News


ఆందోళనలు తగ్గడంతోనే మార్కెట్‌ ర్యాలీ

Saturday 9th November 2019
Markets_main1573286709.png-29476

-బీఎన్‌పీ పారిబా ఎండీ మనిషి రాయ్‌చౌదరి
‘అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలపై ఆందోళనలు తగ్గుతున్నాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం చూస్తున్నాం. ఇది ఇంకో రెండుమూడు నెలల వరకూ కొనసాగవచ్చు’ అని బీఎన్‌పీ పారిబా ఎండీ, ఈక్విటీ రిసెర్చ్‌ హెడ్‌ మనిషి రాయ్‌చౌదరి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..
ఆర్థిక వ్యవస్థ మెరుగుదల లేకుండానే షేర్లు పెరుగుతున్నాయ్‌...
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు గత నెల రోజులలో మంచి ర్యాలీ చేశాయి. కానీ ప్రాథమిక ఆర్థిక అంశాలలో ఎటువంటి మెరుగుదల లేకుండానే ఈ ర్యాలీ జరగడం గమనార్హం. గతంలో ఆందోళనకు గురిచేసిన అంశాలు సరళతరమవుతుండడంతో ఈ ఈక్విటీ ర్యాలీ జరగిందని చెప్పవచ్చు. ఉదాహరణకు అమెరికా-చైనా మధ్య ఖరారు కానున్న వాణిజ్య ఒప్పందం ఫేజ్‌1పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ నవంబర్‌లో కాకపోతే డిసెంబర్‌లోనైనా అవుతుందని అంచనావేస్తున్నారు. అదేవిధంగా ఒప్పందంలేని బ్రిటన్‌ ఎగ్జిట్‌(బ్రెగ్జిట్‌)పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు. 
   మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతవరణం కూడా ప్రధానమైన చమురు మార్కెట్‌పై తక్కువ ప్రభావాన్ని చూపుతోం‍ది. తాజాగా సౌదీ చమురు క్షేత్రాలపై జరిగిన దాడితో చమురు ధరలు గణనీయంగా పెరిగినప్పటికి, అది రెండురోజులే కొనసాగింది. దీనిని బట్టి గత నెల రోజుల నుం‍చి అంతర్జాతీయ అంశాలపై ఇన్వెస్టర్లకు ఉన్న ఆందోళనలు తగ్గుముఖం పడుతున్నాయనే విషయం అర్ధమవుతుంది.  ఇది వచ్చే రెండు మూడు నెలల వరకూ కొనసాగవచ్చు. అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు వలన ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లోకి నిధుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ అంశాల వలన ఇండియాతో పాటు హాంగ్‌కాంగ్‌, చైనా, కొరియా, తైవాన్‌ వంటి మార్కెట్లు కూడా లాభపడుతున్నాయి. 
ఆర్థిక వ్యవస్థ రికవరి అవుతుంది...
దేశీయ ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు. కానీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు వెలువడే సమయానికి మనం మందగమనంలోనే ఉన్నాం. తాజాగా ఉత్పాదక రంగంలో చూసిన పనితీరు కొనసాగితే, మందగమనం నుంచి బయటపడడం సాధ్యమవుతుంది. ఆర్థిక వ్యవస్థ ఏ సమయంలోనైనా రికవరీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొన్ని రంగాలు మంచి ప్రదర్శన చేయడం ప్రారంభించాయి. రసాయిన రంగాల్లో ఎగుమతులు పెరిగాయి. పండుగ సీజన్‌ ప్రభావంతో ఆటో రంగంలో కొన్ని కంపెనీల అమ్మకాలు గత నెలలో స్వల్పంగా పెరిగాయి. కానీ ఈ కంపెనీ చాలా తక్కువగా ఉండడం గమనించాలి. విస్తృత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన అంశాలు రికవరి అయితే గాని ప్రస్తుత వాల్యుషన్ల వద్ద మార్కెట్‌ ర్యాలీ స్థిరంగా కొనసాగుతుందని చెప్పలేము.
కార్పోరేట్‌ లాభాలు పుంజుకోడానికి ఇంకొంత సమయం..
విస్తృతంగా కార్పోరేట్‌ లాభాలు రికవరి అవ్వడానికి  కనీసం ఇంకో రెండుమూడు త్రైమాసికాలు పడుతుంది. ప్రస్తుత ఫలితాల సీజన్‌ను గమనిస్తే..కన్జ్యుమర్‌ కంపెనీల ఫలితాలు బాగున్నాయి. అదేవిధంగా రిటైల్‌ విభాగంపై అధికంగా దృష్ఠిపెట్టిన ప్రైవేట్‌ బ్యాంకులు మంచి ఫలితాలను ప్రకటించాయి. ఐటీ కంపెనీలు ఫర్వాలేదనిపించాయి. మొత్తంగా ఇవి 30-35 శాతం మార్కెట్‌ క్యాపిటలైజషన్‌కు కారణంగా ఉన్నాయి. వ్యవస్థలో కార్పోరేట్‌ లాభాలు తిరిగి పుంజుకున్నాయి లేదా స్థిరంగా ఉన్నాయనే సంకేతాలను  ఇవి ఇస్తున్నప్పటికి, విస్తృతంగా కార్పోరేట్‌ లాభాలు పుంజుకోడానికి, వ్యవస్థలో వినియోగం పూర్తిగా రికవరి అయ్యేంతవరకు వేచి చూడాలి. దీనికి ఇంకో రెండుమూడు త్రైమాసికాల సమయం పట్టే అవకాశం ఉంది.
   రికవరి అయ్యే ముందు కొన్ని స్టాకులను ఎంచుకోవచ్చు. ఈ స్టాకులు స్వల్ప కాలంలో ప్రతికూలంగా ఉన్నప్పటికి, దీర్ఘకాలానికి గాను ఆశాజనకంగా ఉన్నాయి. ఆటో రంగంలో కార్ల విభాగం వచ్చే ఐదు నుంచి ఏడేళ్ల కాలానికి గాను సురక్షితంగా ఉన్నాయి. వచ్చే 10-15 ఏళ్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ) భారీగా విస్తరిస్తాయని అంచనావేస్తున్నాం. ఆసియాలో ఇతర దేశాలలో కంటే ఇండియాలో వీటి విస్తరణ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చార్జింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు మన దగ్గర అభివృద్ధి చెందలేదనే విషయాన్ని గమనించాలి. You may be interested

