News


భారత్‌ మార్కెట్‌ ఖరీదైనది

Monday 19th August 2019
Markets_main1566200014.png-27864

ఇన్వెస్టర్లు యుఎస్‌ ఈక్విటీల నుంచి బయటకొచ్చి చైనా, జపాన్ మార్కెట్‌లలో ​ప్రవేశించాలని నోమురా, ఆసియా పసిఫిక్ ఈక్విటీ రీసెర్చ్‌ జాయింట్‌ హెడ్‌, జిమ్ మక్కాఫెర్టీ అన్నారు. ‘యుఎస్‌ ఆర్థిక వ్యవస్థను నడిపించే సం‍స్థలలో వాల్‌మార్ట్‌ ముందుంటుంది. ఈ కంపెనీ నుంచి కొన్ని మంచి ఫలితాలను చూశాను.  ఇది వినియోగదారుల విశ్వాసాన్ని తెలుపుతోంది. అదే విధంగా ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, చైనా దిగ్గజ సంస్థ అలీబాబా, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్‌సీఐ)లో ముఖ్యమైనదిగా ఉంది.’ అని మక్కాఫెర్టీ ఆగస్టు 16 న తెలిపారు. భారత మార్కెట్ల గురించి మాట్లాడుతూ..కార్పోరేట్‌ ఆదాయాలు తగ్గడంతో ఇండియా మార్కెట్‌ ఖరీదుగా ఉందని, ఇండియాలోని విశ్లేషకులు ఆదాయ వృద్ధి అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నారని అనుకుంటున్నానని వివరించారు.  భారత దేశ వృద్ధి దీర్ఘకాలంలో ఉందని, కానీ ప్రస్తుతానికి ఇండియా మార్కెట్‌ కంటే చౌకగా ఉన్న మార్కెట్లున్నాయని తెలిపారు. ప్రస్తుతం జపాన్‌ మార్కెట్‌లు ఇతర మార్కెట్‌ల కంటే చౌకగా ఉన్నాయన్నారు. యుఎస్ మార్కెట్ల గురించి మాట్లాడుతూ..యుఎస్‌ మార్కెట్‌ ఈ ఏడాది మొదటి అర్థభాగంలో ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్‌ల కంటే మంచి ప్రదర్శన చేసిందని, ప్రస్తుతం యుఎస్‌ ఈక్విటీల నుంచి బయటకొచ్చి జపాన్‌, చైనా వంటి ఆసియా దేశాలలో పెట్టుబడులు పెట్టడం మంచిదని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు.  చైనా, జపాన్‌ కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లు బలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో అడాగ్‌ షేర్లు

Monday 19th August 2019

అనిల్‌ అంబాని గ్రూప్‌నకు చెందిన అడాగ్‌ షేర్లు సోమవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఈ గ్రూప్‌లోని ప్రధాన షేర్లను రిలయన్స్‌ ఇన్ఫ్రా, రిలయన్స్‌క్యాపిటల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్లు 4శాతం నుంచి 6శాతం క్షీణించాయి.  రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.46.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన షేర్లు మిడ్‌సెషన్‌ కల్లా 6.50శాతం నష్టపోయి రూ.43.20వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Monday 19th August 2019

మార్కెట్‌లో నెలకొన్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా రియల్టీ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 266.40 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ ఒక దశలో 1.60శాతం ర్యాలీకి చేసి 269.35 స్థాయిని అందుకుంది. అత్యధికంగా ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌

Most from this category