News


పడి లేచిన ఈక్విటీ మార్కెట్లు

Thursday 7th November 2019
Markets_main1573121370.png-29418

యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒత్తిళ్లు సరళతరమవ్వడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం సెషన్లో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి తిరిగి కోలుకున్నాయి. అయినప్పటికి ట్రేడ్‌వార్‌కు సంబంధించిన ప్రతి వార్తను గుడ్డిగా నమ్మొద్దని విశ్లేషకులు సలహాయిస్తున్నారు.  కాగా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించుకున్న సుంకాలను తిరిగి వెనక్కి తీసుకునేందుకు యుఎస్‌-చైనా అంగీకరించాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఈ వార్త వెలువడిన తర్వాత, ఇంట్రాడే కనిష్ఠాలను తాకిన బెంచ్‌మార్క్‌ సూచీలు తిరిగి పుంజుకున్నాయి.  నిఫ్టీ 11,946.85 స్థాయి వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకగా మెటల్‌, ఫైనాన్సియల్‌ షేర్లు రాణించడంతో తిరిగి కోలుకుంది. మధ్యాహ్నం 3.15 సమయానికి నిఫ్టీ 12,010 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా  సెన్సెక్స్‌ 40,421 ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి తిరిగి పుంజుకోని 40,646.46 వద్ద ట్రేడవుతోంది. 
    జిందాల్‌ స్టీల్‌, హిందుస్థాన్‌ జింక్‌, హిందల్కో, వేదాంతా, టాటా స్టీల్‌ షేర్లు 9 శాతానికి పైగా ర్యాలీ చేశాయి.  యుఎస్‌-చైనా​మధ్య జరిగే ఏ కొత్త పురొగతినైనా ఇన్వెస్టర్లు గుడ్డిగా నమ్మొద్దని సామ్కో సెక్యురిటీస్‌ ఉమేష్‌ మెహతా అన్నారు. ‘ఇరుదేశాల మధ్య ఫేజ్‌ 1 ఒప్పందం ఖరారయ్యేంత వరకు ట్రేడ్‌వార్‌ ముగింపు 50:50 గానే ఉంటుంది’ అని టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌, సమీర్‌ కల్రా అన్నారు. మార్కెట్‌ ప్రస్తుతం వేచి చూసే ధోరణని అనుసరించాలని డోలాట్‌ క్యాపిటల్‌, ఈక్విటీస్‌ హెడ్‌ అమిత్‌ ఖురానా అన్నారు. ఇరు దేశాల మధ్య టారిఫ్‌ల ఉపశమనం ఎంతవరకుంటుందో అనేది ఫేజ్‌ 1 ఒప్పందంలోని అంశాలపై ఆధారపడి ఉంటుందని, గత రెండు వారాల నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు బాగానే సాగుతున్నాయని చైనా ప్రతినిధి గో ఫెంగ్‌ అన్నారని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక కోట్‌ చేసింది. కాగా ఒప్పందంలోని అంశాలు, వేదిక గురించి చర్చలు జరుగుతుండడంతో, యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సమావేశం డిసెంబర్‌ వరకు ఆలస్యం కానుందని రాయిటర్స్‌ బుధవారం పేర్కొన్న విషయం గమనార్హం.You may be interested

బ్లూచిప్స్‌ పైనే ఫండ్‌ మేనేజర్ల ఆసక్తి

Thursday 7th November 2019

గత రెండేళ్లుగా దలాల్‌-స్ట్రీట్‌ ప్రైజ్‌ యాక‌్షన్‌లో లార్జ్ క్యాప్స్‌ ఆధిపత్యం చెలాయించాయి. రెండో క్వార్టర్లో ఫండ్‌ మేనేజర్ల కొనుగోళ్ల జాబితాలో బ్లూచిప్స్‌ అగ్రస్థానంలో ఉండటం చూస్తే ఈ విషయం అవగతమతోంది. ఈ హవా ఇప్పటికీ కొనసాగుతోందని ఏస్ ఈక్విటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే, సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఫండ్ మేనేజర్లు 388 కంపెనీలలో తమ వాటాను పెంచారు. వీటిలో ఎక్కువ భాగం బడా కంపెనీలే ఉన్నాయి.

ఇకపై ప్రకటించేది భూ, కార్మిక సంస్కరణలేనా?

Thursday 7th November 2019

మార్కెట్‌ వర్గాల అంచనాలు ఇటీవల కాలంలో మందగిస్తూపోతున్న ఎకానమీని పునరుజ్జీవింపజేసేందుకు ప్రభుత్వం పలు రకాల సంస్కరణలు ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా కుదేలైన గృహనిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు బడా ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఆర్థిక వృద్ధి ఈ చర్యలే సరిపోవని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దేశ వృద్ధి రేటు ఇటీవల కాలంలో బాగా తగ్గుతూ వస్తోంది. ఆర్‌బీఐ సైతం తన తాజా వృద్ధి అంచనాలను తగ్గించింది. ఐఎంఎఫ్‌ లాంటి సంస్థలు కూడా ఇదే

Most from this category