నష్టాల్లో ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 9th November 2019

అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు శుక్రవారం రాత్రి నష్టాలతో ముగిశాయి.  అత్యధికంగా ఇన్ఫోసిన్‌ ఏడీఆర్‌ 3.50 నష్టపోయి 9.68డాలరు వద్ద స్థిరపడింది. ఇదే షేరు శుక్రవారం ఇక్కడ 1.64 శాతం నష్టంతో రూ.708.30 వద్ద ముగిసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.14శాతం పతనమై 39.90డాలర్ల వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.46శాతం నష్టపోయి 61.81వద్ద ముగిశాయి. టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 2.15శాతం క్షీణించి 11.86 వద్ద

3నెలల కనిష్టం వద్ద ముగిసిన పసిడి

Saturday 9th November 2019

దేశీయంగా రూ.38వేల కిందకు ...  అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ ధర శుక్రవారం మూడునెలల కనిష్టం వద్ద స్థిరపడింది. అమెరికాలో గత రాత్రి డిసెంబర్‌ కాంటాక్టు ఔన్స్‌ పసిడి 3.50డాలర్లు నష్టపోయి 1,462.90డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా ‘‘మొదటి దశ ఒప్పందం’’ సఫలం దిశగా సాగుతుందనే ఆశావహన అంచనాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను తగ్గించాయి. నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర 1457డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని

Most from this category