News


గో ఎయిర్‌ ఐపీఓకు సిద్ధం

Thursday 27th June 2019
Markets_main1561632377.png-26634

వాడియా గ్రూప్‌కు చెందిన గో ఎయిర్‌ తన ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)ను పునరుద్ధరించుకునేందుకు సిద్ధపడుతోంది. రూ.1,728-2,074కోట్ల మూలధనాన్ని సమీకరించుకునేందుకు ఐపీఓకి రానుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.‘‘గో ఎయిర్‌ మూల ధనాన్ని సమీకరించుకునేందుకు సీటి, మోర్గాన్‌ స్టాన్లీ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌బ్యాంక్‌లతో సంప్రదింపులు జరుపుతోంది. ఎంత పరిమాణంలో షేర్లను ఐపీఓలో అందుబాటులో పెట్టనుందో ఇంకా నిర్ణయం జరగలేదు. ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఈ నిర్ణయం ఉంది’’ అని అన్నారు. దేశియ విమానయాన రంగంలో మొదటి స్థానంలో ఉన్న ఇండిగో అక్టోబర్‌ 2015లో ఐపీఓకి వచ్చింది. విమానరంగంలో వచ్చిన చివరి ఐపీఓ ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు ఇండిగో షేరు విలువ ఐపీఓ ధర కంటే రెండింతలు పెరిగింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ తన కార్యకలాపాలను నిలిపివేశాక దేశియ విమానరంగం వాటాను అంది పుచ్చుకునేందుకు గో ఎయిర్‌ స్టాక్‌ మార్కెట్‌లో నమోదుకానుంది.  ‘ గో ఎయిర్‌ కొత్తగా ఏ320 నియోస్‌కి చెందిన 144 ఎయిర్‌ బస్‌లను ఆర్డర్లలివ్వనున్న నేపథ్యంలో క్యాపిటల్‌ను పెంచుకోనుంది. జెట్‌ ఎయిర్‌ వేస్‌ కార్యకలాపాలను నిలిపివేశాక ఇండిగో, స్పైస్‌ జెట్‌లు లాభపడ్డాయి. ఈ మార్కెట్‌ వాటాను అందుకునేందుకే గోఎయిర్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది’ అని పరిశీలకులు అన్నారు.  అంతేకాకుండా విదేశి పెట్టుబడుల కోసం కూడా ప్రయత్నిస్తోందని తెలిపారు. డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీ) విడుదల చేసిన సమాచారం మేరకు 49 శాతం మార్కెట్‌ వాటాతో ఇండిగో మొదటి స్థానంలో ఉండగా, స్పైస్‌ జెట్‌ 14.8 శాతం, ఎయిర్‌ ఇండియా 13.5 శాతం, గో ఎయిర్‌ 11.1 శాతం, ఎయిర్‌ ఏసియా 6.3 శాతం, విస్తారా 4.7 శాతంతో తరువాత స్థానాలలో ఉన్నాయి. కాగా సమయానుకూల ప్రదర్శనలో గో ఎయిర్‌ ముందుం‍డగా, ఎయిర్‌ ఏసియా, ఇండిగో తరువాత స్థానాలలో ఉన్నాయి. 



You may be interested

రేపే కేపీఆర్ అగ్రోకెమ్ ఐపీఓ ప్రారంభం

Thursday 27th June 2019

ఇష్యూ ధ‌ర రూ.210 కోట్లు  ధ‌రల‌ శ్రేణి రూ.59-61 ఆంధ్ర‌ప్రదేశ్ ఆధారిత ఆగ్రిక‌ల్చ‌ర్ కేపీఆర్  అగ్రోకెమ్ కంపెనీ ఐపీఓ ఇష్యూ గురువారం ప్రారంభం కానుంది. ఇష్యూ ద్వారా కంపెనీ  రూ.210 కోట్ల‌ను స‌మీక‌రించనుంది. ఐపీఓలో భాగంగా ప్ర‌మోట‌ర్ కంపెనీ, 14 మంది ప్ర‌మోట‌ర్లు మొత్తం 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ ప‌ద్ధ‌తిలో విక్ర‌యిచనున్నారు. ఇష్యూకు ధ‌ర శ్రేణి రూ.59-61ల మ‌ధ్య నిర్ణ‌యించారు. ఐపీఓ ఇష్యూ జూన్ 28న ప్రారంభ‌మైన, జూన్

లాభాల బాటలో టాటా మోటర్స్‌

Thursday 27th June 2019

అటోరంగ దిగ్గజం టాటా మోటర్స్‌ షేర్లు గురువారం 4.50శాతం లాభపడ్డాయి.అటో రంగ షేర్ల ర్యాలీలో భాగంగా నేడు ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.162.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 4.22శాతం ర్యాలీ చేసి రూ.167.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌​ముగింపు సమయానికి (రూ.161.1)తో పోలిస్తే 3 శాతం లాభంతో

Most from this category