News


ఈటీఎఫ్‌ నిధులు వెనక్కి మళ్లితే.. పతనమే!

Tuesday 3rd March 2020
Markets_main1583229368.png-32248

కరోనా వైరస్‌తో సరఫరాలకు అంతరాయం
వినియోగదారునిపై ప్రభావమే ఎక్కువ ఎఫెక్ట్‌ 
చైనా 15 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
రామ్‌దేవ్‌ అగర్వాల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌
 

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ చేయగల చేటును ప్రపంచం తక్కువగా అంచనా వేస్తోంంటున్నారు రామ్‌దేవ్‌ అగర్వాల్‌. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లు, ఈటీఎఫ్‌ పెట్టుబడులు తదితర పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 

ఇటీవల వెలువడిన చైనా గణాంకాలను ప్రపంచం పూర్తిగా అర్థం చేసుకోలేదు. గృహ విక్రయాలు, రవాణా, ఫ్యాషన్‌, ప్రయాణాలు వంటివన్నీ నిలిచిపోయినట్లే. 15 ట్రిలియన్‌ డాలర్లతో చైనా ప్రపంచంలోనే రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. సరఫరా సమస్యలపైనే ప్రపం‍చం​దృష్టిసారించింది. వైరస్‌ సంక్షోభం సమసిపోతే త్వరగానే సరఫరా సమస్యలు తొలగిపోతాయి. అయితే సైకలాజికల్‌గా వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది. దేశీయంగా ఇప్పటికే చికెన్‌, పౌల్ట్రీ వినియోగం 50 శాతం తగ్గిపోయింది. ఈ ప్రభావం ప్రపం‍చవ్యాప్తంగా కనిపించే అవకాశముంది. ఇది ఎలా పరిణమిస్తుందన్నది వేచి చూడవలసి ఉంది. కొంతకాలానికి వైరస్‌ ప్రభావం సమసిపోవచ్చు. ఆపై ఆర్థిక వ్యవస్థలు బౌన్స్‌బ్యాక్‌ సాధించవచ్చు. అయితే ఇందుకు తేదీలే నిర్ణయంకాలేదు.  

సమస్యలున్నాయ్‌
వారం రోజుల క్రితం మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల వద్ద ఉన్నాయి. వారాంతానికల్లా 10-15 శాతం దిద్దుబాటు జరిగింది. ఇంతక్రితం మార్కెట్లకు 9/11లో ఇలాంటి షాక్‌ తగిలింది. అయితే అప్పటికే యూఎస్‌ ఎకానమీ బలహీనంగా ఉంది. అయినప్పటికీ 7-8 రోజుల్లో మార్కెట్లు 16 శాతం పతనమయ్యాయి. ప్రస్తుతం యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. దీంతో 12-13 శాతం నీరసించింది. కరోనా భయాలు అంతటా వ్యాపించడంతో ఎలాంటి పరిణామానికి దారితీస్తాయో ఇప్పుడే చెప్పలేం.

రికవరీ ఎలా
ఈటీఎఫ్‌ నిధులు ఎటు ప్రయాణిస్తే ప్రస్తుతం ప్రపంచం అటువైపే చూస్తోంది. ప్రస్తుతం అత్యధిక లిక్విడిటీ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులలో సైతం సులభంగా మార్పులు చేయగల పరిస్థితులున్నాయి. గత 5-7-10 ఏళ్లలో 4-5 ట్రిలియన్‌ నిధులు ఈక్విటీ ఈటీఎఫ్‌లలోకి ప్రవేశించాయి. ఈ నిధులలో 5 శాతం అంటే 200 బిలియన్‌ డాలర్లను రిడెంప్షన్‌ చేయదలిస్తే.. ఇది ప్రభావాన్ని చూపగలదు. సాధారణంగా ఈటీఎఫ్‌ల నుంచి సమీకరించిన నిధులనే ఎఫ్‌పీఐలు పెట్టుబడులకు వినియోగిస్తారు. దేశీయంగా ఈటీఎఫ్‌ నిధులు తక్కువే అయినప్పటికీ యూఎస్‌లో ఇవి చాలా అధికం. ఇకపై ఈటీఎఫ్‌ పెట్టుబడులు ఎలా స్పందిస్తాయన్నది వేచిచూడాలి. రాత్రికి రాత్రి 200 బిలియన్‌ డాలర్లను వెనక్కి తీసుకున్నా లేదా పెట్టుబడులకు వినియోగించినా మార్కెట్లు నిట్టనిలువునా పతనంకావచ్చు... లేదా ర్యాలీతో దూసుకెళ్లవచ్చు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు బుల్లిష్‌ ధోరణితో ఉన్న వ్యక్తి సైతం బేరిష్‌గా మారిపోవచ్చు.

వినియోగ ప్రభావం
చైనాలో తలెత్తి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో వినియోగం మందగించే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా 50-60 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ రెండు మూడు నెలలపాటు నిలిచిపోతే.. విపత్కర పరిస్థితులు తలెత్తుతాయి. పరిస్థితులు, లేదా భవిష్యత్‌ను అంచనా వేయలేము. ఇన్వెస్టర్లు మార్కెట్లను అంచనా వేయడంకాకుండా పోర్ట్‌ఫోలియో నిర్మాణంపై దృష్టిపెట్టడం మేలు. కొన్ని ఎంపిక చేసుకున్న కౌంటర్లు బాగా దిగివస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్‌మెంట్‌వైపు చూపు సారించవచ్చు.You may be interested

నేలక్కొట్టిన బంతి.. నేటి మార్కెట్‌

Tuesday 3rd March 2020

సెన్సెక్స్‌ 480 పాయింట్ల హైజంప్‌ 170 పాయింట్లు ఎగసిన నిఫ్టీ అన్ని రంగాలూ లాభాల్లోనే  మెటల్‌, ఫార్మా రంగాల దూకుడు రెండు రోజుల వరుస పతనానికి చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌చేసి 38,624 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 170 పాయింట్లు జమ చేసుకుని 11,303 వద్ద నిలిచింది. సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఏకంగా 5 శాతం జంప్‌చేయడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో

20 శాతం లాభాలిచ్చే ఆరు షేర్లు ఇవే..!

Tuesday 3rd March 2020

మార్కెట్లో వరుసగా ఏడురోజుల పాటు బేర్స్‌ వీరవిహారం చేశాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీ వృద్ధి మందగమనం భయాలతో గడిచిన ఏడు ట్రేడింగ్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ 4000 పాయింట్లకు పైగా నష్టపోయి 38,150స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ 1000 పాయింట్లను నష్టపోయి 11150 స్థాయిని కోల్పోయింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్లో నెలకొన్న

Most from this category