News


ఇంకో పక్షం రోజులు మార్కెట్లు ఇంతే

Thursday 11th July 2019
Markets_main1562836018.png-26987

  • పీఎస్‌బీ రంగం‍లో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బలంగా ఉన్నాయి
  • ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ పరిశీలించవచ్చు
  • ఆటో రంగం‍లో సిఫార్సు, కొనుగోలుకు విముఖతగా ఉన్నాను: సుదీప్‌ బంద్యోపధ్యాయ్‌

బడ్జెట్‌ వెలువడిన తర్వాత మార్కెట్లు భారిగా దిద్దుబాటుకు గురయ్యాయని, మార్కెట్లు ముందుకు వెళ్లడానికి చాలా తక్కువ కారకాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఇంట్రాడే క్యాపిటల్‌ చైర్మన్‌ సుదీప్‌ బంద్యోపధ్యాయ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే....

కార్పోరేట్‌ ఫలితాలు మార్చగలవు..కానీ..
బడ్జెట్‌ తర్వాత నుంచి మార్కెట్లు భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. కార్పోరేట్‌ ఫలితాలు వంటి కొన్ని కారకాలు మార్కెట్లు తిరిగి పుంజుకోడానికి సహకరించవచ్చు కానీ కంపెనీల ఫలితాలు గొప్పగా ఉంటాయని అనుకోవడం లేదు. వచ్చే పక్షం రోజుల వరకు మార్కెట్లు నెమ్మదిగానే సాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ వార్తలు మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికి ప్రస్తుత పరిస్థితులలో అలాంటివి కనిపించడం లేదు. 

ఇండిగో దురదృష్ఠం..
ఇండిగో కింది స్థాయి  నుంచి మంచి ప్రదర్శన చేస్తూ ఇప్పుడు ఒక స్టార్‌ ఎయిర్‌లైన్‌గా ఎదిగింది. ఎయిర్‌ లైన్‌ను ఎలా నడపాలో ఉదహారణగా నిలిచింది. ప్రస్తుతం ప్రమోటర్ల వివాదం వలన ఇండిగో బాగా నష్టపోతుంది. సీఈఓ బయటకు వచ్చి ఈ వివాదం ఇండిగో పనీతీరుపై ఎటువంటి ప్రభావం చూపదని ప్రకటించినప్పటికి నష్టాలు ఆగడం లేదు. షేరు హోల్డర్ల పరంగా, ఇండిగో పరంగా ఈ వివాదం తీవ్రంగా ప్రభావం చూపింది. జెట్‌ ఎయిర్‌ వేస్‌ వ్యాపారం నుంచి తప్పుకున్నాక ఇండిగోకి మంచి అవకాశాలు దక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో  ఇండిగోకి ఈ వివాదం చుట్టుకోవడం దురదృష్ఠకరం. ఇండిగోలో ఇన్వెస్టమెంట్లకు ప్రస్తుతం వేచి చూడడమే మంచిది. 
     విమానయాన రంగం చాలా సున్నితమైనది. అంతర్గతంగా లేదా బాహ్యంగా ఎటువంటి అస్థిరత్వం ఏర్పడిన అది కంపెనీ పతనానికి దారి తీస్తుంది. ఒక ఇన్వెస్టర్‌గా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిగో కన్నా స్పైస్‌ జెట్‌ను పరిశీలించడం మంచిదని నా అభిప్రాయం. 

వ్యూహాత్మక పెట్టుబడులతో మీడియా ముందుకు..
  దీర్ఘకాల ఆలోచనలతో మీడియా రంగంలో పెట్టుబడులు పెట్టే  వ్యూహాత్మకమైన భాగస్వామి  కోసం మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే అధికంగా వాళ్లు షేరు​హోల్డింగ్‌ కోసం ప్రకటిస్తే అది ఒక విధంగా మంచిదే. జీ కంపెనీ షేరు విలువ ముందు ముందు పెరిగే అవకాశం ఉంది. జీ లో ఏర్పడిన సంక్షోభం​ప్రమోటర్ల రుణాలు, ఇతర వ్యాపారాలలో వారి ప్రమేయమే వలన ఏర్పాడినవి మాత్రమే.  క్రీడేతర మీడియా రంగంలో జీ కి మంచి మార్కెట్‌ వాటా ఉంది.  ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మంచి పనితీరును ప్రదర్శిస్తుంది. కానీ ఓటీటీ(ఓవర్‌ ది టాప్‌) విభాగంలో అధికంగా ఖర్చు చేయడమే కొంచెం ఆందోళన కలిగించే అంశం. ఓటీటీ విభాగంలో పోటిదారులైన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌లతో పోటి పడేందుకు జీ సంస్థకు అధికంగా పెట్టుబడులు అవసరమవుతాయి.  వీటికి ఎంత వరకు పోటి ఇవ్వగలదో ముందు ముందు తెలుస్తుంది. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు రావడంతో జీ షేరు విలువ పెరిగే అవకాశం ఉంది. ఫైనాన్సియల్‌ ఇన్వెస్టర్లు వచ్చిన సమీప కాలంలో ముందుకు వెళ్లగలదు.

