News


నష్టాల మార్కెట్లో ఎస్కార్ట్స్‌, వైభవ్‌ హైజంప్‌

Thursday 30th January 2020
Markets_main1580377459.png-31341

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ 

కరోనా వైరస్‌ ఆందోళనలకుతోడు.. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా మధ్యాహ్నం మూడుకల్లా సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనంకాగా.. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనూ ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌, వైభవ్‌ గ్లోబల్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 140 కోట్ల లాభం నమోదుకాగా.. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా క్షీణించి రూ. 1633 కోట్లను తాకింది. నిర్వహణ మార్జిన్లు ​0.9 శాతం బలపడి 13 శాతానికి చేరాయి. కాగా.. ఎస్కార్ట్స్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తున్నట్లు రీసెర్చ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ తాజాగా పేర్కొంది. టార్గెట్‌ ధరను రూ. 830 నుంచి రూ. 900కు పెంచుతున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 807 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 811 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

వైభవ్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో వైభవ్‌ గ్లోబల్‌ దాదాపు రూ. 66 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 25 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం సైతం 10 శాతం పెరిగి రూ. 563 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం​27 శాతం ఎగసి రూ. 82 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వైభవ్‌ గ్లోబల్‌ షేరు 8.4 శాతం జంప్‌చేసి రూ. 1078 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1100 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. You may be interested

6నెలల కాలానికి టాప్‌-5 సిఫార్సులు

Thursday 30th January 2020

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు తక్కువ రిస్క్‌ రివార్డు రేషియో కలిగిన ఐదు షేర్లను సిఫార్సు చేస్తున్నాయి.అవి..... షేరు పేరు: మాస్టెక్‌ రేటింగ్‌:- కొనవచ్చు బ్రోకరేజ్‌ సంస్థ :- హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టార్గెట్‌ ధర:- రూ.510.00 కాల పరిమితి:- 6నెలలు విశ్లేషణ:- సవాలుతో కూడిన వాతావరణంలో ఖర్చులను నియంత్రించగలిగింది. బ్రిటన్‌ ప్రభుత్వంతో సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉన్నందున అక్కడి ప్రభుత్వ రంగంలో ఆఫ్‌షోరింగ్ అవకాశాలను దక్కించుకొని కంపెనీ లాభం పొందుతుంది. అలాగే ఐటీ రంగంలో తన ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ

కరోనా.. కల్లోలం..

Thursday 30th January 2020

గ్లోబల్‌ మార్కెట్లను వణికిస్తున్న వైరస్‌ గురువారం ట్రేడింగ్‌లో భారీగా పతనమవుతున్న ప్రపంచ ఈక్విటీలు చైనాలో ఆరంభమై క్రమంగా పలు దేశాలకు పాకుతున్న కరోనా వైరస్‌ ప్రభావానికి ప్రపంచ మార్కెట్లు, కరెన్సీలు వణుకుతున్నాయి. కరోనా దెబ్బకు పలు దేశాలు చైనాకు విమానాల రాకపోకలు రద్దు చేసుకున్నాయి. ఈ వైరస్‌ ఒక తీవ్ర అంటువ్యాధిగా మారుతుందన్న భయాల నేపథ్యంలో చైనాలో పలు ఆఫీసులు, షాపులు మూసివేస్తున్నారు. దీంతో చైనా ఎకానమీపై తీవ్ర నెగిటివ్‌ ప్రభావం పడుతుందన్న

Most from this category