STOCKS

News


ఎస్కార్ట్స్‌- ఇన్ఫో ఎడ్జ్‌.. దూకుడు

Monday 3rd February 2020
Markets_main1580722844.png-31472

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ 9 శాతం ప్లస్‌
9 శాతం జంప్‌చేసిన ఇన్ఫో ఎడ్జ్‌

ఈ ఏడాది జనవరిలో ట్రాక్టర్ల విక్రయాలు పుంజుకోవడంతో ఆటో రంగ కంపెనీ ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు క్యూకి డిజిటల్‌ మీడియాలో పెట్టుబడుల వార్తలతో ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌, రిక్రూట్‌మెంట్‌ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది జనవరిలో అగ్రి మెషీన్‌ విభాగంలో ట్రాక్టర్ల అమ్మకాలు నెలవారీగా చూస్తే 47 శాతం జంప్‌చేసి 6,063 యూనిట్లను తాకినట్లు ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ పేర్కొంది. డిసెంబర్‌లో 4,114 యూనిట్లనే విక్రయించింది. అయితే 2019 జనవరిలో విక్రయించిన 5991 వాహనాలతో పోలిస్తే తాజాగా 1.2 శాతం వృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలో 3 గంటల ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ షేరు 9.4 శాతం దూసుకెళ్లి రూ. 846కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 35 శాతం ర్యాలీ చేయడం విశేషం!  కాగా.. తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అగ్రి క్రెడిట్‌ లక్ష్యాన్ని రూ. 15 ట్రిలియన్లకు పెంచింది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖలకు రూ. 2.55 ట్రిలియన్లను కేటాయించింది. దీంతో రానున్న కాలంలో ఎస్కార్ట్స్‌ కంపెనీకి లబ్ది చేకూరనున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. 

ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా
డేటా ఆధారిత కొత్త తరహా మీడియా కంపెనీ క్యూకిలో వాటా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 2918 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2924 వరకూ ఎగసింది. అనుబంధ సంస్థ ఐఈ వెంచర్‌ ఫండ్‌-1 ద్వారా క్యూకిలో రూ. 25.2 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఇన్ఫో ఎడ్జ్‌ పేర్కొంది. తద్వారా క్యూకిలో 5.36 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు క్యూకితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
 



You may be interested

బడ్జెట్‌ నష్టాలకు చెక్‌- మార్కెట్లు అప్‌

Monday 3rd February 2020

ఇంట్రాడేలో 40,000 దాటిన సెన్సెక్స్‌  62 పాయింట్లు లాభపడిన నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకులు బోర్లా ఒక్క రోజులోనే బడ్జెట్‌ నష్టాలకు చెక్‌ పడింది. అయితే ఆద్యంతం ఒడిదుడుకులు తలెత్తాయి. చివరికి కొనుగోళ్లదే పైచేయికావడంతో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 137 పాయింట్లు పుంజుకుని 39,872 వద్ద నిలవగా.. నిఫ్టీ 62 పాయింట్లు బలపడి 11,724 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,015 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,563 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌- టీసీఐ ‘ఎక్స్‌ప్రెస్‌’ స్పీడ్‌

Monday 3rd February 2020

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 8 శాతం జూమ్‌ సరికొత్త గరిష్టానికి టీసీఐ ఎక్స్‌ప్రెస్‌  కరోనా వైరస్‌ ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు పతన బాటను పట్టినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. అయితే వారాంతాన కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూస్తున్నాయి. వెరసి లాభనష్టాల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 53 పాయింట్లు బలపడి 40,789ను తాకగా.. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,687

Most from this category