News


పతనానికి బ్రేక్‌...సెన్సెక్స్‌ 645, నిఫ్టీ 186 పాయింట్ల ర్యాలీ

Wednesday 9th October 2019
Markets_main1570616704.png-28787

అంతర్జాతీయ పరిణామాలు అనుకూలంగా మారడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ముగిశాయి. ఆరు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి అదేపనిగా పడుతూవస్తున్న స్టాక్‌ సూచీలు ఈ రోజు కనిష్టస్థాయి వద్ద కొనుగోలు మద్దతును పొందగలిగాయి. సెషన్‌ ప్రారంభంలో నిఫ్టీ 11,090 స్థాయికి, సెన్సెక్స్‌ 37,415.83 స్థాయికి పడిపోగా, షార్ట్‌ కవరింగ్‌లు జరగడంతో పాటు, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ స్టాకుల ర్యాలీ తోడవ్వడంతో నీఫ్టీ 11,300 స్థాయిని, సెన్సెక్స్‌ 38,100 స్థాయిని అధిగమించగలిగాయి. గత ఆరు సెషన్‌ల నుంచి నష్టా‍ల్లో ముగిసిన నిఫ్టీ, 11,695 స్థాయి నుంచి పడిపోవడం గమనార్హం.  మొత్తంగా బుధవారం సెషన్‌లో నిఫ్టీ  186.90 పాయింట్లు లాభపడి 11,313.30 వద్ద, సెన్సెక్స్‌ 645.97 పాయింట్లు లాభపడి 38,177.95 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టీ 1,018.30 పాయింట్లు లాభపడి 28,785.85 పాయింట్ల వద్ద ముగిసింది. 
  ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ గురువారం ప్రకటించనున్న క్యూ2 ఫలితాలలో బాటమ్‌లైన్‌(లాభం) వృద్ధి అధికంగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేయడంతో ఈ బ్యాంక్‌ షేరు 5.52 శాతం లాభపడింది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.5 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(4.41 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(4.90 శాతం), ఎస్‌బీఐ(5.10 శాతం) షేర్లు కూడా ర్యాలీ చేయడంతో బ్యాంక్‌ నిఫ్టీ 1000 పాయింట్లు లాభాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా యుఎస్‌-చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్‌వార్‌ వలన, ప్రస్తుత ర్యాలీ మరింత కొనసాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 11,100 వద్ద నిఫ్టీకి మద్ధతు లభిస్తోందని, ఒక వేళ ఈ ర్యాలీ కొనసాగితే 11,400 వరకు కొనసాగవచ్చని చార్ట్‌వ్యూఇండియా. ఇన్‌, మజ్హర్‌ మహ్మద్‌ అన్నారు.  
  నిఫ్టీ 50 సూచిలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 5.52 శాతం, ఇన్ఫ్రాటెల్‌ 5.34 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 5.23 శాతం, ఎస్‌బీఐ 5.10 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 4.92 శాతం పెరిగి, ఈ ఇండెక్స్‌లో లాభపడిన షేర్లలో ముందువరుసలో ఉన్నాయి. అదే విధంగా యస్‌ బ్యాంక్‌ 5.15 శాతం, హీరోమోటర్‌ కార్ప్‌ 2.80 శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 2.37 శాతం, టైటాన్‌ 2.27 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.17 శాతం చొప్పున నష్టపోయాయి. 



You may be interested

మూడు రంగాలపై బుల్లిష్‌

Wednesday 9th October 2019

సుందరం ఎంఎఫ్‌ ఎండీ సునీల్‌ సుబ్రమణ్యం వచ్చే మూడు నాలుగు నెలలకు మార్కెట్లో అప్రమత్తంగా ఉండాలని, ఈ సమయంలో సూచీలు తీవ్ర ఒడిదుడకులు చూపవచ్చని సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సిఈఓ సునీల్‌ సుబ్రమణ్యం చెప్పారు. రాబోయే కాలానికి మూడు రంగాలపై బుల్లిష్‌గా ఉన్నామని, సైక్లిక్స్‌, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. బ్రెగ్జిట్‌, ట్రంప్‌పై అవిశ్వాస పరీక్ష, ట్రేడ్‌వార్‌

వచ్చే ఏడాదికి నిఫ్టీ@13400!

Wednesday 9th October 2019

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా ప్రస్తుతం నిఫ్టీ పైకి పెరగడానికి ఆపసోపాలు పడుతున్నా, త్వరలో తిరిగి వేగం పుంజుకుంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. సంవత్సర కాలానికి నిఫ్టీ టార్గెట్‌ను 13400 పాయింట్లుగా నిర్ణయించింది. అంటే ఇప్పుడున్న స్థాయిల నుంచి దాదాపు 20 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. దేశీయ డిమాండ్‌ రికవరీ వచ్చినకొద్దీ నాణ్యమైన కంపెనీల స్టాకులు జోరు చూపుతాయని తెలిపింది. సంవత్సర కాలానికి బంధన్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, సీమెన్స్‌,

Most from this category