నిఫ్టీ పతనం 9700 పాయింట్ల వరకు....!
By D Sayee Pramodh

క్యాపిటల్ ఎయిమ్ రిసెర్చ్ హెడ్ రమేశ్ తివారి
సమీప భవిష్యత్‌లో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక ఆందోళనలు నిఫ్టీని 9700 వరకు దిగజారుస్తాయని క్యాపిటల్ ఎయిమ్ సంస్థ రిసెర్చ్ హెడ్ రమేశ్ తివారి అభిప్రాయపడ్డారు. ఒకటి రెండు త్రైమాసికాల పాటు నిఫ్టీ 10000- 12000 పాయింట్ల మధ్య కదలాడవచ్చని, ఒకమారు కనిష్ఠాలను తాకిన తర్వాతే మరో కొత్త ర్యాలీ ఆరంభమవుతుందని చెప్పారు. ఈ కన్సాలిడేషన్ పూర్తయ్యాక నిఫ్టీ 13000 పాయింట్లను చేరవచ్చని అంచనా వేశారు. ఇవన్నీ జరగడం పరస్పరాధారిత ప్రపంచ ఆర్థిక సంఘటనలను బట్టి ఉంటుందన్నారు. ప్రస్తుతం మందగమన భయాలతో అటు దేశీయంగా, ఇటు విదేశాల్లో ఈక్విటీలు అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. గత దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు చాలా సున్నితంగా, పెళుసుగా మారాయని చెప్పారు. గత శతాబ్దిలో ఎకానమీలను ఇబ్బందిపెట్టిన కోల్డ్‌వార్‌కు ప్రస్తుత ఆర్థిక రూపంగా తాజా ట్రేడ్‌వార్‌ను ఆయన అభివర్ణించారు. యూఎస్, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలే అంతర్జాతీయ ఎకానమీపై తీవ్ర నెగిటివ్ ప్రభావం చూపుతున్నాయన్నారు. వచ్చే ఏడాది పాటు ఎకానమీల్లో తీవ్ర ఒడిదుడుకులుంటాయన్నారు. వీటి నుంచి సహజసిద్ధమైన పొదుపు చర్యలు, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే అలవాటు భారతీయులను కాపాడతాయని అంచనా వేశారు. వచ్చే ఏడాది పాటు మార్కెట్లలో కల్లోలం తప్పదని, అయితే రెండు త్రైమాసికాల అనంతరం ప్రభుత్వ చర్యల కారణంగా మార్కెట్లు కోలుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
సూచనలు...
= ఈ క్రమంలో సరైన కారణం లేకుండానే భారీగా పతనమైన కంపెనీల షేర్లు, స్వల్పకాలానికి నెగిటివ్ అవుట్‌లుక్‌లో ఉన్నప్పటికీ ఎకానమీ పునరుజ్జీవానికి కీలకమైన రంగాలకు చెందిన షేర్లను నమ్ముకోవాలని సూచించారు.
= ఆటో, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, రిటైల్ విభాగాలపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు.
= మారుతీ, హీరో, ఎస్కార్ట్స్, అశోక్‌లేలాండ్, డీఎల్ఎఫ్, ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఏడాది కాలంలో దాదాపు 25 శాతం వరకు రాబడినిస్తాయని అంచనా వేశారు.
You may be interested
కెనరా,పీఎన్బీ జంప్
Friday 16th August 2019మార్కెట్లు శుక్రవారం నెగిటివ్‌గా ప్రారంభమయ్యి..లాభాల్లోకి మళ్లాయి. బ్యాంకింగ్ సెక్టార్ షేర్లు పెరగడం దీనికి దోహదపడుతోంది. కాగా మధ్యాహ్నాం 2.42 సమయానికి నిఫ్టీ ప్రభుత్వరంగ బ్యాంక్ సూచీ 1.41 శాతం లాభపడి 2,601.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో కెనరా బ్యాంక్ 4.57 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 4.27 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.10 శాతం, యూనియన్ బ్యాంక్ 2.77 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా
క్షీణత నుంచి లాభాల్లోకి బ్యాంక్ షేర్లు
Friday 16th August 2019అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వలన దేశియ మార్కెట్లు శుక్రవారం నెగిటివ్‌గా ప్రారంభమై మధ్యాహ్నాం 1.17 సమయానికి పాజిటివ్‌లోకి మళ్లాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ శుక్రవారం 27920.30 పాయింట్ల వద్ద నెగిటివ్‌లో ప్రారంభమవ్వగా, మధ్యాహ్నాం 1.17 సమయానికి 170.60 పాయింట్లు లాభపడి 28189.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో ఈ ఇండెక్స్ 28019.20 ముగియగా, శుక్రవారం ట్రేడింగ్‌లో పతన స్థాయి నుంచి 270 పాయింట్లు పెరగడం గమనార్హం. ఈ