ఫైనాన్సియల్‌ సెక్టార్‌లో కొన్ని స్టాకులు..
  ఫైనాన్సియల్‌ సెక్టార్‌లో కొన్ని స్టాకులు బాగా ప్రదర్శన చేసే అవకాశం ఉంది. ఉదా. కాన్‌ఫిన్‌ హోమ్స్‌. హోమ్‌ ఫైనాన్స్‌ సెక్టార్‌లో దీని రిటైల్‌ బుక్‌ విలువ బలంగా ఉంది.  అంతే కాకుండా కెనరా బ్యాంక్‌ ఈ సంస్థ నుంచి నిష్ర్కమించేందుకు ప్రయత్నిస్తున్నందును కొత్తగా వ్యూహాత్మక లేదా ఫైనాన్సియల్‌ ఇన్వెస్టర్లు వచ్చే అవకాశం ఉంది. ఇవన్ని  ప్రస్తుత ధరల వద్ద ఈ స్టాకును ఆకర్షిణియంగా చేస్తున్నాయి. 
      ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ రంగంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లను పరిశీలించవచ్చు. బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌ కోసం నగదు కేటాయించడంతో మూలధన పరంగా, నిర్వహణ పరంగా బలంగా ఉన్న ఈ కంపెనీ మంచి లాభాలను ఇవ్వవచ్చు. రీక్యాపీటలైజేషన్‌ నగదులో 30-40 శాతం క్యాపిటల్‌ వృద్ధి కోసం ఉపయోగించే అవకాశం ఉంది. 
     ప్రైవేటు సెక్టార్‌ ఎన్‌బీఎఫ్‌సీలలో బజాజ్‌ ఫైనాన్స్‌ను పరిశీలించవచ్చు. ఆర్థిక మందగమనం వలన క్యూ1లో డిమాండ్‌ తగ్గినప్పటికి దీర్ఘకాల పెట్టుబడులకు ఇది అనుకూలంగా ఉంది. ప్రస్తుత ధరల వద్ద ఈ షేరును పరిశీలించవచ్చు. లేదా క్యూ1 ఫలితాలు వెలువడిన తర్వాత ఈ షేరు దిద్దుబాటు గురయ్యే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రైవేటు బ్యాంకింగ్‌ సెక్టార్‌లో  ప్రస్తుత ధరల వద్ద యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంకులు బాగున్నాయి. 

