News


11181 పాయింట్లు దాటితే బలమైన అప్‌మూవ్‌!

Monday 19th August 2019
Markets_main1566210862.png-27871

నిఫ్టీపై నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా
నిఫ్టీ గతవారం ఎంత ప్రయత్నించినా తన 200 రోజుల డీఎంఏ స్థాయిని దాటలేకపోయిందని, ఈ స్థాయిని దాటితేనే బలమైన అప్‌మూవ్‌ ఉంటుందని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రిసెర్చ్‌హెడ్‌ షబ్బీర్‌ కయ్యూమీ అభిప్రాయపడ్డారు. వీక్లీ చార్టుల్లో క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ పరిశీలిస్తే ప్రస్తుతానికి పతనానికి చెక్‌ పడినట్లు భావించవచ్చన్నారు. చార్టుల్లో కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ప్యాట్రన్‌ ఏర్పడిందని, ఈ ప్యాట్రన్‌ పై అవధి 11170 పాయింట్ల వద్ద ఉందని చెప్పారు. దీంతో పాటు ఐదు వారాల ఈఎంఏ స్థాయి 11180 పాయింట్ల వద్ద ఉందన్నారు. పైగా రెండు వారాల గరిష్ఠస్థాయి 11181 పాయింట్ల వద్ద ఉందన్నారు. అందువల్ల నిఫ్టీ అప్‌మూవ్‌కు 11170-11180 పాయింట్లను బలంగా దాటడం అవసరమన్నారు. ఈ స్థాయికి పైన క్లోజయితే బలమైన అప్‌మూవ్‌కు ఛాన్సు ఉంటుందని చెప్పారు.

నిఫ్టీ ‘బేరిష్‌ సైఫర్‌ హార్మోనిక్‌ ప్యాట్రన్‌’లోని సీడీ వేవ్‌ను 110782 వద్ద పూర్తి చేసిందని, అందువల్ల ఈ వేవ్‌కు 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి వరకు అప్‌మూవ్‌ ఉండొచ్చని తెలిపారు. ఇది 11287 పాయింట్ల వద్ద ఉందన్నారు. ఇవన్నీ జరగాలంటే నిఫ్టీ కీలకమైన 10900 పాయింట్లను కాపాడుకోవాల్సిఉంటుందని చెప్పారు. బ్యాంకు నిఫ్టీ దిగువ స్థాయిల్లో బలమైన మద్దతు ఏర్పరుచుకుందని, 28602 పాయింట్లను దాటితే బలమైన అప్‌మూవ్‌ ఉంటుందని అంచనా వేశారు. బ్యాంకు నిఫ్టీ 28వేల పాయింట్లకు పైన ఉన్నంత వరకు ‘పడినప్పుడు కొనొచ్చు’ సూత్రం పాటించవచ్చని సలహా ఇచ్చారు. 



You may be interested

ఆర్థిక మాంద్యం భయాలు..8 ఏళ్లలో అధికం

Monday 19th August 2019

వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం రానుందనే అంచనాతో ప్రతి ముగ్గురు అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్‌లలో ఒకరు ఉన్నారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌(బీఆఫ్‌ఏ-ఎంఎల్‌) తాజాగా నిర్వహించిన సర్వే పేర్కొంది. ఈ సర్వేలో పాల్గొన్న అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్‌లలో 34 శాతం మంది వచ్చే 12 నెలలో ఆర్థిక మాంద్యం రానుందనే అంచనాతో ఉన్నారని, అక్టోబర్‌ 2011 తర్వాత ఇదే అధికమని ఈ బ్యాంక్‌ నివేదిక తెలుపుతోంది. ఈ

గరిష్టస్థాయి వద్ద అమ్మకాలు

Monday 19th August 2019

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు  11050పైన ముగిసిన నిఫ్టీ 50 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాలను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా సోమవారం సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 52.16 పాయింట్లు లాభంతో 37,402.49 వద్ద, నిఫ్టీ  6.10 పాయింట్లు పెరిగి వద్ద 11,053.90 ముగిసింది. సూచీలకిది వరుసగా మూడో లాభాల ముగింపు కావడం విశేషం. మీడియా, ఐటీ, పార్మా రియల్టీ, ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ప్రభ్వుత రంగ,

Most from this category