపడింది. ప్రభుత్వరంగ షేర్లైన ఓఎన్‌జీసీ,  కోల్‌ ఇండియా, ఐఓసీ షేర్లు దాదాపు 5శాతం వరకు ర్యాలీ చేశాయి. కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ఎక్కువగా ప్రభుత్వరంగ కంపెనీలకు లాభాన్ని చేకూర్చుస్తాయనే అంచనాలు ఈ రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.

Most from this category