News


ఎఫ్‌ఐఐలు అమ్ముతుంటే మనకు కొనే అవకాశం: భాసిత్‌

Friday 19th July 2019
Markets_main1563559707.png-27193

రానున్న 10-12 వారాల సమయం పెట్టుబడులకు మంచి అనువైనదని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌ పథకాల్లో సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. మార్కెట్లో భయం అతిగా ఉందని, ఎఫ్‌ఐఐలు పన్ను భారం కారణంగా వెళ్లిపోతున్నట్టు చెప్పారు. ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని, ప్రస్తుత ప్రతికూల వాతావరణం అక్టోబర్‌ మధ్య వరకే ఉంటుందన్నారు. ఆ తర్వాత నుంచి మన మార్కెట్లు బులిష్‌గా ఉంటాయన్న అంచనా వ్యక్తం చేశారు. ఇటువంటి ఆందోళనకర వాతావరణంలో మిడ్‌, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే మిడ్‌క్యాప్‌ కనిష్టాలకు దగ్గర్లో ఉన్నాయన్నారు. మొత్తం మార్కెట్‌ వ్యాప్తంగా, లార్జ్‌క్యాప్‌లో చక్కని అమ్మకాలు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఇది ఎఫ్‌ఐఐలు మనకిస్తున్న మంచి కొనుగోళ్ల అవకాశంగా అభివర్ణించారు. 

 

ఆర్థిక రంగానికి సంబంధించి సిమెంట్‌ విక్రయ గణాంకాలే స్పష్టమైన సంకేతమని భాసిన్‌ చెప్పారు. ఈ స్థాయి నుంచి ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ఇది తెలియజేస్తోందన్నారు. కనుక ఈ స్థాయి నుంచి వచ్చే మూడు నెలల పాటు కొనుగోళ్లకు మంచి అవకాశంగా చెప్పారు. ఎంపిక చేసిన లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని సూచించారు. స్థూల ఆర్థిక అంశాల్లో బలహీనత లేదని తాను చెప్పడం లేదన్నారు. బాండ్‌ ఈల్డ్స్‌పై వ్యయాన్ని చూడాలని, రూపాయి, అంతర్జాతీయ లిక్విడిటీని కూడా చూడాలని సూచించారు. ఇది కేవలం కొంత సమయం పాటేనని, ఒక్కసారి ఇది ముగిసిపోతే ఎఫ్‌ఐఐల నుంచి మంచి పెట్టుబడుల రాక చూస్తారని పేర్కొన్నారు. వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వ చర్యల కోసం వేచి చూడాలన్నారు. పీఎస్‌బీలకు రీక్యాపిటలైజేషన్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక నుంచి ఎన్నో చర్యల ద్వారా వృద్ధికి ప్రేరణనిచ్చే మంచి అవకాశాలు ప్రభుత్వానికి ఉన్నట్టు చెప్పారు. నిఫ్టీ 11,400 స్థాయి అన్నది సరైన శ్రేణి అని, ఇక్కడి నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని సూచించారు. You may be interested

రిలయన్స్‌ లాభం రూ.10,104 కోట్లు

Saturday 20th July 2019

క్యూ1లో 6.8 శాతం వృద్ధి రికార్డుస్థాయిలో ఆదాయం; రూ.1,72,956 కోట్లు టెలికం, రిటైల్‌ వ్యాపారాల దన్ను... తగ్గిన రిఫైనింగ్‌ మార్జిన్లు... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2019-20, క్యూ1)లో కంపెనీ కాన్సాలిడేటెడ్‌ నికర లాభం(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.10,104 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.9,459 కోట్లతో పోలిస్తే 6.8 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ర్యాలీ... నిలుస్తుందా..?

Friday 19th July 2019

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపులో భాగమైన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ శుక్రవారం జీవితకాల నూతన గరిష్ట స్థాయి రూ.2,370ను నమోదు చేసింది. 7 శాతం లాభంతో రూ.2,317 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండడంతో గత నాలుగు రోజుల్లోనే ఈ షేర్‌ 20 శాతానికి పైగా పెరిగింది. కానీ, గత అక్టోబర్‌లో రూ.1248 కనిష్ట ధర నుంచి చూసుకుంటే 85 శాతం లాభం ఇచ్చింది. కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ స్థాయి

Most from this category