News


దేవుడు కూడా ఇన్ఫోసిస్‌ నెంబర్లను మార్చలేడు!

Wednesday 6th November 2019
Markets_main1573022492.png-29393

-నందన్‌ నిలేకని, ఇన్ఫీ చైర్మన్‌
కంపెనీ సొంత దర్యాప్తులో విజిల్‌ బ్లోయర్స్‌ ఫిర్యాదును బలపరిచే ఆధారాలు లభించలేదని ఇన్ఫోసిస్‌ చైర్మన్‌, సహవ్యవస్థాపకుడు నందన్‌నిలేకని బుధవారం వార్షిక విశ్లేషకులు సమావేశంలో అన్నారు. అంతేకాకుండా కంపెనీ సీఈఓ, సీఎఫ్‌ఓలపై గుర్తు తెలియని ఉద్యోగుల నుంచి వచ్చిన ఆరోపణలను ఇన్ఫోసిస్‌ ఖండిస్తున్నదని అన్నారు.  కంపెనీ సహ-వ్యవస్థాపకులు కంపెనీ దీర్ఘకాల వృద్ధికి కట్టుబడి వున్నారని, కంపెనీలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని  తెలిపారు. వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీయడానికే, కంపెనీ సీఈఓ, సీఎఫ్‌ఓపై ఆరోపణలు వెలువడ్డాయని, విజిల్‌బ్లోయర్‌ ఫీర్యాదు దర్యాప్తులో రుజువైతే, కంపెనీ అవసరమైన చర్యలను తీసుకుంటుందని అన్నారు. ‘దర్యాప్తు పూర్తయితే దానికి సంబంధించిన విషయాలను బయటపెడతాం. కానీ దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము’ అని నిలేకని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో కూడా కంపెనీపై వినియోగదారులు నమ్మకం ఉంచారని అభిప్రాయపడ్డారు. ‘ ఇలాంటి పరిస్థితులలో కూడా కంపెనీపై వినియోగదారులు నమ్మకం ఉంచినందుకు ఆనందంగా ఉంది. ఉదయం సలీల్‌(కంపెనీ సీఈఓ) కొత్త లార్జ్‌ డీల్‌ను తీసుకొచ్చారు. కంపెనీకి ఎప్పటిలానే పెద్ద ఒప్పందాలొస్తున్నాయి’ అని వివరించారు. లార్జ్‌ మార్జిన్‌ డీల్స్‌పై నిర్ణయాలను తీసుకునే పూర్తి అధికారం మేనేజ్‌మెంట్‌కు ఉందని అన్నారు. దేవుడు కూడా ఇన్ఫోసిస్‌ నెంబర్లను మార్చలేడని ధీమా వ్యక్తం చేశారు. వార్షిక విశ్లేషకుల సమావేశంలో కంపెనీ భరోసా ఇవ్వడంతో ఇన్ఫోసిస్‌ షేరు 3 శాతానికి పైగా ర్యాలీ చేసింది. మధ్యాహ్నం 12.01 సమయానికి ఇన్ఫోసిస్‌ షేరు విలువ 2.58 శాతం లాభపడి రూ. 714.05  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 696.10 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం సెషన్‌లో రూ. 695.80 వద్ద నెగిటివ్‌లో ప్రారంభమై, రూ. 721.50  వద్ద గరిష్ఠాన్ని తాకింది.



You may be interested

మారుతి అంచనాలను తగ్గించిన సుజుకీ మోటర్స్‌

Wednesday 6th November 2019

దేశీయ కార్ల తయారి సం‍స్థ మారుతి సుజుకీ విక్రయాల అంచనాలను (ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను)ఈ కంపెనీ మాతృ సంస్థయిన సుజుకీ మోటర్‌ కార్పోరేషన్‌(ఎస్‌ఎంసీ) సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్ధంలో ఆటో రంగం మందగమనంలో ఉండడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మారుతి సుజుకీ అమ్మకాలు 20 శాతం పడిపోతాయని అంచనావేసింది. పూర్తి ఏడాదిలో 4 శాతం వృద్ధి ఉంటుందన్న అంచనాల్ని కొద్దినెలల క్రితమే కంపెనీ ప్రకటించింది.  ఈ

అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లు

Wednesday 6th November 2019

ఇటీవల రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన నేప్యథంలో కొన్ని ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. నిన్న ఫలితాలను వెల్లడించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఫలితాలు అంచనాలకు అందుకోకపోవడం, ఏడురోజుల మార్కెట్‌ ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణలో భాగంగా ప్రభుత్వరంగ షేర్లలో అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా నేడు ఎన్‌ఎస్‌ఈలో  ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ

Most from this category