ఎగ్జిట్ పోల్స్ నిజమైతే 12వేలకు నిఫ్టీ
By D Sayee Pramodh

దేశీయ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే ఇప్పటివరకు వస్తున్న ఫలితాలు ఉన్నాయి. పోల్ నిపుణులు ఊహించినట్లు ఎన్డీఏ బంపర్ మెజార్టీ సాధిస్తే నిఫ్టీ ఈ రోజే 12వేల పాయింట్లను తాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి అంచనాకు తగ్గట్లే నిఫ్టీ దాదాపు 11960 పాయింట్ల వరకు వచ్చింది. నిఫ్టీ గత నిరోధం 11856ను దాటడం పాజిటివ్ పరిణామమని, అందువల్ల 12వేల పాయింట్లకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. బీజేపీకి అతిపెద్ద ఏకైక పార్టీగా పూర్తి మెజార్టీ దక్కితే నిఫ్టీ 12వేలకు చేరడం ఖాయమని, ఎన్డీఏకు గెలుపు తధ్యమని తెలిస్తే మిడ్, స్మాల్ క్యాప్స్‌లో కదలికల వస్తుందని పేర్కొంది. ర ప్రభుత్వం వస్తుందనే విషయం మార్కెట్‌కు అర్దమైందని, ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఎకానమీపై నమ్మకం పెరిగి సూచీలు మరింత ముందుకు సాగుతాయని సీఎల్ఎస్ఏ తెలిపింది. అయితే వాల్యూషన్లు సూచీల అప్‌మూవ్‌ను పరిమితం చేస్తాయని తెలిపింది. దీర్ఘకాలానికి ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, గోద్రేజ్, ఆర్ఐఎల్, ఐటీసీలను రికమండ్ చేసింది. ఎన్డీఏ విజయం దాదాపు ఖాయమని తెలుస్తోందనది కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. అయితే మార్కెట్లు ఈ విజయాన్ని దాదాపు డిస్కౌంట్ చేశాయని తెలిపింది. అందువల్ల ఫలితాల అనంతరం స్వల్ప ర్యాలీ మాత్రమే ఉండొచ్చని అభిప్రాయపడింది. పలు స్టాకుల వాల్యూషన్లు బాగా అధికంగా ఉన్నాయని, కానీ ఇప్పటికీ అనేక స్టాకుల్లో కొనుగోళ్లకు అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఫలితాల అనంతరం ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, ఎస్బీఐ, అల్ట్రాటెక్, ఎల్అండ్టీ, ఎయిర్టెల్, టైటాన్, కోల్ఇండియా, ఇన్ఫీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఫెడరల్ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, ఇండియన్ హోటల్స్, సీమెన్స్, క్రాంప్టన్ కన్జూమర్, అశోకా బుల్డ్‌కాన్, జేఎస్పీఎల్, గోద్రేజ్ ఆగ్రోవెట్ షేర్లను మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసింది.
You may be interested
బ్యాంకు నిఫ్టీ 3 శాతం అప్
Thursday 23rd May 2019సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లెక్కింపులో గా కేంద్రంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న తరుణంలో మార్కెట్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగుతుంది. బ్యాంకింగ్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్నాయి. ఎన్ఎస్ఈలోని బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ 3శాతానికి పైగా పెరిగింది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంకు ఆఫ్ బరోడా 10.50శాతం పెరిగింది. ఇండస్ ఇండ్ 7శాతం, ఎస్బీఐ 5శాతం, ఫెడరల్ బ్యాంకు 4.50శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యస్ బ్యాంకు 4శాతం పెరిగాయి. కోటక్ బ్యాంకు
గ్యాప్‌అప్ ఓపెనింగ్...సెన్సెక్స్ 480 పాయింట్లు జంప్
Thursday 23rd May 2019లోక్‌సభ ఎన్నికల ఫలితాల తాజా ట్రెండ్స్‌లో ఎన్డీఏ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న కారణంగా గురువారం స్టాక్ సూచీలు భారీగ్యాప్తో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 482 పాయింట్ల లాభంతో సరికొత్త రికార్డుస్థాయి 39,591 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 163 పాయింట్ల గ్యాప్‌అప్‌తో చరిత్రాత్మక గరిష్టస్థాయి 11,900 పాయింట్లపైన ప్రారంభమయ్యింది. కొత్త రికార్డుస్థాయికి ఎస్బీఐ ఇండెక్స్ హెవీవెయిట్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ట్రేడింగ్ ప్రారంభంలో 5 శాతం జంప్‌చేసి చరిత్రాత్మక గరిష్టస్థాయి