News


ఎస్కార్ట్స్‌, అఫ్లే ఇండియా హైజంప్‌

Monday 2nd March 2020
Markets_main1583124800.png-32203

ఎస్కార్ట్స్‌ షేరుకి ట్రాక్టర్‌ అమ్మకాల దన్ను
అఫ్లేపై మెడిస్మార్ట్‌ మొబైల్‌ కొనుగోలు ఎఫెక్ట్‌

కరోనా వైరస్‌ సునామీలా విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం, ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన కౌంటర్లలో కొనుగోళ్లు చేపట్టడం వంటి అంశాలు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఉదయం 9.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ 525 పాయింట్లు జంప్‌చేసి 38,822కు చేరగా.. నిఫ్టీ 156 పాయింట్లు పురోగమించి 11,358 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఆటో రంగ కంపెనీ ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అఫ్లే ఇండియా లిమిటెడ్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌
గత నెల(ఫిబ్రవరి)లో ట్రాక్టర్ల విక్రయాలు దాదాపు 19 శాతం పెరిగి 8,601 యూనిట్లను తాకినట్లు ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ పేర్కొంది. గతేడాది(2019) ఫిబ్రవరిలో 7240 యూనిట్లను మాత్రమే విక్రయించింది. త్రైమాసిక ప్రాతిపదికన సైతం అమ్మకాలు 19 శాతం ఎగశాయి. నవంబర్‌లో కంపెనీ 6063 ట్రాక్టర్లను మాత్రమే అమ్మగలిగింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 849 వద్ద ట్రేడవుతోంది. 

అఫ్లే ఇండియా లిమిటెడ్‌
మెడిస్మార్ట్‌ మొబైల్‌ను సొంతం చేసుకునేందుకు సింగపూర్‌ అనుబంధ సంస్థ ద్వారా వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అఫ్లే ఇండియా లిమిటెడ్‌ పేర్కొంది. మొబైల్‌ ప్రకటనల టెక్నాలజీ కంపెనీ మెడిస్మార్ట్‌ మొబైల్‌ కొనుగోలుకి మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అఫ్లే ఇండియా షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 1879 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 8.5 శాతం దూసుకెళ్లింది. రూ. 1947 వరకూ ఎగసింది. 
 



You may be interested

రిటైరైన వాళ్లు ఫండ్స్‌లో ఇన్వె‍స్ట్‌ చేయవచ్చా ?

Monday 2nd March 2020

ప్ర: నాకు ఇటీవలనే కొంత మొత్తంలో బోనస్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ డబ్బులను ఖర్చు చేయకుండా మూడేళ్ల తర్వాత వాడుకుందామనుకుంటున్నాను. మూడేళ్ల కాలానికైతే డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమని స్నేహితులు సలహా ఇస్తున్నారు. ఏ తరహా డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది ?  -శ్రావణి, విజయవాడ  జ: డెట్‌ ఫండ్స్‌ గత ఏడాది మిశ్రమ ఫలితాలనిచ్చాయి. డెట్‌ ఫండ్స్‌కు కూడా రిస్క్‌ ఉంటుందని గుర్తించాలి. అయితే గతంలో ఎప్పుడు ఆ రిస్క్‌ డెట్‌

ఫిబ్రవరిలో రూ.1.05 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు

Monday 2nd March 2020

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రూపంలో ఫిబ్రవరి నెలలో రూ.1,05,366 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే 8 శాతం పెరిగింది. అంతేకాదు, ఆర్థిక మందగమన పరిస్థితుల్లో జీఎస్‌టీ ఆదాయం రూ.లక్ష కోట్ల పైనే కొనసాగడం సానుకూలతను తెలియజేస్తోంది. అయితే, ఈ ఏడాది జనవరి నెలలో వసూలైన రూ.1.10 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా తగ్గింది. సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.20,569

Most from this category