ఫలితాలు ఎలా ఉన్న టీసీఎస్‌ ఓకే..
   టీసీఎస్‌ క్యూ1 ఫలితాలను ఊహించినదే. మందగమనం వలన టీసీఎస్‌ బీఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్య్సూరెన్స్‌) ఆదాయం తగ్గుతుందని అంచనా వేశాం.కానీ ఈ తగ్గుదల అంచనాల కంటే ఎక్కువగా ఉంది. ఫలితాలలో గమనించవలసిన ముఖ్యమైన విషయం .. టీసీఎస్‌ డిజిటల్‌ ఆదాయం 40 శాతం పెరగడం. ఇప్పుడున్న వ్యాపారాలలో 1/3వ వంతు డిజిటల్‌ ద్వారానే జరుగుతున్నాయి. టీసీఎస్‌ అంతలా తమ దిశను మార్చగలగడం గమనర్హం. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ఆధారంగా లెక్కించెటప్పుడు అంత పెద్ద సంస్థ అంకెలు నిరుత్సాహాపరచవచ్చు కానీ ప్రాథమికంగా బలమైన సాంకేతికత దీని సొంతం. టీసీఎస్‌ సిపార్సుల జాబీతాలో అందుకే ఉంటుంది. 
    ఇన్ఫోసిస్‌ తన బీఎఫ్‌ఎస్‌ఐ, అమెరికా ఆదాయాలను ఏ విధంగా ప్రకటిస్తుందో వేచి చూడాలి. దీనితో పాటు ఇన్ఫోసిస్‌ అధినాయకత్వంలో అనిశ్చితి వలన వీళ్లను ఏ విధంగా వాడుకుంటారనే విషయంపై దృష్ఠి పెట్టాలి.
పార్మారంగంలో ‘రెడ్డీ’..
పార్మా రంగంలో కొన్ని షేర్లు బుల్లిష్‌గా మారగలవని నమ్ముతున్నాం. సన్‌ పార్మా బాగున్నప్పటికి ఈ షేరు విషయంలో వేచి చూసే దోరణిని అవళింబించాలి. దీర్ఘకాలంలో పార్మారంగంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి డా.రెడ్డీస్‌ను పరిశీలించవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ చైనాలో వేగంగా విస్తరిస్తోం‍ది. అంతేకాకుండా ధరల విషయంలో అమెరికాలో వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో పాటు నియంత్రణ పరిష్కారాలను పొందింది.  మొత్తం మీద డా. రెడ్డీస్‌ షేరు విలువ వచ్చే 6-12 నెలల కాలంలో రూ. 3,100 స్థాయిని అందుకోగలదు. పార్మా రంగంలోని మిడ్‌ క్యాప్‌లో జుబిలియంట్‌ పార్మాను పరిశీలించవచ్చు. ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్నా ప్రత్యేక పార్మా బాస్కెట్‌ ఆశాజనకంగా ఉంది. కానీ యూఎస్‌ ఎఫ్‌డీఏ హెచ్చరికలున్నాయి. ఈ హెచ్చరికలకు తొందరలో పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నాం. ప్రస్తుత ధరల స్థాయిలో జుబిలీయంట్‌ పార్మా షేర్లను పరిశీలించవచ్చు.

ఆటోరంగానికి గడ్డు కాలం... 
   దేశియ ఆటో రంగం గత ఏడాది నుంచి సంక్షోభంలో ఉంది. మందగమనం వలన డిమాండ్‌ తగ్గడంతో పాటు ప్రభుత్వ విధానాలు ఈ రంగం కుదేలవ్వడానికి కారణాలుగా ఉన్నాయి. డిమాండ్ మరల ఎప్పుడు పుంజుకుంటుందో తెలియడం లేదు. దీనితో పాటు ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహానాలను ఆవిష్కరించడానికి ఎక్కువ ప్రాదాన్యం ఇస్తుంది. ఆటో రంగం తక్కువ సమయంలో ఎలక్ట్రిక్‌ వాహానాల వైపు మరలడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఆటో రంగాన్ని విడిచి పెట్టడం మంచిది. ఆటోరంగంలో మారుతి, బజాజ్‌ కంపెనీలు బుల్లిష్‌లోకి వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని సిపార్సు చేయడానికి లేదా కొనుగోలుకు సుముఖంగా లేను.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Thursday 11th July 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం 0.80శాతం(260 పాయింట్లు) మేర లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 185 పాయింట్ల భారీ గ్యాప్‌తో 30,707.00 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ సెక్టార్లో స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో ఆరంభ లాభాల్ని నిలుపుకోలిగింది. ఇంట్రాడేలో ఒకదశలో 260 పాయింట్లు పెరిగి 30,781.70 వద్ద స్థాయికి అందుకుంది. మధ్యాహ్నం గం 2:30ని.లకు షేరు ఇండెక్స్‌

ఇండియా కన్నా చైనా షేర్లపైనే హెచ్‌ఎస్‌బీసీ మక్కువ

Thursday 11th July 2019

 ఇప్పటివరకు భారత కంపెనీల షేర్లపై పాజిటివ్‌గా ఉ‍న్న అంతర్జాతీయ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ తాజాగా చైనా షేర్లపై మక్కువ ప్రకటిస్తోంది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలున్న నేపథ్యంలో భారత్‌ కన్నా చైనా షేర్లు బెటరని తెలిపింది. దశాబ్ద కాలంలో తొలిసారి వడ్డీరేట్ల తగ్గింపునకు సంబంధించి ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ బుధవారం సానుకూలంగా స్పందించారు. నిజానికి గత మేలో హెచ్‌ఎస్‌బీసీ సంస్థ చైనా షేర్‌మార్కెట్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. వాణిజ్యయుద్ధ భయాలతో సంస్థ

Most from this category