News


మార్కెట్లో మరింత కరెక‌్షన్‌!

Wednesday 26th February 2020
Markets_main1582710796.png-32112

రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అంచనా
ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ నానాటికీ మరింత విస్తరిస్తోంది. దీంతో అంతర్జాతీయ ఎకానమీలన్నీ భయపడుతున్నాయి. ఇది ఇండియాకు సైతం ప్రమాదకరమేనని, వైరస్‌ విస్తరణ మరింత ముదిరితే ఇండియాసైతం ప్రభావితం అవుతుందని మార్కెట్‌ నిపుణుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ వైరస్‌ చైనాలో దాదాపు 3 వేల మందిని బలికొంది. కరోనా భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నేల చూపులు చూడడం ఆరంభించాయి. ఇండియా ఈక్విటీలు సైతం ఇదే దోవలో కీలక మద్దతులు కోల్పోతున్నాయి. బుధవారం నిఫ్టీ 11700 పాయింట్లకు దిగివచ్చింది. కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని, అందువల్ల మార్కెట్లో మరింత కరెక‌్షన్‌కు ఛాన్సుందని రామ్‌దేవ్‌ చెప్పారు. చైనాలో ఆటో విక్రయాలు పడిపోవడం కరోనా ప్రభావానికి నిదర్శనంగా చెప్పారు. పలు ఉత్పత్తులకు చైనా కీలక ఉత్పత్తిదారు మరియు వినియోగదారని, అందువల్ల చైనా ఎకానమీలో మాంద్యం అన్ని ఎకానమీలకు భయమేనని ఆయన వివరించారు. ఇప్పటికే దేశీయ ఆటో కంపెనీ టీవీఎస్‌ మోటర్స్‌ తన ఉత్పత్తి, విక్రయాలపై వైరస్‌ ప్రభావం ఉందని ప్రకటించింది. 
మరోవైపు ఆర్థిక వ్యవస్థల్లో డిమాండ్‌ పతనంతో క్రూడాయిల్‌ ధర 55 డాలర్ల వద్దకు పడిపోయింది. కమోడిటీ ధరలు పడిపోవడం ఇండియాకు దీర్ఘకాలంలో మంచిదేనని రామ్‌దేవ్‌ చెప్పారు. జీడీపీలో వినిమయం వాటా దాదాపు 66 శాతమని, ఈ రంగానికి చెందిన కంపెనీలు మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. వీటికి కమోడిటీధరల పతనం మరింత కలిసివస్తుందన్నారు. దీంతోపాటు బీమారంగంపై కూడా పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. రాబోయే ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓపై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. బ్యాంకింగ్‌ వ్యాపారంలోకి సచిన్‌ బన్సాల్‌ అడుగుమోపడాన్ని ఆహ్వానించారు. బ్యాంకింగ్‌లో లాభాలు చూడాలంటే కనీసం ఐదేళ్లు ఓపిగ్గా ఉండాలని సూచించారు. ఓపిక పడితే ఈ వ్యాపారం మంచి పురోగతి చూపుతుందని చెబుతూ.. 1996లో రూ. 200 కోట్ల ఈక్విటీ, రూ.1000 కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రస్తుతం రూ.6.5లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిందని గుర్తు చేశారు. You may be interested

కరోనా కలకలం- మార్కెట్‌ వికలం

Wednesday 26th February 2020

392 పాయింట్లు పడిన సెన్సెక్స్‌  నిఫ్టీ 119 పాయింట్ల వెనకడుగు  ఆటో, రియల్టీ, మెటల్‌, ఐటీ డీలా  కరోనా ధాటికి అమెరికా సైతం అప్రమత్తతను ప్రకటించవలసిన పరిస్థితులు తలెత్తడంతో ప్రపంచ మార్కెట్లకు షాక్‌ తగిలింది. మంగళవారం వరుసగా రెండో రోజు అమెరికా మార్కెట్లు 3 శాతం తిరోగమించాయి. దీంతో దేశీయంగానూ ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. వెరసి సెన్సెక్స్‌ 392 పాయింట్లు పతనమై 39,889 వద్ద నిలవగా.. 119 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

కెమికల్‌ షేర్లు.. రేసు గుర్రాలు

Wednesday 26th February 2020

నెల రోజులుగా లాభాల పరుగు జాబితాలో ఎన్‌ఎఫ్‌ఐఎల్‌, ఫెయిర్‌కెమ్‌ నియోజెన్‌ కెమ్‌, దీపక్‌ నైట్రైట్‌, ఆల్కిల్‌ కరోనా వైరస్‌ తలెత్తిన తదుపరి నెల రోజులుగా దేశీ స్పెషాలిటీ కెమికల్‌ కంపెనీలకు డిమాండ్‌ బలపడుతూ వస్తోంది. దీంతో ఫెయిర్‌కెమ్‌ స్పెషాలిటీ, నియోజెన్‌ కెమికల్స్‌, దీపక్‌ నైట్రైట్‌, ఆల్కిల్‌ అమైన్స్‌ తదితర కమోడిటీ కౌంటర్లు నాలుగు వారాల్లో 24-50 శాతం​మధ్య ర్యాలీ చేశాయి. ఈ బాటలో రెండు రోజులుగా నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌ సైతం​దూకుడు చూపుతోంది. మంగళవారం

Most from this category